Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భార‌త‌దేశ త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గా నియమితులైన జ‌స్టిస్ శ్రీ రంజ‌న్ గోగోయి


భార‌త రాష్ట్రప‌తి దేశ త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పదవి లో జ‌స్టిస్ శ్రీ రంజ‌న్ గోగోయి ని నియ‌మించారు. ప్ర‌స్తుత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్‌ శ్రీ దీప‌క్ మిశ్రా ప‌ద‌వీవిర‌మ‌ణ అనంత‌రం 2018వ సంవ‌త్స‌రం అక్టోబ‌ర్ 3వ తేదీ న శ్రీ రంజ‌న్ గోగోయి ప‌ద‌వీబాధ్య‌త‌లను స్వీక‌రిస్తారు.

జ‌స్టిస్ శ్రీ గోగోయి 1954వ సంవ‌త్సరం న‌వంబ‌ర్ 18వ తేదీ నాడు జ‌న్మించారు. ఆయ‌న 1978వ సంవ‌త్స‌రం లో న్యాయ‌వాది గా చేరారు. రాజ్యాంగ‌ప‌ర‌మైన అంశాలు, టాక్సేశ‌న్, ఇంకా కంపెనీ వ్య‌వ‌హారాల అంశాల లో గౌహ‌తి ఉన్న‌త న్యాయ‌స్థానం లో ఆయ‌న ప్రాక్టీస్ చేశారు. 2001వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 28 వ తేదీ నాడు ఆయనను గౌహ‌తి ఉన్న‌త న్యాయ‌స్థానం లో శాశ్వ‌త న్యాయ‌మూర్తి గా నియ‌మించ‌డం జ‌రిగింది. ఆయన 2010వ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్ 9వ తేదీ నాడు పంజాబ్ & హ‌ర్యానా ఉన్న‌త న్యాయస్థానానికి బ‌దిలీ అయ్యారు. ఆయ‌న 2011వ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 12వ తేదీ నాడు పంజాబ్ & హ‌ర్యానా ఉన్న‌త న్యాయ‌స్థానానికి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గా నియ‌మితులయ్యారు. 2012వ సంవ‌త్సరం ఏప్రిల్ 23వ తేదీ నాడు భార‌త‌దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం లోని న్యాయ‌మూర్తుల లో ఒక న్యాయ‌మూర్తి గా ఆయన నియ‌మితులయ్యారు.