Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు ఇందౌర్ లో జ‌రిగిన‌ ‘అశరా ముబారాకా’ కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి; స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం

ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు ఇందౌర్ లో జ‌రిగిన‌ ‘అశరా ముబారాకా’ కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి;  స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం

ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు ఇందౌర్ లో జ‌రిగిన‌ ‘అశరా ముబారాకా’ కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి;  స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం

ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు ఇందౌర్ లో జ‌రిగిన‌ ‘అశరా ముబారాకా’ కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి;  స‌భికుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఇందౌర్ లో జ‌రిగిన ‘అశరా ముబారాకా’ లో భారీ జ‌న సందోహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఇమామ్ హుసేన్ (ఎస్ఎ) ప్రాణ స‌మ‌ర్ప‌ణాన్ని స్మ‌రించుకొనేందుకు దావూదీ బోహ్రా స‌ముదాయం ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది.

ఇమామ్ హుసేన్ త్యాగాల‌ను ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెస్తూ, ఇమామ్ ఎల్ల‌ప్పుడూ అన్యాయానికి ఎదురొడ్డి నిలచార‌ని, శాంతి ని మరియు న్యాయాన్ని ప‌రిర‌క్షించ‌డం కోసం ప్రాణ స‌మ‌ర్ప‌ణ చేశార‌ని పేర్కొన్నారు. ఇమామ్ ప్ర‌బోధాలు నేటి కీ సంద‌ర్భ శుద్ధి క‌లిగిన‌వేన‌ని ఆయ‌న అన్నారు. డాక్ట‌ర్ స‌య్యద్‌నా ముఫ‌ద్ద‌ల్ సైఫుద్దీన్ కృషి ని ప్ర‌ధాన మంత్రి శ్లాఘిస్తూ ఆయ‌న ప్ర‌వ‌చ‌నాలలో దేశ ప్ర‌జ‌ల ప‌ట్ల ప్రేమ‌, అంకిత భావం తొణికిసలాడుతాయన్నారు.

ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకుపోయే సంస్కృతి భార‌త‌దేశాన్ని ఇత‌ర అన్ని దేశాల క‌న్నా భిన్నంగా తీర్చి దిద్దుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ‘‘మ‌నం మ‌న గ‌తాన్ని చూసుకొని గ‌ర్వపడుతున్నాం, మ‌నం మ‌న వ‌ర్త‌మానం యెడ‌ల నమ్మకాన్ని క‌లిగివున్నాం, అంతేకాక మ‌న‌ ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు పట్ల మనం విశ్వాసంతో ఉన్నామ’’ని ఆయ‌న చెప్పారు.

దావూదీ బోహ్రా స‌ముదాయం అందించిన సేవలను ప్ర‌ధాన మంత్రి ప్రముఖంగా వివరిస్తూ ఈ స‌ముదాయం భార‌త‌దేశం యొక్క పురోగ‌తి లో, వృద్ధి గాథ లో స‌దా కీల‌క భూమిక ను పోషించింద‌న్నారు. భార‌త‌దేశ సంస్కృతి యొక్క బలాన్ని ప్ర‌పంచవ్యాప్తంగా వ్యాప్తి చేసే ఈ స‌ముదాయం ఈ ఘ‌న‌మైన కృషి ని కొన‌సాగిస్తుంద‌న్న ఆశాభావాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.

బోహ్రా స‌ముదాయం యొక్క వాత్స‌ల్యాన్ని అందుకోవ‌డం తన సౌభాగ్యం అని ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ అన్నారు. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి గా వున్న కాలం లో ఈ స‌ముదాయం త‌న‌కు అందించిన స‌హ‌కారాన్ని ఆయ‌న జ్ఞ‌ప్తి కి తెచ్చుకొంటూ వారి ఆద‌ర‌ణే త‌న‌ ను ఇందౌర్ కు ర‌ప్పించింద‌న్నారు.

దావూదీ బోహ్రా స‌ముదాయం అమ‌లు చేస్తున్న వివిధ సామాజిక కార్య‌క్ర‌మాలను ప్ర‌ధాన మంత్రి కొనియాడుతూ పౌరుల, ప్ర‌త్యేకించి పేద‌ల‌ మ‌రియు ఆర్తుల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగు ప‌ర‌చే విధంగా ప్ర‌భుత్వం చేస్తున్న వివిధ ప్ర‌య‌త్నాల‌ను గురించి వివ‌రించారు. ఈ సంద‌ర్భంలో స్వ‌చ్ఛ భార‌త్ అభియాన్, ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న మరియు ఆయుష్మాన్ భార‌త్ ల వంటి వివిధ అభివృద్ధి ప్ర‌ధాన‌ కార్య‌క్ర‌మాల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ కార్య‌క్ర‌మాలు సాధార‌ణ ప్ర‌జానీకం యొక్క జీవితాల‌లో మార్పు ను తీసుకు వ‌స్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.

‘స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్’ ను ముందుకు తీసుకుపోతున్నందుకు ఇందౌర్ ప్ర‌జ‌ల‌ ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు. ‘స్వ‌చ్ఛ‌తా హీ సేవా’ ప‌థ‌కాన్ని రేపు ప్రారంభించుకోవ‌డం జ‌రుగుతుంద‌ని, ఈ భ‌వ్య‌మైన‌టువంటి స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మం లో చురుకు గా పాలుపంచుకోవ‌ల‌సిందిగా పౌరుల‌కు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

వ్యాపారం లో బోహ్రా స‌ముదాయం చూపిన నిజాయ‌తీ ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ ప్ర‌భుత్వం జిఎస్‌టి, ఇన్‌సాల్వెన్సి అండ్ బ్యాంక్‌ర‌ప్ట‌సి కోడ్ ల ద్వారా నిజాయ‌తీ ప‌రులైన వ్యాపార‌స్తుల‌ ను మ‌రియు శ్రామికుల‌ ను ప్రోత్స‌హిస్తోంద‌ని తెలిపారు. భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి చెందుతోంద‌ని ఆయన చెప్తూ ‘న్యూ ఇండియా’ ఆవిష్క‌ర‌ణ జ‌ర‌గ‌డమే తరువాయి అని పున‌రుద్ఘాటించారు.

మ‌ధ్య ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శ్రీ శివ్ రాజ్ సింహ్ చౌహాన్ కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్నారు. అంత‌క్రితం, డాక్ట‌ర్ స‌య్యద్‌నా ముఫ‌ద్ద‌ల్ సైఫుద్దీన్ ప్ర‌ధాన మంత్రి ని ఆయ‌న చేస్తున్న ఆద‌ర్శ‌ప్రాయ‌మైన కృషి కి గాను ప్ర‌శంసించారు; దేశం కోసం ఆయ‌న చేస్తున్న కృషి స‌ఫ‌లం కావాల‌ని కూడా ఆకాంక్షించారు.