Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశవ్యాప్తంగా ఉన్న ఎఎస్‌హెచ్ఎ, ఎఎన్ఎమ్, ఇంకా ఆంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్ల తో వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా జరిగిన స‌మావేశం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం పాఠం


 

మీ అంద‌రితో నేరు గా సంభాషించ‌డం కోసం నా తరఫు నుండి ఇది తొలి ప్రయత్నం.  దేశం లోని దాదాపు ప్ర‌తి బ్లాకు నుండి మీరు నా తో ముఖాముఖి సమావేశం లో పాలుపంచుకొంటున్నట్టు అధికారులు నా దృష్టి కి తీసుకువచ్చారు.  ఎఎస్‌హెచ్ఎ వ‌ర్క‌ర్లు, ఆంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు, అలాగే ఎఎన్ఎమ్ లు.. మీరందరూ దేశ నిర్మాణం కోసం ముందు వ‌రుస లో నిల‌బ‌డిన సైనికులు.  మీ ప్ర‌మేయం లేకుండా ఆరోగ్యవంతమైన మాతృత్వాన్ని ఊహించ‌డం అత్యంత క‌ష్ట‌ సాధ్యమైనటువంటి విషయం.  దేశ పునాది రాయి ని మ‌రియు దేశం యొక్క భ‌విష్య‌త్తు ను బ‌ల‌ప‌ర‌చ‌డం లో మీరు ఒక కీల‌క‌ భూమిక ను పోషిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.  ప్ర‌తి ఒక్క మాత‌ యొక్క భ‌ద్ర‌త‌ వలయాన్ని, ప్రతి ఒక్క శిశువు యొక్క భ‌ద్ర‌త‌ వలయాన్ని ప‌టిష్టపరచే బాధ్య‌త‌ ను మీరు మీ భుజాల‌ కు ఎత్తుకొన్నారు.  ఈ భ‌ద్ర‌త వ‌ల‌యం లో మూడు కోణాలు ఉన్నాయి.  ఒక‌టో కోణం పోష‌క విలువ‌లు, అంటే త‌గిన ఆహారాన్ని తీసుకోవ‌డం,  రెండోది టీకామందు; మూడోది ప‌రిశుభ్ర‌త‌.  ఈ కోణాలను గురించి ప్ర‌జ‌ల‌ కు అంతకు ముందు తెలియ‌ద‌నుకోవ‌డం లేదా ఈ అంశాలకు చెందిన ప‌థ‌కాలు అమ‌లు లోకి రాన‌ప్పుడు వీటిని గురించి ప్రజలకు తెలియదు అనుకోవడం అనుచితం అవుతుంది.  ఈ అంశాల‌కు సంబంధించి- స్వాతంత్య్రం అనంత‌ర కాలం లో- అనేక కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డ‌మైంది.  అయితే అవి స్వల్పంగానే విజ‌యవంతం అయ్యాయి.  త‌క్కువ వ‌న‌రులు క‌లిగిన దేశాలు సైతం ఈ అంశాల లో మన కన్నా ముందుకు పోయాయి.  అవి మ‌న‌ క‌ంటే మెరుగ్గా పనిచేస్తున్నాయి.  ఈ ముఖచిత్రం లో నుండి బ‌య‌ట‌కు రావ‌డానికని, మేము 2014వ సంవ‌త్స‌రం లో ఓ కొత్త వ్యూహం పైన పని చేయ‌డం మొదలుపెట్టాం.

‘మిశన్ ఇంద్ర‌ధ‌నుష్’ను గురించి మీ అంద‌రూ ఎరుగుదురు.  ఇందులో భాగంగా దేశం లోని మారుమూల ప్రాంతాల చిన్నారులకు మ‌రియు వెనుక‌బ‌డిన ప్రాంతాల చిన్నారుల‌కు టీకా మందు ను వేయాల‌ని ఒక ల‌క్ష్యాన్ని పెట్టుకోవ‌డమైంది.  ఈ ఉద్య‌మాన్ని మీరు శ‌ర వేగంగా ముందుకు తీసుకు పోయారు.  85 ల‌క్ష‌ల‌కు పైగా గ‌ర్భ‌వ‌తుల‌కు టీకా మందు ను వేయ‌డం జ‌రిగింది.  బాల‌లు మెదడువాపు (ఎన్‌సెఫ‌లైటిస్) బారిన ప‌డుతున్నార‌న్న సంగ‌తి ఉత్త‌ర్ ప్ర‌దేశ్ తూర్పు ప్రాంతం లో మ‌రియు దేశం లోని తూర్పు ప్రాంతాల లో ఉన్న వ‌ర్క‌ర్ల కు తెలిసినటువంటి విష‌య‌మే.  ఇటువంటి వ్యాధుల తో పోరాడ‌డానికి యూనివ‌ర్స‌ల్ ఇమ్యూనైజేశన్ ప్రోగ్రామ్ లో భాగంగా అయిదు కొత్త టీకా మందుల‌ను- జ‌ప‌నీస్ ఎన్‌సెఫ‌లైటిస్ తో సహా- ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది.  రెండు సంవ‌త్స‌రాల కింద‌ట ‘ప్ర‌ధాన మంత్రి సుర‌క్షిత్ మాతృత్వ అభియాన్’ ను ప్రారంభించ‌డమైంది.  ఈ ప‌థ‌కం అమ‌లు లో మీరు అందించిన తోడ్పాటు ఎన‌లేనిది.  మీరు నాతో క‌ల‌సి ప్ర‌యాణిస్తున్నారు.  ఇంత‌కు ముందు కేవ‌లం దైవానికి వేయి బాహువులు ఉండేవ‌ని చెప్పుకొనే వారు.  వేయి భుజాల‌ను జోడించ‌లేమనుకోండి;  దీని భావం దైవం జ‌ట్టు లో 500 మంది ఉండే వార‌నీ, వారు అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం లో దైవానికి చేయూత‌గా నిల‌చేవార‌నీనూ.  ఈ రోజున, దేశ ప్ర‌ధాన మంత్రి వేయి కి బ‌దులుగా ల‌క్ష‌లాది చేతులు ఉన్నాయ‌ని అనుకోవ‌చ్చును.  మ‌రి మీరంద‌రూ నా చేతులే, నాకు స్నేహితులే.

మిత్రులారా,

స్వ‌స్థ‌త అనేది పోష‌క విలువ‌ ల‌తో నేరుగా ముడిప‌డిన‌టువంటిది.  పైపెచ్చు, పోష‌క విలువలు అనేవి ‘ఒక‌రు ఏమి తినాలి ?, లేదా ఏ విధంగా భుజించాలి ?’ అనే అంశానికి మాత్ర‌మే ప‌రిమితం కాదు.  ప‌రిశుభ్ర‌త, ఇంకా టీకా మందు వేయించుకోవ‌డం అనేవి కూడా అత్యంత ఆవ‌శ్య‌కాలే.  చిన్న‌త‌నం లోనే పెళ్ళి కూడా ఈ స‌మ‌స్య కు దారి తీస్తున్న ప్ర‌ధాన కార‌ణాల‌ లో ఒక‌టని తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.  వివాహం మ‌రియు మాతృత్వం స‌రైన వ‌య‌స్సు లో జ‌ర‌గాలి.  స‌రైన వ‌య‌స్సు క‌న్నా ముందుగానే మాతృత్వం వ‌స్తే అది అటు త‌ల్లి కి, ఇటు శిశువుకు.. వారి ఆరోగ్యానికి ముప్పు గా ప‌రిణ‌మించ‌వ‌చ్చు.

భోజనం చేసే క‌న్నా ముందు చేతుల‌ను మ‌నం శుభ్రం చేసుకోవడం లేదూ ?   ఇటువంటి అనేక అంశాలతో పోష‌క విలువ‌లు ముడిప‌డి ఉన్నాయి.  దీనిని దృష్టి లో పెట్టుకొని జాతీయ పోషణ్ అభియాన్ ను రాజ‌స్థాన్ లోని ఝుంఝునూ నుండి ఈ సంవ‌త్స‌రం దేశ‌ వ్యాప్తం గా ప్రారంభించ‌డం జ‌రిగింది.  ఇది ఒక మ‌హ‌త్వాకాంక్ష క‌లిగినటువంటి ఉద్య‌మం.  ఇది ఒక పెద్ద స‌వాలు.  అయితే, ఈ స‌వాలు ను కేవ‌లం నా కోసం నేను స్వీక‌రించ‌లేదు.  ఈ స‌వాలు ను స్వీక‌రించ‌డం మీ ప‌ట్ల నాకు ఉన్న న‌మ్మ‌కాన్ని ప్ర‌తిబింబిస్తోంది.  మీరు మీ యొక్క యోగ్య‌త‌ ను రుజువు చేసుకొన్నారు.  మ‌రొక్క మారు మీరు అదే ప‌నిని చేయనున్నారు.  మీ ప‌ట్ల ఉన్న న‌మ్మ‌కం తోనే మేము ఈ స‌వాలు ను స్వీక‌రించాం.  పోష‌ణ్ అభియాన్ యొక్క ధ్యేయాల‌ ను ప్ర‌తి ఒక్క మాతృమూర్తి కి మ‌రియు చిన్నారికి అంద‌జేయ‌డం లో మ‌నం సాఫ‌ల్యాన్ని సాధిస్తే, అటువంటప్పుడు ల‌క్ష‌లాది జీవితాలు కాపాడ‌బ‌డుతాయి.  ఇది దేశ అభివృద్ధి కి ఒక నూతనోత్తేజాన్ని అందించ‌గ‌లుగుతుంది.

మునిగిపోతున్న ఒక వ్య‌క్తి ని ఎవ‌రో కాపాడార‌న్న సంగ‌తిని అప్పుడప్పుడు మనం విని ఉంటాం.  ఆ వ్య‌క్తి పేరు అత‌డి ప‌ల్లె లో మారుమోగుతుంది.  ఒక్కొక్క‌ సారి ఒక వ్య‌క్తి మ‌రొక‌రిని రైలు కింద ప‌డి న‌లిగిపోకుండా ర‌క్షించిన విషయాన్ని మ‌నం విని ఉంటాం.  ఈ వార్త‌ ను ఇప్పుడే అందిన వార్త‌ అంటూ అన్ని టెలివిజ‌న్ ఛాన‌ళ్ళు ప్రసారం చేయడం ప్రారంభిస్తాయి.  మరియు వార్తా ప‌త్రిక‌లు కూడా ప్రచురిస్తాయి.  అయితే, చిన్న పిల్లలు, అమాయ‌కులైన బాల‌ల ప్రాణాల‌ను మీ క‌ఠోర శ్ర‌మ తో, త్యాగం తో మ‌రియు త‌ప‌స్సు తో ప్ర‌తి రోజూ ర‌క్షిస్తున్న‌ారు.  ఒక వైద్యుడు లేదా వైద్యురాలు త‌న జీవిత ప‌ర్యంతం లెక్క‌లేనంత మంది ప్రాణాల‌ను ర‌క్షిస్తారు.  నాకు అప్పుడ‌ప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఏమని అంటే ఎఎస్ హెచ్ ఎ (‘ఆశా’) వ‌ర్క‌ర్లు మ‌రియు ఆంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు మ‌రింత మంది ప్రాణాల‌ను కాపాడుతూ వస్తున్నారని.

ఈ పోష‌ణ మాసాన్ని స‌ఫ‌లం చేసేందుకు క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తున్న 24 లక్ష‌ల‌ కు పైగా వ‌ర్క‌ర్ల కు- ప‌గ‌ల‌న‌కా, రాత్ర‌న‌కా ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడుతున్నందుకు, అందుకోసం ప‌రిశ్ర‌మిస్తున్నందుకు- నేను న‌మస్క‌రిస్తున్నాను.  ఈ రోజున మీకు ప్ర‌ణామాలు చేసే అవ‌కాశం నాకు చిక్కింది.   మీ స‌వాళ్ళు, ఈ ఉద్య‌మ కాలం లో మీకు ఎదుర‌య్యే అనుభ‌వాలు మ‌రియు మీ స‌ల‌హాలు చెబితే వినాల‌ని నేను ఆతృత‌ తో ఎదురు చూస్తున్నాను.  ఎందుకంటే మీ సూచ‌న‌లు ఈ ప‌థ‌కం లోని లోటుపాటు లను అధిగ‌మించ‌డం కోసం మాకు స‌హాయ‌కారి అవుతాయి.  ఎల్ల‌ప్పుడూ ఎయిర్ కండిష‌న్డ్ గ‌దుల‌ లో ఉండే మా బోటి వారం స‌మ‌స్య‌ల‌ ను ప‌రిష్క‌రించ‌లేం.   మీరు చెప్పే మాట‌ల‌ను యావ‌త్తు దేశ ప్ర‌జ‌లు విన్న‌ప్పుడు, ల‌క్ష‌లాది ఇత‌ర సోద‌రీమ‌ణులు మ‌రియు వ‌ర్క‌ర్లు మీ యొక్క అనుభ‌వం నుండి పాఠాలను నేర్చుకోగ‌లుగుతారు.  ఈ కార‌ణం గానే మీరు చెప్పే మాట‌ల‌ను నేను ఆల‌కించదలుస్తున్నాను. 

**