Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ప్రగతి’ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ

‘ప్రగతి’ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ

‘ప్రగతి’ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి సంభాషణ


 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఐసిటి ఆధారితమైన మల్టి- మోడల్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ప్రొ- యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్ లీ ఇంప్లిమెంటేశన్ (పిఆర్ఎజిఎటిఐ.. ‘ప్రగతి’)  మాధ్యమం ద్వారా ఈ రోజు జ‌రిగిన ఇరవై తొమ్మిదో ముఖాముఖి స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ప్ర‌ధాన మంత్రి టెలికమ్యూనికేష‌న్స్ రంగానికి సంబంధించిన ఫిర్యాదుల ప‌రిష్కారం లో పురోగ‌తి ని స‌మీక్షించారు.  ఇటీవ‌ల చోటు చేసుకొన్న సాంకేతిక విజ్ఞాన ఆధారిత నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు స‌హా ఈ రంగం లో నమోదైన పురోగ‌తి ని అధికారులు ఈ సంద‌ర్భంగా ఆయ‌న దృష్టి కి తీసుకు వ‌చ్చారు.  టెలికం రంగం లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారం అధునాత‌న‌మైన సాంకేతిక విజ్ఞానాధారితమై వుండాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు.  ఒక ఉన్న‌త స్థాయి తో కూడినటువంటి వినియోగ‌దారు సంతృప్తి ని త‌ప్ప‌క స‌మ‌కూర్చాల‌ని సేవా ప్ర‌దాత‌లకు ఆయ‌న స్ప‌ష్టం చేశారు.  

ఇంత వ‌ర‌కు జ‌రిగిన ఇర‌వై ఎనిమిది ‘ప్ర‌గ‌తి’ స‌మావేశాల లో మొత్తం 11.75 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా పెట్టుబ‌డి తో కూడిన ప‌థ‌కాల ను స‌మీక్షించ‌డ‌మైంది.  ప‌లు రంగాల లో ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కారం పైన కూడా స‌మీక్ష జ‌రిగింది.

నేటి ఇర‌వై తొమ్మిదో స‌మావేశం లో రైల్వే లు, ప‌ట్టణాభివృద్ధి, ర‌హ‌దారులు, విద్యుత్తు, ఇంకా బొగ్గు రంగాల లోని ఎనిమిది ముఖ్య‌మైన మౌలిక స‌దుపాయాల ప్రోజెక్టుల లో పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి స‌మీక్షించారు.  ఈ ప్రోజెక్టులు ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, జ‌మ్ము & క‌శ్మీర్‌, హ‌రియాణా, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర, క‌ర్నాట‌క‌, ఝార్ ఖండ్‌, ఒడిశా, ఇంకా ప‌శ్చిమ బెంగాల్ స‌హా అనేక రాష్ట్రాల లో విస్త‌రించి ఉన్నాయి.

ప్ర‌ధాన మంత్రి ఖ‌నిజ్ క్షేత్ర క‌ళ్యాణ్ యోజ‌న ప‌నితీరు ను, ప్ర‌త్యేకించి డిస్ట్రిక్ట్ మిన‌ర‌ల్ ఫౌండ‌ష‌న్స్ యొక్క ప‌నితీరు ను ప్ర‌ధాన మంత్రి శ్రీ మోదీ స‌మీక్షించారు.  అనేక ఖ‌నిజ సంప‌న్న జిల్లాల‌ కు ప్ర‌స్తుతం వ‌న‌రులు గ‌ణ‌నీయ‌మైన స్థాయి లో అందుబాటు లో ఉన్నాయ‌న్న సంగ‌తి ని ఆయ‌న పేర్కొంటూ, కేంద్ర స్థాయి మరియు రాష్ట్ర స్థాయి నిధుల‌ను ‘జీవ‌న నాణ్య‌త‌ లో ఒక గుణాత్మ‌క‌మైన మెరుగుద‌ల’ను సాధించ‌డం కోసం, ఈ జిల్లాల లో ప్ర‌జ‌ల జీవ‌న సౌల‌భ్యం కోసం వినియోగించాల‌ని అధికారులకు విజ్ఞ‌ప్తి చేశారు.  ఇది ఈ జిల్లా లలో భాగమైన మ‌హ‌త్వాకాంక్ష భరిత జిల్లాల ను చాలా కాలంగా అవి ఎదుర్కొంటున్నటువంటి అభివృద్ధి లోటు నుండి బ‌య‌ట‌కు తీసుకు రావ‌డానికి ఒక అవ‌కాశం కూడా అని ఆయ‌న పేర్కొన్నారు.