Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియం లో జ‌రిగిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియం లో జ‌రిగిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియం లో జ‌రిగిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఢిల్లీ లోని తాల్ కటోరా స్టేడియం లో జ‌రిగిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రారంభ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) ని ఈ రోజు న న్యూ ఢిల్లీ లో తాల్ కటోరా స్టేడియం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీ లో జరిగిన ప్రధాన కార్య‌క్ర‌మాన్ని దేశ‌వ్యాప్తం గా సంధానించినటువంటి 3,000కు పైగా ప్ర‌దేశాల లో వీక్షించ‌డం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా బ్యాంకింగ్ సేవ‌లు దేశం లోని సుదూర ప్రాంతాల‌ కు మ‌రియు ఆ ప్రాంతాల లో నివ‌సిస్తున్న ప్ర‌జ‌ల‌ కు చేరుకొంటాయన్నారు.

అంద‌రికీ ఆర్థిక సేవ‌ల‌ ను అందించ‌డం కోసం జ‌న్‌ ధ‌న్ యోజ‌న‌ ను కేంద్ర ప్ర‌భుత్వం ఇదివ‌ర‌కే ప్రారంభించినట్లు ఆయ‌న గుర్తు కు తెచ్చారు. నేటి ఐపిపిబి ప్రారంభం ఈ ల‌క్ష్యాన్ని సాధించే దిశ‌ గా వేసినటువంటి మ‌రొక్క అడుగు అని ఆయ‌న చెప్పారు. ఈ రోజు న 650 జిల్లా ల‌లో ఐపిపిబి శాఖ‌లను తెర‌వ‌డ‌మైంద‌ని ఆయ‌న తెలిపారు.

ప‌ల్లె ల‌లో పోస్ట్‌మ‌న్ అంటే చాలా కాలం నుండి ఆద‌ర‌ణ వుందని, ఆయన అందరికీ ఆమోద‌యోగ్యుడైన వ్య‌క్తి అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఆధునిక సాంకేతిక విజ్ఞానం తెర మీద‌ కు వ‌చ్చిన‌ప్ప‌టికీ పోస్ట్‌మ‌న్ ప‌ట్ల న‌మ్మ‌కం అలాగే మిగిలింద‌ని ఆయ‌న అన్నారు. ఇప్ప‌టికే ఉన్న వ్య‌వ‌స్థ‌ ల‌ను సంస్క‌రించ‌డం ప్ర‌భుత్వ విధాన‌మ‌ని, మ‌రి ఈ కార‌ణంగా వాటిని మారుతున్న కాలానికి అనుగుణం గా మార్చుతున్నట్లు ఆయ‌న వివ‌రించారు. దేశం లో ప్ర‌జ‌ల తో సంధాన‌మైన త‌పాలా కార్యాల‌యాలు 1.5 ల‌క్ష‌ల‌ కు పైగా ఉన్నాయ‌ని, అలాగే పోస్ట్‌మ‌న్ లేదా ‘గ్రామీణ డాక్ సేవ‌క్ లు’ మూడు ల‌క్ష‌ల‌ మందికి పైగా ఉన్నార‌ని ఆయ‌న వివ‌రించారు. ఆర్థిక సేవ‌ల స‌ర‌ఫ‌రా కోసం వారికి ఇక స్మార్ట్ ఫోన్ ల‌ను, డిజిట‌ల్ ఉప‌క‌ర‌ణాల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

ఐపిపిబి ప్ర‌యోజ‌నాల‌ను గురించి ఆయ‌న తెలియజేస్తూ, ఇది న‌గ‌దు బ‌దిలీ, ప్ర‌భుత్వ ప్ర‌యోజ‌నాల బ‌దిలీ, బిల్లుల చెల్లింపు తో పాటు పెట్టుబ‌డి మరియు బీమా త‌దిత‌ర సేవ‌ల‌ కు కూడా వీలు క‌ల్పిస్తుంద‌న్నారు. ఈ త‌ర‌హా సేవ‌ల‌ను ఇంటి ముంగిటకే పోస్ట్‌మ‌న్ తీసుకు వచ్చి అందజేస్తార‌ని కూడా ఆయ‌న చెప్పారు. డిజిట‌ల్ లావాదేవీల‌ కు కూడా ఐపిపిబి మార్గాన్ని సుగ‌మం చేస్తుంద‌ని, రైతుల‌ కు అండ‌గా నిల‌చే ‘ప్ర‌ధాన మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌’ల వంటి ప‌థ‌కాల తాలూకు ప్ర‌యోజ‌నాన్ని అందించ‌డం లో సైతం స‌హాయ‌కారి గా ఉంటుంద‌న్నారు.

2014వ సంవ‌త్స‌రం నుండి అవిచారితంగా ఇచ్చినటువంటి లోన్ అడ్వాన్సుల కార‌ణంగా భార‌త‌దేశ బ్యాంకింగ్ రంగం లో త‌లెత్తిన స‌మ‌స్య ల‌ను పరిష్కరించడం కోసం కేంద్ర ప్ర‌భుత్వం ప‌క్కాగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు. ప్ర‌స్తుత రుణాల‌ను సైతం స‌మీక్షించ‌డ‌మైంద‌ని, బ్యాంకింగ్ రంగానికి సంబంధించినంత వ‌ర‌కు వృత్తి ప‌ర‌మైన నైపుణ్యం తో కూడిన వైఖ‌రి ని అనుసరించడం జ‌రిగింద‌ని ఆయ‌న చెప్పారు. పారిపోయిన ఆర్థిక అప‌రాధుల బిల్లు వంటి ఇత‌ర చ‌ర్య‌ల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావించి, త‌ప్పు చేసిన వారిని శిక్షించ‌డం కోసం ఇటువంటి చ‌ర్య‌ ల‌ను తీసుకోవడం జరిగిందన్నారు.

స్వ‌తంత్రోపాధి అవ‌కాశాల క‌ల్ప‌న కై పేద‌ల‌ కు, మ‌ధ్య‌త‌ర‌గతి ప్రజలకు 13 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌ కు పైగా ‘ముద్ర’ రుణాల‌ను ఇవ్వ‌డ‌మైంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ రోజున భార‌త‌దేశం ఏశియ‌న్ గేమ్స్ లో త‌న అత్యుత్త‌మ‌ ప్ర‌ద‌ర్శ‌న‌ ను క‌ర‌న‌బ‌ర‌చింద‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ శ్రేష్ఠమైన వృద్ధి సంఖ్య‌ల‌ ను న‌మోదు చేసింద‌ని, యావ‌ద్దేశం లో ఓ కొత్త ఆత్మవిశ్వాసం తొణికిస‌లాడుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఇది ప్ర‌జ‌ల స‌మ‌ష్టి కృషి ఫ‌లిత‌మని ఆయ‌న తెలిపారు. ప్ర‌స్తుతం భార‌త‌దేశం ప్ర‌పంచం లో అత్యంత వేగ‌వంతంగా వ‌ర్ధిల్లుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ గానే కాక పేద‌రికాన్ని శ‌ర వేగంగా అంతం చేస్తున్న దేశం కూడా అని ఆయ‌న పేర్కొన్నారు.

ప‌ల్లెల లో ప్ర‌తి ఒక్క ఇంటికి, ప్ర‌తి ఒక్క రైతుకు , ప్ర‌తి ఒక్క చిన్న వ్యాపార సంస్థ‌ కు ఆర్థిక సేవ‌ ల‌ను స‌మ‌కూర్చ‌డం లో 3 ల‌క్ష‌ల మంది ‘డాక్ సేవ‌క్’ ల భూమిక కీల‌కం కానుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. డాక్ సేవ‌క్ ల సంక్షేమానికి మ‌రియు వారు చిర‌కాలంగా కోరుతున్న కోర్కెల‌ను నెర‌వేర్చ‌డానికి ఇటీవ‌లి మాసాల‌ లో అనేక చ‌ర్య‌ల‌ను తీసుకోవ‌డ‌మైంద‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ చ‌ర్య‌లు వారి జీతం లో చెప్పుకోద‌గిన పెంపుద‌ల‌ కు దారి తీశాయ‌ని ఆయ‌న చెప్పారు. ఐపిపిబి రానున్న కొన్ని నెల‌ల్లోప‌ల దేశ‌వ్యాప్తంగా 1.5 ల‌క్ష‌ల త‌పాలా కార్యాల‌యాల‌ కు విస్త‌రించగలదన్న విశ్వాసాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు.