పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రణ్ ఆఫ్ కచ్ లోని ‘టెంట్ సిటీ’ ధోర్ దో కు చేరుకున్నారు. ధోర్ దోలో మూడు రోజుల పాటు డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ పోలీస్ సమావేశం జరగనుంది. ఈ సమావేశం ఢిల్లీకి వెలుపల జరగడం ఇది రెండో సారి. గత సంవత్సరం ఈ సమావేశాన్నిగౌహతిలో నిర్వహించారు.
సమావేశం ప్రారంభ సదస్సుకు ప్రధాని హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. “ఇండియన్ పోలీస్ ఇన్ సర్వీస్ ఆఫ్ ద నేషన్” పేరుతో ఒక వెబ్సైట్ ను ప్రధాన మంత్రి ప్రారంభించారు.
తరువాత హోం శాఖ మంత్రి, ఇతర ప్రతినిధులతో కలసి ప్రధాన మంత్రి ‘టెంట్ సిటీ’ కి కొద్ది దూరంలోనే ఉన్న ద వైట్ రణ్ కు బయలుదేరివెళ్లారు. బీఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఒంటెల ప్రదర్శనను ప్రధాని తిలకించారు. వైట్ రణ్ లో సూర్యాస్తమయ శోభను ఆయన వీక్షించారు. అనంతరం ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ప్రధాని తిలకించారు. కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రులు శ్రీ కిరెన్ రిజిజు, శ్రీ హరిభాయ్ పార్థిభాయ్ చౌదరి లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Delighted to be in the picturesque & beautiful Kutch, a district that has emerged as one of India's fastest growing & vibrant districts.
— Narendra Modi (@narendramodi) December 18, 2015