Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కు మ‌రియు స‌ర్టిఫైడ్ ప్రొఫెశన‌ల్ అకౌంటెంట్స్‌ అఫ్గ‌ానిస్తాన్ (సిపిఎ అఫ్గ‌ానిస్తాన్) కు మ‌ధ్య ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


 

ప్రధాన మంత్రి శ్రీ‌ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) కు మ‌రియు స‌ర్టిఫైడ్ ప్రొఫెష‌న‌ల్ అకౌంటెంట్స్‌ అఫ్గ‌ానిస్తాన్ (సిపిఎ అఫ్గ‌ానిస్తాన్) కు మ‌ధ్య అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)పై సంత‌కాల కు  ఆమోదం తెలిపింది.  

ఈ ఎంఒయు ‘‘అఫ్గ‌ానిస్తాన్ అకౌంటెన్సీ బోర్డ్‌ (ఎఎబి)’’ యొక్క కెపాసిటీ బిల్డింగ్‌, జ్ఞ‌ానం బదలాయింపు నకు మార్గాన్ని సుగమం చేయడం ద్వారా అఫ్గ‌ానిస్తాన్ లో ఐటి కెపాసిటి అండ్ క్వాలిటీ అశ్యువరన్స్ ను పటిష్టపరచడం;  విద్యార్థుల మ‌రియు స‌భ్యుల రాక‌పోక‌ల కార్య‌క్ర‌మాలు; ఉభ‌య ప‌క్షాల‌ కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండేట‌టువంటి  చ‌ర్చాస‌భ‌లు, స‌మావేశాలు మ‌రియు సంయుక్త కార్య‌క‌లాపాల నిర్వ‌హణ రంగాల లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఒక ఫ్రేమ్ వ‌ర్క్ ను నెల‌కొల్పుతుంది.

ల‌క్ష్యాలు:

   1.  అకౌంటింగ్ వృత్తి లో తాజా ప‌రిణామాల ప‌ట్ల విద్యార్థుల మ‌రియు స‌భ్యుల రాక‌ పోక ల కార్య‌క్ర‌మాల ను చేప‌ట్ట‌డం ద్వారా వారి అవ‌గాహ‌న ను పెంచ‌డం; ఇందుకోసం అధ్య‌య‌న యాత్ర‌లు లేదా ఇరు ప‌క్షాల‌ కు చెందిన‌ సంస్థ లు నిర్ణ‌యించిన మేర‌కు మ‌రే రూపం లోనైనా ముందుకు పోవ‌డం జ‌రుగుతుంది.

    2.  భార‌త‌దేశం లో అకౌంటెన్సీ వృత్తి వికాసానికి సంబంధించిన తాజా స‌మాచారాన్ని స‌మ‌కూర్చ‌డం మ‌రియు అంత‌ర్జాతీయ స్థాయి తో స‌రితూగే చ‌క్క‌ని వృత్తిప‌ర‌మైన అభ్యాసాల‌ను ప్రోత్స‌హించడం;

    3.  అఫ్గ‌ానిస్తాన్ లో అవ‌స‌ర‌మైన‌టువంటి నాణ్య‌త నియంత్ర‌ణ లు మ‌రియు నియమిత కాలిక స‌మీక్ష‌ల వ్య‌వ‌స్థ ద్వారా జ్ఞానం బ‌దిలీ కి మార్గాన్ని సుగ‌మం చేస్తూ, అఫ్గ‌ానిస్తాన్ లోని నాణ్య‌తా హామీ కి సంబంధించిన యంత్రాంగాన్ని బలోపేతం చేయడం.

ప్ర‌భావం:

భార‌త‌దేశం మ‌రియు అఫ్గ‌ానిస్తాన్ లు చారిత్ర‌క, సాంస్కృతిక బంధాల‌ ఆధారంగా ఒక అతి బ‌ల‌మైన భాగ‌స్వామ్యాన్ని ఏర్ప‌ర‌చుకొన్నాయి.  ఇటీవ‌ల కొంత కాలంగా రెండు దేశాల మ‌ధ్య భాగ‌స్వామ్యం స‌రికొత్త శిఖ‌రాల‌ ను అందుకొంది.  భార‌త‌దేశం అనుస‌రిస్తున్న అఫ్గ‌ానిస్తాన్ విధానం మ‌రింత విశ్వాస‌నీయ‌మైందిగాను, బ‌హుళ పార్శ్వాల‌ తో కూడుకొన్నదిగాను రూపుదిద్దుకొంది.  అఫ్గ‌ానిస్తాన్ లో ఇప్పుడిప్పుడే బ‌లం పుంజుకొంటున్న ఆర్థిక వ్య‌వ‌స్థ లో పెట్టుబ‌డుల‌కు భార‌త‌దేశం ముందంజ వేసింది.  అలాగే, కాబుల్ యొక్క ర‌క్ష‌ణ సామ‌ర్ధ్యాన్ని ప‌టిష్ట‌ప‌ర‌చ‌డం తో పాటు, ప్రాంతీయ సంధానాన్ని మ‌రియు ఏకీక‌ర‌ణ ను ప్రోత్స‌హించ‌డం కూడా జ‌రుగుతోంది.

భార‌త‌దేశ చార్ట‌ర్డ్ అకౌంటెంట్ (సిఎ)లకు అఫ్గ‌ానిస్తాన్ యాజ‌మాన్య సంస్థ‌ లలో గుర్తింపు ను, ఆమోద‌యోగ్య‌త‌ ను కల్పించడం ద్వారా ప‌రోక్ష ఉపాధి క‌ల్ప‌నకు మార్గాన్ని సుగ‌మం చేసి భార‌త‌దేశానికి మరియు ఐసిఎఐ కి అఫ్గ‌ానిస్తాన్  స‌హాయపడనుంది.  గ‌త కొన్ని సంవ‌త్స‌రాలు గా రెండు దేశాల మ‌ధ్య వేళ్ళూనుకొన్న సంబంధం స్వాభావికం గా వ్యూహాత్మ‌క‌మైంది గాను, ప‌ర‌స్ప‌ర హిత‌క‌ర‌మైంది గాను మారింద‌ని కూడా న‌మ్ముతున్నారు.

పూర్వ‌రంగం:

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) అనేది భార‌త పార్ల‌మెంట్ తీసుకువచ్చిన ‘చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ చ‌ట్టం, 1949’ ద్వారా ఏర్ప‌డ్డ ఒక చ‌ట్టబ‌ద్ధ సంస్థ‌.  భార‌త‌దేశం లో చార్ట‌ర్డ్ అకౌంటెన్సీ వృత్తి ని నియంత్రించేందుకు ఈ సంస్థ ను ఏర్పాటు చేయ‌డ‌మైంది.  సిపిఎ అఫ్గానిస్తాన్ అనేది అఫ్గానిస్తాన్ లో అకౌంటెన్సీ వృత్తి కి సంబంధించిన ఒక స్వ‌తంత్ర నియంత్రణ సంస్థ‌.  ఇది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ ప్ర‌భుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప‌ర్య‌వేక్ష‌ణ లో తన కార్య‌క‌లాపాల‌ ను నిర్వ‌హిస్తూ ఉంటుంది.

**