Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌ఠాన్ కోట్ ఉగ్ర‌వాద దాడిని ఖండించిన ప్ర‌ధాని- భారతదేశ‌ శ‌త్రువుల దుష్ట‌ప‌న్నాగాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటాం : ప్రధాని మైసూరులోని అవ‌ధూత ద‌త్త పీఠాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాని జ‌గ‌ద్గురు డాక్ట‌ర్ శ్రీ శివ‌రాత్రి రాజేంద్ర మ‌హాస్వామీజీ జన్మతమానోత్సవ వేడుల‌కు హాజ‌రైన ప్ర‌ధాని

ప‌ఠాన్ కోట్ ఉగ్ర‌వాద దాడిని ఖండించిన ప్ర‌ధాని- భారతదేశ‌ శ‌త్రువుల దుష్ట‌ప‌న్నాగాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటాం : ప్రధాని
మైసూరులోని అవ‌ధూత ద‌త్త పీఠాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాని
జ‌గ‌ద్గురు డాక్ట‌ర్ శ్రీ శివ‌రాత్రి రాజేంద్ర మ‌హాస్వామీజీ జన్మతమానోత్సవ వేడుల‌కు హాజ‌రైన ప్ర‌ధాని

ఈ రోజు ప‌ఠాన్‌కోట్‌లో వైమానిక ద‌ళంపై జ‌రిగిన ఉగ్ర‌వాదుల దాడిని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. భార‌త‌దేశాభివృద్ధిని చూసి ఓర్వ‌లేని దుష్ట‌శ‌క్తులు ఈ దుశ్చ‌ర్య‌కు పాల్ప‌డ్డాయ‌ని అవి మాన‌వత్వానికే శ‌త్రువుల‌ని ప్ర‌ధాని అన్నారు. ఉగ్ర‌వాదుల దాడిని స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టిన సాయుధ బ‌ల‌గాల‌కు ప్ర‌ధాని అభినంద‌న‌లు తెలిపారు. ఈ దాడిలో అమ‌రులైన జ‌వాన్లకు ఆయ‌న శ్ర‌ద్ధాంజ‌లి ఘటించారు. భార‌తీయ జ‌వాన్ల‌, భ్ర‌ద‌తా ద‌ళాల పోరాట‌ప‌టిమ‌ను చూసి గ‌ర్విస్తున్నాన‌ని ఆయ‌న అన్నారు. దేశ శ‌త్రువుల‌కు వ్య‌తిరేకంగా మొత్తం దేశ‌మే ఐకమ‌త్యంగా నిలిచి ఉంద‌ని వారి ప‌న్నాగాలు ఇక ముందు చెల్ల‌వ‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. మైసూరు మ‌హారాజా కాలేజి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసి జ‌గ‌ద్గురు డాక్ట‌ర్ శ్రీ శివ‌రాత్రి రాజేంద్ర మ‌హాస్వామీజీ జన్మతమానోత్సవ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌ స‌భ‌లో మాట్లాడారు.

అంత‌కు ముందు ప్ర‌ధానికి మైసూరు విమానాశ్ర‌యంలో క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ శ్రీ వాజుబాయ్ వాలా, ముఖ్య‌మంత్రి శ్రీ సిద్ధ‌రామ‌య్య స్వాగ‌తం ప‌లికారు.

అవ‌దూత ద‌త్త పీఠాన్ని సంద‌ర్శించిన ప్ర‌ధాని అక్క‌డ శ్రీ గ‌ణ‌ప‌తి స‌చ్చిదానంద స్వామీజీని క‌లుసుకున్నారు. భార‌త‌దేశంలో సాధువులు, స‌న్యాసులు స‌మాజంకోసం ఎంత‌గానో కృషి చేస్తున్నార‌ని అయితే వారి సేవాభావాల‌కు త‌గిన గుర్తింపు లేద‌ని ప్ర‌ధాని అన్నారు. పీఠంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాని మాట్లాడారు. స‌మాజంకోసం అవ‌ధూత ద‌త్త పీఠం చేప‌ట్టిన సేవాకార్య‌క్ర‌మాల‌ను ప్ర‌ధాని అభినందించారు. క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ శ్రీ వాజుభాయ్ వాలా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

మైసూరు మ‌హారాజా క‌ళాశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన జ‌గ‌ద్గురు డాక్ట‌ర్ శ్రీ శివ‌రాత్రి రాజేంద్ర మ‌హాస్వామీజీ జన్మతమానోత్సవాల్ని ప్ర‌ధాని ప్రారంభించారు. జన్మతమానోత్సవాలను పుర‌స్క‌రించుకొని నిర్మించ‌ద‌ల‌చిన విజ్ఞాన ప‌రిశోధ‌నా కేంద్రానికి ప్ర‌ధాని శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో ప్ర‌ధాని మాట్లాడుతూ శ‌తాబ్దాల కింద‌టే మ‌హ‌ర్షి శ్రీ బ‌స‌వేశ్వ‌రుడు సాంఘిక సంస్క‌ర‌ణ‌ల‌కు మార్గం చూపార‌ని అన్నారు. ఈ మ‌ధ్య‌నే లండ‌న్ లో శ్రీ బ‌స‌వేశ్వ‌రుని విగ్రహాన్ని ఆవిష్క‌రించే అదృష్టం త‌న‌కు ద‌క్కిన‌ విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. భార‌తీయ స‌మాజం ప్ర‌పంచంలోనే విల‌క్ష‌ణ‌మైన‌ద‌ని కాలక్ర‌మంలో అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా సంఘ‌సంస్కర్త‌లు జ‌న్మించార‌ని సాంఘిక దురాచారాలను ఎదుర్కొన్నార‌ని ప్ర‌ధాని గుర్తు చేశారు. 18, 19 వ‌ శతాబ్దాల‌లో భార‌త‌దేశంలో పుట్టుకొచ్చిన సాంఘిక సంస్క‌ర‌ణ‌ల ఉద్య‌మాల కార‌ణంగానే 20 వశ‌తాబ్దంలో స్వాతంత్ర్య‌ ఉద్య‌మాన్ని విజ‌య‌వంతం చేసుకోగ‌లిగామ‌ని ప్ర‌ధాని అన్నారు.

ఈ 21 వ శ‌తాబ్దం విజ్ఞాన నామ శ‌తాబ్దంగా నిలిచిపోతుంద‌ని ప్ర‌ధాని అన్నారు. విజ్ఞాన స‌ముపార్జ‌న‌కు, ఆవిష్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని అవే ఈ శ‌తాబ్దిలో దేశాన్ని ముందుకు తీసుకుపోతాయ‌ని ప్ర‌ధాని ధీమా వ్య‌క్తం చేశారు. విజ్ఞాన వ‌న‌రుల కేంద్రాన్ని నెలకొల్ప‌డానికి జ‌గ‌ద్గురు డాక్ట‌ర్ శ్రీ శివ‌రాత్రి రాజేంద్ర మ‌హాస్వామీజీ సంక‌ల్పించ‌డాన్ని ప్ర‌ధాని కొనియాడారు.

పారిస్ లో జ‌రిగిన కాప్‌-21 స‌మావేశం గురించి ప్ర‌ధాని మాట్లాడారు. ఆవిష్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డానికి ఉద్దేశించిన మిష‌న్ ఇన్నోవేష‌న్ ను, అంత‌ర్జాతీయ సౌర ఐక్య‌వేదిక ఏర్పాటును కాప్‌-21లో ఇండియా పోషించిన పాత్ర‌ను ప్ర‌ధాని త‌న ప్ర‌సంగంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.

ఈ కార్య‌క్ర‌మంలో క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ శ్రీ వాజుబాయ్ వాలా, ముఖ్య‌మంత్రి శ్రీ సిద్ధ‌రామ‌య్య‌, కేంద్ర మంత్రులు శ్రీ అనంత కుమార్‌, శ్రీ డి.వి.సదానంద గౌడ పాల్గొన్నారు.