పిఎంఇండియా
భారీ సంఖ్య లో ఇక్కడకు విచ్చేసిన వ్యాపారవేత్తలు, జపాన్ కు, భారతదేశానికి చెందిన సిఇఒ లు,
కెయిదన్ రెన్, జెత్రో, నికి, సిఐఐ, ఇంకా ఎన్ఎఎస్ సిఒఎమ్ లకు చెందిన సీనియర్ అధికారులారా,
జపాన్ కు వచ్చాక ఇక్కడి వ్యాపార వర్గాల తో సంభాషించడం నాకు ఎల్లప్పుడూ ఎంతో ఆనందాన్ని ఇస్తుంటుంది. ఇక్కడి వ్యాపారవేత్త లతో గత పది సంవత్సరాలు గా నేను విస్తృతంగా చర్చ లు జరుపుతున్నాను. మీ దూరదృష్టి ని నేను అవగాహన చేసుకున్నాను; మీ నుండి అనేక కొత్త విషయాలను తెలుసుకున్నాను. గత దశాబ్ద కాలం లో భారతదేశం పట్ల మీ సాన్నిహిత్యం క్రమంగా వృద్ధి చెందుతూ వస్తోంది.
దేశం లో వ్యాపార వాతావరణం లో మార్పు ను తీసుకు రావడానికి ప్రతి స్థాయి లో భారత ప్రభుత్వం చేపట్టిన కృషి వ్యాపారానికి అనుకూలమైన దేశం గా, జీవించడానికి అనుకూలమైన దేశం గా భారతదేశాన్ని మీరు ప్రతి క్షణం భావించే విధం గా తీర్చి దిద్దింది
మిత్రులారా,
భారతదేశం లో ఒక ‘‘బుల్లి జపాన్’’ ను తయారు చేయాలని కొన్ని సంవత్సరాల క్రితం నేను భావించాను. అంతకంటే ఎక్కువ స్థాయి లో ఇప్పుడు మీరు భారతదేశం లో పని చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
చాలా దశాబ్దాలుగా, భారతదేశం లో సుమారు 1150 జపాన్ కంపెనీలు ఉన్నాయి, అయితే, 2014 నుండి 2017 సంవత్సరాలలో, జపాన్ కు చెందిన రెండు వందలకు పైగా సంస్థ లు భారతదేశం లో పనిచేయడం ప్రారంభించాయి. ఈ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ పరిస్థితి కి మీరంతా అభినందనీయులే.
కార్ల తయారీ నుండి కమ్యూనికేశన్ ల వరకు, మౌలిక సదుపాయాల నుండి సేవల వరకు జపాన్ కు చెందిన కంపెనీలు భారతదేశం లో అనేక రంగాలలో పని చేస్తున్నాయి. భారతదేశం, జపాన్ ల మధ్య ఈ ఆహ్లాదకరమైన ప్రయాణం మరింత ఆహ్లాదకరం గా, ఫలితాలు లక్ష్యం గా సాగుతోంది. ఇందుకు కూడా మీ అందరికీ నా అభినందనలు.
మిత్రులారా,
నమ్మకం, మన పరస్పర వారసత్వం, మన సాన్నిహిత్యం పై భారతదేశం, జపాన్ ల సహా ఉనికి, స్ఫూర్తి ఆధారపడి ఉన్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న సన్నిహిత సంబంధాలకు ఈ స్ఫూర్తీ, ఆచారాలే పునాది.
ఈ కారణం గానే ప్రధాన మంత్రి గా నేను 2014 లో మొదటి సారి జపాన్ లో పర్యటించినప్పుడు ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయి కి పెంపొందించడం ద్వారా ఈ సంబంధాలు నూతన శిఖరాలను అధిరోహించాలని – మేము నిర్ణయించాం. అప్పటి నుండి మాన్య జపాన్ ప్రధాని శ్రీ ఆబే, నేను పరస్పరం తరచు గా సమావేశం అవుతూనే ఉన్నాం. ప్రధాని శ్రీ ఆబే మరియు నేను రెండు దేశాల మధ్య తలెత్తిన వ్యాపారానికి సంబంధించిన అనేక అవరోధాలను అధిగమించాం.
మిత్రులారా,
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశానికి చెందిన ఎన్నో ప్రతిష్ఠాత్మక మౌలిక ప్రాజెక్టు లకు జపాన్ ప్రభుత్వం సహాయాన్ని అందించింది. మా ‘‘వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్’’ ఇప్పుడు పూర్తి కావడానికి సిద్ధంగా ఉంది. ఒక ఏడాది తరువాత ఇది పూర్తి గా అందుబాటు లోకి వస్తుంది. దీని తో అనుసంధానమైన మన ఢిల్లీ- ముంబయి పారిశ్రామిక కారిడార్ పనులు జపాన్ ప్రభుత్వం మరియు జపాన్ కంపెనీల సహకారం తో చక్క గా ముందుకు సాగుతున్నాయి.
హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు పై కలిసి పనిచేయాలని మాన్య శ్రీ ఆబే శాన్ భారత పర్యటన సమయం లో మేం నిర్ణయించుకున్నాం. ముంబయి, అహమదాబాద్ ల మధ్య భారతదేశపు ఒకటో హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు ప్రారంభమై, ఈ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి.
మిత్రులారా,
భారతదేశం లో నా ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగున్నర సంవత్సరాలైంది. ఈ సమయం లో వ్యాపారానికి సంబంధించిన అంశం ‘‘ సులభం గా వ్యాపారం చేయడం’’ అనేది నా ప్రాధాన్యాల జాబితా లో అగ్ర భాగాన నిలచింది. దాని ఫలితమే ఇప్పుడు ప్రపంచం ముందు ఉంది. నేను ప్రభుత్వ పాలన చేపట్టినప్పుడు 2014 లో ప్రపంచ బ్యాంకు ‘‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్’’ స్థానాల జాబితా లో భారతదేశం 142వ స్థానం లో ఉంది. ప్రస్తుతం మేం వందో స్థానం లో ఉన్నాం. ఈ ర్యాంకు ను మెరుగుపరచుకోడానికి విస్తృతంగా కృషి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ స్థాయి లో, రాష్ట్ర ప్రభుత్వ స్థాయి లో మరియు స్థానిక ప్రభుత్వాల స్థాయిలో ఒక దాని తరువాత మరొకటి గా చర్యలను చేపడుతూనే ఉన్నాం. ఫలితం గా రానున్న సంవత్సరాలలో మరింత మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది.
సత్వర, నిర్ణయాత్మక చర్యలు, పురాతన చట్టాలను మార్చడం ద్వారా ఇంతటి భారీ మెరుగుదల సాధ్యపడింది.
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్పదలచాను. భారత ప్రభుత్వం, దేశం లోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్’ విషయం లో ర్యాంకు లను ప్రకటించి ప్రోత్సహించడం ప్రారంభించింది.
దీని వల్ల చాలా పెద్ద ప్రయోజనం చేకూరింది. ఇప్పుడు 29 రాష్ట్రాల మధ్య ఆరోగ్యప్రదమైన పోటీ నెలకొంది. ఫలితంగా చాలా ఆహ్లాదకర ఫలితాలు రావడం మొదలైంది.
మిత్రులారా,
మూలధన పెట్టుబడే ఇప్పుడు మా దేశానికి ఎంతో అవసరం. ఆ కారణం గానే ‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్’ విషయం లో మేం నిజాయతీ గా చర్యలు తీసుకొంటున్నాం. మూలధన పెట్టుబడి సృష్టించ గానే నిరుద్యోగులకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి; తద్వారా దేశ మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. వ్యవసాయం, ఖనిజాలు, సముద్ర వనరులతో పాటు దేశం లోని ఇతర సహజ వనరులు మెరుగవుతాయి.
‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్’కు పొడిగింపు గా ‘ఈజ్ అఫ్ లివింగ్’ను కూడా మా పౌరులకు కల్పించడానికి మేం కృషి చేస్తున్నాం.
అందువల్ల, విస్తృత ప్రచారం తో మేం ‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్’ కోసం పని చేశాం. ఈ కృషి ద్వారా మేం అనేక ఇతర విషయాలను కూడా సాధించాం.
• ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (డబ్ల్యుఐపిఒ)కు చెందిన అంతర్జాతీయ ఆవిష్కరణ ల సూచీ స్థానాలలో మేం 21వ స్థానాన్ని సాధించాము.
• వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు చెందిన ప్రపంచ స్పర్ధాత్మక సూచీ లో రెండు సంవత్సరాలలో మేం 31 స్థానాలను అధిగమించాం.
• యుఎన్ సిటిఎడి రూపొందించిన పది ఉత్తమ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గమ్యం జాబితా లో భారతదేశాని కి స్థానం లభించింది.
• గత కొన్ని సంవత్సరాలు గా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగం లో భారతదేశం అనేక సంస్కరణలను చేపట్టింది.
ఈ రోజున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో మేం అత్యంత బహిరంగ ఆర్ధిక వ్యవస్థ గా ఉన్నాం. 90 శాతానికి పైగా అనుమతులు ఇప్పుడు ఆటోమేటిక్ రూట్ ద్వారా ఇవ్వడం జరుగుతోంది.
• ఫలితం గా మన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గత మూడు సంవత్సరాల లో 36 బిలియన్ డాలర్ల నుండి 60 బిలియన్ డాలర్ల కు పెరిగాయి.
• ఈ రోజు న మనం ప్రపంచం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న భారీ ఆర్ధిక వ్యవస్థ గా ఉన్నాం.
• ఇప్పుడు మనం 2.59 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థ గా ఉన్నాం. ప్రస్తుతం ప్రపంచం లో ఆరో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ గా ఉన్న మేము త్వరలో ఐదో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థ స్థాయి కి చేరుకోగలం.
ఇక దేశీయ స్థాయి ఆర్ధిక పరిస్థితి ని చూస్తే, మేం ఏ చిత్తశుద్ధి తో సంస్కరణలను చేపట్టామో అవి భారతీయ ఆర్ధిక వ్యవస్థ లో కలుగజేసిన మార్పులు ఈ విధంగా ఉన్నాయి:
– ఇది ఒక సంప్రదాయ ఆర్ధిక వ్యవస్థ నుండి లాంఛనాలకు అతీతమైన ఒక ఆర్ధిక వ్యవస్థ దిశ గా మార్పుచెందుతోంది.
– లావాదేవీలన్నీ కాగితాలకు పరిమితం కాకుండా ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. దీని వల్ల స్థిరత్వం తో పాటు పారదర్శకత కూడా పెరిగింది.
– దేశవ్యాప్తం గా జిఎస్ టి అమలు లోకి రావడం తో రవాణా ఎంతో సులభం అయింది. వస్తు రవాణా రంగం బలోపేతం అయింది.
– కార్పొరేట్ పన్ను ను మేం క్రమం గా తగ్గిస్తూ వస్తున్నాం. దీని వల్ల చిన్న పరిశ్రమ లు ఎక్కువ ప్రయోజనాన్ని పొందాలి అనే ఉద్దేశ్యం తో ఎమ్ఎస్ఎమ్ఇ లపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.
ప్రభుత్వ విధానాలలో సుస్థిరత కోసం, పారదర్శకత కోసం వ్యాపార వర్గాలు చేస్తున్న డిమాండ్ భారత ప్రభుత్వానికి ఇప్పుడు ఒక గుర్తింపు గా మారింది.
మిత్రులారా,
ప్రధాన మంత్రి హోదా లో నేను జపాన్ లో మొదటి సారి పర్యటించినప్పుడు, ‘జపాన్ ప్లస్’ పేరు తో ఒక సంస్థ ను స్థాపించడం గురించి ప్రస్తావించాను. జెత్రో తో పాటు మీరందరూ ఇప్పుడు ఆ విధానాన్ని ఉపయోగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ఈ సందర్భంగా, మరొక విషయాన్ని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ‘జపాన్ ప్లస్’ మా ‘‘ఇన్వెస్ట్ ఇండియా’’ తో కలసి పనిచేస్తుంది. అద్భుతమైన పనితీరు కు గుర్తింపుగా కొన్ని రోజుల క్రితం ‘‘ఇన్వెస్ట్ ఇండియా’’ను అంతర్జాతీయ పురస్కారం తో అమెరికా సత్కరించింది.
మిత్రులారా,
అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న భారత ఆర్ధిక వ్యవస్థ, మధ్య తరగతి వేగంగా పెరగడం, పట్టణ జనాభా వేగంగా పెరగడం, మా యువ జనాభా పెరగడం వంటి అంశాలు జపాన్ కు చెందిన సంస్థలు ఇక్కడ పని చేయడానికి విస్తృతమైన అవకాశాలను కల్పిస్తున్నాయి.
నేను కొన్ని ఉదాహరణలు చెబుతాను –
గత నాలుగేళ్ల లో ‘మేక్ ఇన్ ఇండియా’ వంటి ప్రత్యేక కార్యక్రమాల తయారీ మరియు పరిశోధన ల రంగం లో భారతదేశాన్ని ఒక ప్రపంచ కేంద్రం గా రూపొందించడం లో మేం ప్రగతిని సాధించాం.
భారతదేశం లో పని చేయడానికి ప్రధానంగా జపాన్ కు చెందిన ఎమ్ఎస్ఎమ్ఇ కంపెనీ లకు చాలా అవకాశాలు ఉన్నాయి. భారతదేశానికి వచ్చే జపాన్ కు చెందిన ప్రతి భారీ సంస్థ ను మేం ఆహ్వానిస్తాం. జపాన్ కు చెందిన వ్యాపార నాయకులు ఎమ్ఎస్ఎమ్ఇ ద్వారా కూడా వారి వ్యాపారాలను నూతన శిఖరాలకు చేర్చుకోవచ్చును. ఎమ్ఎస్ఎమ్ఇ ల ద్వారా వచ్చే ఫలితాలు తక్కువ సమయం లో కనిపిస్తాయి.
భారతదేశం లో వ్యాపారం చేయడానికి గల ప్రయోజనాల్లో ఒకటి తక్కువ ఖర్చు తో తయారీ. దీనికి కారణం భారతదేశం లో అపారంగా ఉన్న మానవ వనరుల వల్ల శ్రామికులు తక్కువ వేతనాలకు అందుబాటులో ఉంటారు.
అదే విధంగా మా ఐటి పరిశ్రమ కూడా భారీ గా ఉంది. అందువల్లే ‘మా సాఫ్ట్ వేర్- మీ హార్డ్ వేర్ తో కలిస్తే ప్రపంచం లో మనం ఎన్నో అద్భుతాలు చేయవచ్చు’అని గతం లో ఇక్కడకు వచ్చిన సందర్భంలో నేను అన్నాను.
అంతే కాదు, కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్.. ఎఐ), ఇంటర్ నెట్, త్రీడి ముద్రణ, రోబోటిక్స్ ల వంటి సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో కొత్త ఆవిష్కరణల ద్వారా భారతదేశం ఇండస్ట్రీ 4.0 దిశ గా వేగంగా పురోగమిస్తోంది.
అదే విధంగా భారతదేశం, జపాన్ ల మధ్య ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం లో సహకారం ఇరు దేశాల కు ఎంతో లాభదాయకం గా ఉంటుందన్న విషయం వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది.
మిత్రులారా,
దీనితో పాటు, భారతదేశంలో, మౌలిక సదుపాయాల రంగం లో కూడా మేం అపూర్వ కృషి చేస్తున్నాం. ఇప్పుడు మా దృష్టి అంతా వచ్చే తరం మౌలిక సదుపాయాల పైనే ఉంది. నైపుణ్యం, వేగం మరియు స్థాయి అనే పునాదుల మీదా ఒక పోటీ ఆర్థిక వ్యవస్థ ను రూపొందించడం మా ఉద్దేశ్యం గా నిర్ణయించుకున్నాం.
ఈ ఆలోచన ను సాకారం చేసేందుకు పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరచాలని – మేం నిరంతరం ప్రయత్నిస్తున్నాం.
భారతదేశం లో సృష్టించబడుతున్న అపారమైన వ్యాపార అవకాశాలను వినియోగించుకోవలసిందిగా మీ అందరినీ ఈ రోజు న ఈ వేదిక మీది నుండి ఆహ్వానిస్తున్నాను. ఈ అపారమైన అవకాశాల గురించి మరి కొన్ని ఉదాహరణలు మీకు నేను తెలియజేస్తాను.
— దేశం లోని ప్రాంతీయ ప్రదేశాలను కోస్తా తీర ప్రాంతాలకు అనుసంధానం చేసే మా సాగరమాల కార్యక్రమం మీకు ఒక గొప్ప అవకాశాన్ని కలుగజేస్తుంది.
— స్మార్ట్ సిటీస్ కార్యక్రమం ద్వారా కూడా అనేక నూతన అవకాశాలు సృష్టించబడుతున్నాయి. మా దేశం లోని 50 నగరాలలో మెట్రో రైల్ సర్వీసు లను ప్రవేశపెట్టాలని కూడా మేం అనుకొంటున్నాం.
— అదే విధంగా మా రైలు, రోడ్డు విస్తరణ, ఆధునీకరణ కార్యక్రమాన్ని కూడా భారీగా చేపట్టదలచాం. మేము ఇంకా మరెన్నో హై స్పీడ్ కారిడార్లను నిర్మించవలసివుంది.
— ప్రస్తుతం ఉన్న నౌకాశ్రయాల, విమానాశ్రయాల ఆధునీకరణ తో పాటు, కొత్త నౌకాశ్రయాల, విమానాశ్రయాల ఏర్పాటు కూడా మా ప్రణాళిక లో భాగం గా ఉంది.
— దేశం లో జల రవాణా, గ్రీన్ ఎనర్జీ లు మా కొత్త నిబద్ధత లలో భాగం. ఇవి కూడా ఒక మీకు గొప్ప అవకాశాలను కల్పిస్తాయి.
— ప్రస్తుతం మా ఉక్కు వినియోగం చాలా తక్కువ గా ఉంది. ఇనుము చాలా సమృద్ధి గా ఉంది. భారతదేశం లో ఉన్నత శ్రేణి ఉక్కు ను ఉత్పత్తి చేయాలని నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశం, జపాన్ లు రెండూ ప్రజాస్వామ్య విలువలకు, స్వేచ్చా, స్వాతంత్య్రాలకు బలమైన మద్దతుదారులు గా ఉన్నాయి.
దీనితో పాటు అభివృద్ధి కోసం చేపడుతున్న మన విధానాలలో, మన దృక్ఫథం లో అనేక సారూప్యతలు ఉన్నాయి.
మూడో దేశాల కూటమి లో మౌలిక సదుపాయాలు, సామర్ధ్య నిర్మాణం తో పాటు, ఆరోగ్యం, వ్యవసాయ రంగాలలో జపాన్ కు, భారతదేశానికి మధ్య సహకారానికి మంచి అవకాశాలు ఉన్నాయి.
అందువల్ల, అది ఇండో-పసిఫిక్ లేదా దక్షిణాసియా లేదా ఆఫ్రికా ఏదైనా సరే భాగస్వామ్య దేశాల ప్రాధాన్యాల ఆధారం గా మూడో దేశాల కూటమి అభివృద్ధి లో భారతదేశం, జపాన్ లు వాటి భాగస్వామ్యాన్ని మరింత పటిష్టపరచుకుంటాయి.
అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ)లో జపాన్ ప్రవేశించడంతో మూడో దేశాల కూటమి లో సౌర శక్తి, వాతావరణ మార్పు వంటి విషయాలపై మన రెండు దేశాల మధ్య నూతన భాగస్వామ్య ద్వారాలు తెరచుకున్నాయి.
ఆఫ్రికా లో ఈ రంగం లో భారతదేశం, జపాన్ వ్యాపారవేత్త ల మధ్య సహకారం పెంపొందించుకోవడానికి, భారత, జపాన్ వ్యాపారవేత్తల మండలి సమావేశంలో మండలి కి చెందిన చాలా మంది సభ్యులు అనేక మంచి ఆలోచన లను పంచుకోవడం నాకు చాలా సంతోషం గా ఉంది.
మిత్రులారా,
నేను ఎప్పుడూ పటిష్టమైన భారతదేశం- పటిష్టమైన జపాన్ ల గురించి చెబుతూ ఉంటాను.
భారతదేశం పై ప్రత్యేక విశ్వాశం కలిగివున్నందుకు జపాన్ కు చెందిన వ్యాపారవేత్త లకు ఈ సందర్భంగా మా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను.
భారతదేశం లో మరింత గా పెట్టుబడులను పెట్టవలసిందిగా మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను.
జపాన్ కు, భారతదేశానికి మధ్య వాణిజ్య సంబంధాలను మరింత పటిష్టపరచేందుకు వీలు గా మీకు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తానని నేను హామీ ఇస్తున్నాను.
ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న మీ అందరికీ మరో మారు నేను కృజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
भारत सरकार ने Ease of Doing business को और बढ़ावा देने के लिए अपने 36 राज्यों और Union Territories की Ranking भी करनी शुरू कर दी है।
— PMO India (@PMOIndia) October 29, 2018
इसका एक बड़ा प्रभाव ये हुआ है कि अब राज्यों में भी Investment को लेकर Healthy Competition शुरू हो गया है जिसके बहुत बेहतर परिणाम दिखने लगे हैं: PM
प्रधानमंत्री के तौर पर अपनी पहली यात्रा के दौरान ही मैंने Japan plus नाम की एक संस्था खड़ी करने की बात की थी।
— PMO India (@PMOIndia) October 29, 2018
Japan plus हमारी Invest India के साथ मिलकर काम करती है।
इस @investindia को अपने बेहतरीन कार्यों के लिए युनाइटेड नेशंस ने वैश्विक सम्मान से पुरस्कृत किया है: PM
भारत में व्यापार करने का एक फायदा Low cost manufacturing भी है। उसके पीछे भारत में Competitive Labour Cost एक बहुत बड़ी ताकत है।
— PMO India (@PMOIndia) October 29, 2018
उसी तरह से हमारी IT industry एक बहुत बड़ी शक्ति है। मैंने पहले भी यहां आकर कहा है, हमारा Software और आपका Hardware मिल जाए, तो कमाल हो सकता है: PM
भारत technology के क्षेत्र में होने वाले नए आविष्कारों जैसे AI, IoT, 3D Printing, Robotics आदि के जरिए Industry 4.0 की तरफ तेजी से आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) October 29, 2018
Electric Mobility एक ऐसा क्षेत्र है जिसमें भारत और जापान के बीच का सहयोग दोनों देशों के लिए बेहद लाभदायक साबित होने जा रहा है: PM
मैं हमेशा ही Strong India – Strong Japan की बात करता रहा हूं।
— PMO India (@PMOIndia) October 29, 2018
मैं आज इस अवसर पर जापान के उद्यमी वर्ग का भारत पर विशेष विश्वास करने के लिए आभार व्यक्त करता हूं।
मैं आप सभी को भारत में निवेश की गति बढ़ाने के लिए भी आमंत्रित करना चाहूंगा: PM