Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సింగ‌పూర్ కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌ట‌న‌


సింగ‌పూర్ కు బ‌య‌లుదేరి వెళ్ళే ముందు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న పాఠం ఈ కింది విధంగా ఉంది.

“ఏశియాన్- ఇండియా, మరియు ఈస్ట్ ఏశియా స‌మిట్ ల‌లో పాలుపంచుకోవ‌డం కోసం న‌వంబ‌ర్ 14-15 తేదీ ల‌లో నేను సింగ‌పూర్ కు వెళ్ళ‌నున్నాను. దీనికి తోడు, రీజన‌ల్ కాంప్రిహెన్సివ్ ఎక‌నామిక్ పార్ట్‌న‌ర్ శిప్ లీడ‌ర్స్ మీటింగు లో కూడా నేను పాల్గొంటాను.

ఈ స‌మావేశాల లో నా ప్రాతినిధ్యం ఆసియాన్ స‌భ్య‌త్వ దేశాల‌ తోను, మ‌రింత విస్తృత‌మైన ఇండో – ప‌సిఫిక్ ప్రాంతం తోను మ‌న బంధాన్ని ప‌టిష్ట ప‌ర‌చుకోవాల‌నేట‌టువంటి మ‌న నిరంత‌ర నిబ‌ద్ధ‌త కు ఒక ప్ర‌తీక‌ కానుంది. ఏశియాన్ లోని ఇత‌ర నేత‌ల‌ తో, ఈస్ట్ ఏశియా స‌మిట్ నాయ‌కుల‌ తో జ‌ర‌ప‌బోయే సంభాష‌ణ‌ల కోసం నేను నిరీక్షిస్తున్నాను.

న‌వంబ‌ర్ 14వ తేదీ నాడు సింగ‌పూర్ ఫిన్‌టెక్ ఫెస్టివ‌ల్ లో కీల‌కోప‌న్యాసం చేసే తొలి ప్ర‌భుత్వ అధినేత అయ్యేటటువంటి ఖ్యాతి నాకు ద‌క్క‌నుంది. ఆర్థిక రంగ సంబంధిత సాంకేతిక విజ్ఞానానికి సంబంధించి ప్ర‌పంచం లోకెల్లా భారీ కార్య‌క్ర‌మం గా ఉండే ఈ కార్య‌క్ర‌మం శరవేగంగా వర్ధిల్లుతున్నటువంటి ఈ రంగం లో భార‌త‌దేశం యొక్క శ‌క్తి ని చాటి చెప్పే ఒక స‌రైన వేదిక గానే కాకుండా నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ లను, వృద్ధి ని పెంపొందింపచేసుకొనే ప్ర‌పంచ శ్రేణి భాగ‌స్వామ్యాల‌ను కుదుర్చుకోవ‌డానికి కూడా స‌రైన వేదికే అవుతుంది.

నా ప‌ర్య‌ట‌న క్ర‌మం లో ఇండియా- సింగ‌పూర్ హ్యాక‌థ‌న్ సంయుక్త భాగ‌స్తులు మ‌రియు విజేత‌ లతో సంభాషించే అవ‌కాశం సైతం నాకు ల‌భించ‌నుంది. స‌రైన ప్రోత్సాహాన్ని క‌ల్పించిన ప‌క్షం లో మాన‌వాళి ఎదుర్కొంటున్న స‌వాళ్ళ‌ కు ప‌రిష్కారాల‌ ను అందించ‌డం లో మ‌న యువ‌తీయువ‌కులు ప్ర‌పంచ నేతలు గా మారే సత్తాను క‌లిగి వున్నార‌ని నేను గ‌ట్టి గా న‌మ్ముతాను.

సింగ‌పూర్ లో నా ప‌ర్య‌ట‌న ఏశియాన్ తోను, ఈస్ట్ ఏశియా స‌మిట్ దేశాల‌ తోను అంత‌కంత‌కూ పెరుగుతున్న మ‌న భాగ‌స్వామ్యానికి తాజా వేగ గ‌తి ని ప్ర‌సాదింయగలద‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.

సింగ‌పూర్ కు నేను బ‌య‌లుదేరుతున్న వేళ లో, ఈ సంవ‌త్స‌రం ఏశియాన్ కు ద‌క్ష‌త క‌లిగిన అధ్య‌క్ష ప‌ద‌వి ని నిర్వ‌హిస్తున్నందుకు గాను సింగ‌పూర్ కు నా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌ల‌ను, అలాగే ఏశియాన్ త‌దిత‌ర సంబంధిత శిఖ‌ర స‌మ్మేళ‌నాల‌కు ఆతిథేయి గా వ్య‌వ‌హ‌రిస్తున్నందుకు సర్వత్రా విజ‌యం చేకూరాల‌ంటూ సింగ‌పూర్ కు నేను శుభాకాంక్ష‌ల‌ను అంద‌జేయదలుస్తున్నాను.”

**