Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇండోనేశియా లో సునామీ కార‌ణం గా జరిగిన ప్రాణ న‌ష్టం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ఇండోనేశియా లో ఒక అగ్ని పర్వతం బ‌ద్ద‌లైన తరువాత ఏర్ప‌డిన సునామీ కార‌ణం గా ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

“ఒక అగ్ని పర్వత విస్పోటం అనంత‌రం ఇండోనేశియా లో సునామి త‌లెత్తి విధ్వంసం తో పాటు ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌డం దుఃఖదాయ‌కం. ఆప్తుల‌ను కోల్పోయిన వారికి ఇదే నా సంతాపం; ఈ ఘ‌ట‌న‌ లో గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. భార‌త‌దేశం త‌న స‌ముద్ర తీర పొరుగు దేశానికి, మిత్ర దేశానికి స‌హాయ‌క కార్యక్రమాల లో తోడ్ప‌డేందుకు సిద్ధం గా ఉంది” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***