పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కు బయోటెక్నాలజీ రంగంలో ఇండియా, క్యూబా, ఇండియా -కొరియాలమధ్య సంతకాలు జరిగిన రెండు ద్వైపాక్షిక అవగాహనా ఒప్పందాలను నివేదించడం జరిగింది. ఈ అవగాహనా ఒప్పందాలు 2018 జూన్ 22న క్యూబాలోని హవానాలో, 2018 జూలై 9న న్యూఢిల్లీలో కుదిరాయి. క్యూబా, కొరియాలతో కుదిరిన ఈ అవగాహనా ఒప్పందాలు సైన్స్, టెక్నాలజీ రంగంలో, ఉమ్మడిగా అంగీకరించిన లక్ష్యాలు , కొలాబరేషన్లకు సంబంధించి దేశంలో నైపుణ్యాలు కలిగినవి.
ప్రధాన ప్రభావం…
ఇండియా- క్యూబా, ఇండియా – రిపబ్లిక్ ఆఫ్ కొరియా లమధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అలాగే శాస్ర్త సాంకేతిక దౌత్యం, నవకల్పనలు, బయోటెక్నాలజీ రంగం, విద్య, శిక్షణ , పరిశోధనలో భవిష్యత్ అజెండా వ్యూహాత్మక నిర్మాణాత్మక ప్రణాళిక రూపకల్పనకు ఈ ఒప్పందాలు దోహదపడతాయి. ఈ ప్రతిపాదనలు జీవశాస్త్రం, అనుబంధ రంగాలలోని 50 మందికి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, పి.హెచ్.డి లకు ఐదు సంవత్సరాల పాటు ఉపాధి కల్పించడానికి ఉపకరిస్తుంది.
నేపథ్యంః
ఇండో-చైనా కొలాబరేషన్
ఇండియా, క్యూబాలు తమ మధ్య బయోటెక్నాలజీ రంగంలో సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు 2018 జూన్ 22న ద్వైపాక్షిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్యూబా లోని హవానాకు గౌరవ భారత రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఈ అవగాహనా ఒప్పందం కుదిరింది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు చెందిన సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ, రిపబ్లిక్ ఆఫ్ క్యూబాకు చెందిన శాస్త్ర సాంకేతిక, పర్యావరణ మంత్రిత్వశాఖ 2018 జూన్ 22న హవానాలో ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ఇండియా- రిపబ్లిక్ ఆఫ్ కొరియా కొలాబరేషన్
ఇండియా- కొరియా దేశాలు బయో టెక్నాలజీ, బయో ఎకానమీ రంగంలో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ అవగాహనా ఒప్పందం ఇరు దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక రంగం , బయోటెక్నాలజీ, పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి, ద్వైపాక్షిక పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించినది.