పిఎంఇండియా
వేదిక మీద ఆసీనులైన ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రామ్ నాయక్ జీ, ప్రజాదరణ పొందిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగీ ఆదిత్యనాధ్ జీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యాజీ, ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ సభ్యులు, పార్లమెంటులో నా సహచరులు శ్రీ శ్యామ్ చరణ్ గుప్తాజీ, వినోద్ కుమార్ సొనాకర్ జీ, వీరేంద్ర జీ, ప్రయాగ్ రాజ్ మేయర్ అభిలాష గుప్తా జీ, నా సోదర సోదరీమణులారా
తపస్సు, సంస్కృతి, విలువలకు ప్రతీకగా నిలిచే ప్రదేశం ప్రయాగ్. ప్రయాగ్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రయాగ్ రాజ్ ను ఎప్పుడు సందర్శించినా సరే మనసంతా ప్రత్యేకమైన శక్తితో నిండిపోతుంది. ఈ ప్రదేశంలోని ప్రతి చోటు సాధువులు, సన్యాలుసుల దైవత్వంతో ప్రతిఫలిస్తోంది. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు ఆ దైవత్వాన్ని తరతరాలుగా ఆస్వాదిస్తూనే వున్నారు.
ప్రయగ్ గురించి పెద్దలు ఇలా అన్నారు కో కహీ సక్ హీ ప్రయాగ్ ప్రభావ్ కలుష్ పుంజ్ కుంజర్ మృగరావ్.
It has been said about Prayag- को कहि सकहि प्रयाग प्रभाऊ। कलुष पुंज कुंजर मृगराऊ।।
దీని అర్థం ఏంటంటే ప్రయాగ్ ప్రభావాన్ని, గొప్పదనాన్ని వర్ణించడం చాలా కష్టం. ఏనుగుంతటి పాపాలను చంపేసే సింహంతో పోల్చుతుంటారు. అపారమైన సంతోషానికి నిలయం శ్రీరాముడు. ఆయనకు కూడా శాశ్వతమైన ఆనందాన్ని అందించిన పవిత్రమైన పుణ్యక్షేత్రం ప్రయాగ.
సోదర సోదరీమణులారా,
అర్ధ్ కుంభ్ కంటే ముందు నేను ఇక్కడకు వచ్చాను..ఈ సందర్భంగా మీకు నేను ఒక సంతోషకరమైన వార్తను చెప్పదలుచుకున్నాను. ఈ సారి అర్ధ్ కుంభ్‌లో అక్షయవత్ ను భక్తులందరూ చూడగలుగుతారు. అక్షయ్ వత్ అనేక తరాలుగా కోటలోనే వుండిపోయింది. అయితే ఈ సారి త్రివేణిలో స్నానం చేసి ఇక్కడకు వచ్చే ప్రతి భక్తునికి అక్షయ్ వత్ ను చూసే అదృష్టం లభిస్తుంది.
అంతే కాదు అక్షయ్ వత్‌తో పాటు సరస్వతి కుంభ్ ను కూడా ప్రజలు చూడవచ్చు. ఈ మధ్యనే నేను అక్షయ్ వత్ ను చూశాను. ఈ చెట్టు తనకున్న లోతైన వేళ్ల కారణంగా తిరిగి తిరిగి వికసిస్తుంది. జీవితంపట్ల ఉల్లాసకరమైన దృక్పథాన్ని ఏర్పరుచుకోవాలనే సందేశాన్నిస్తూ ఇది మనకు స్ఫూర్తినిస్తోంది.
స్నేహితులారా,
కొద్ది సేపటి క్రితమే అనేక ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. వీటికయ్యే వ్యయం దాదాపు రు. 4500 కోట్లు. ప్రయాగ్ రాజ్ ను మరింత ఆకర్షణీయంగా, ఆధునికంగా తీర్చిదిద్దడానికిగాను పునాది వేయడం జరిగింది. రహదారులు నిర్మించడం, రైల్వే పనులు, ఆకర్షణీయ నగర కార్యక్రమాలు, గంగా నది శుద్ధి కార్యక్రమం మొదలైన పలు ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది.
ప్రయాగ్ రాజ్ ప్రజల జీవితాలు సుఖవంతంగా వుండడానికి వీలుగా సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నందుకు ప్రయాగ్ రాజ్ ప్రజలకు నా అభినందనలు. ఈ ప్రాజెక్టులు కుంభ్ కు మాత్రమే లబ్ధి చేకూర్చువు. కల్పవాసీలకు కూడా లబ్ధి చేకూరుస్తాయి.
స్నేహితులారా,
కుంభ్ సమయంలో కనెన్టివిటీనుంచి, మౌలిక సదుపాయాలవరకూ అన్ని అంశాలు చక్కగా వుండేందుకు వీలుగా బిజెపి ప్రభుత్వం శ్రద్ధపెట్టి పని చేస్తోంది. ప్రయాగర్ రాజ్ ను కలిపే రైలు మార్గం, విమాన మార్గం, లేదా రోడ్డు మార్గం …ఈ మార్గాలన్నిటినీ పటిష్టం చేయడానికి అన్ని రకాలుగా మేం చర్యలు చేపడుతున్నాం. ఈ సారి రైల్వే శాఖ పలు కొత్త రైళ్లను ప్రారంభించబోతున్నది. ముఖ్యంగా కుంభ్ కోసం. ప్లైవోవర్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, అండర్ పాస్ ల నిర్మాణం, విద్యుత్, మంచినీటి సౌకర్యాల ఏర్పాటు మొదలైనవాటికి సంబంధించి నేను ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి సంబంధించిన మౌలిక సదుపాయాలను, కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి.
ఈ కార్యక్రమం తర్వాత ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంలో నూతన టెర్మినల్ ప్రారంభోత్సవానికి నేను వెలుతున్నాను. ఈ నూతన టెర్మినల్ ను రికార్డు సమయంలో అంటే ఒక ఏడాదిలోనే పూర్తి చేయడం జరిగింది. ఈ టెర్మినల్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగకరంగా వుంటుంది. అదే సమయంలో ఇతర నగరాల్లో ప్రయాగ్ రాజ్ కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. దీనికి సంబంధించి ప్రయాగ్ రాజ్ ప్రజలకు నా అబినందనలు.
స్నేహితులారా,
ఈ సౌకర్యాలన్నిటీనీ అర్ధ్ కుంభ్ కంటే ముందు ఏర్పాటు చేసుకుంటున్నప్పటికీ వాటి ప్రభావం దీనికి మాత్రమే పరిమితం కాదు. భవిష్యత్తులో ప్రయాగ్ రాజ్ ప్రజల జీవితాల్లోని ప్రతి దశపైన ఈ మార్పులు ధనాత్మకమైన ప్రభావాన్ని చూపుతాయి. గతంతో పోలిస్తే ఈ సారి ప్రత్యేకత ఏమిటంటే ఈ సారి చేసే ప్రతి నిర్మాణం శాశ్వతమైనది. ఏదీ తాత్కాలిక నిర్మాణం కాదు. వంద కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ప్రయాగ్ రాజ్ వారసత్వ సంస్కృతి, ఆధునికతల కలయికకు ప్రతీకగా నిలుస్తుంది. ఆకర్షణీయ ప్రయాగ్ రాజ్ కు సంబంధించి ఇది ముఖ్యమైన కేంద్రంగా నిలుస్తుంది. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరానుంచి ప్రతీది ఈ కేంద్రంనుంచే నిర్వహించడం జరుగుతుంది.
సోదర సోదరీమణులారా,
కుంభ్ కు సంబంధించి ఆధ్యాత్మికతనుంచి సాంకేతికత దాకా ప్రతి అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా వున్న పర్యాటకులు ఆస్వాదించేవిధంగా అన్ని సౌకర్యాలను సమకూర్చి వారిని ఇక్కడకు తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఆధ్యాత్మికత, సాంకేతికత రెండూ అందుబాటులో వుంటాయి.
ఆధ్యాత్మికత, నమ్మకం, ఆధునికతల కలయికతతో కూడిన ఈ ప్రాంతం ఎంతో గొప్పగా వుందని, దీనికి మరేదీ సాటి లేదనుకుంటూ ఈ ప్రదేశాన్ని సందర్శించే ప్రజలు మధురమైన జ్ఞాపకాలతో తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లిపోయేలా అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతోంది.
ఇక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కొద్ది సేపటి క్రితం ప్రత్యేక అతిథులతో కలిసి దివ్య కుంభ్, భవ్య కుంభ్ సెల్ఫీ పాయింట్ల దగ్గర నేను సెల్ఫీలు తీసుకోవడం జరిగింది.
స్నేహితులారా,
త్రివేణి సంగమం అద్భుతంగా రూపొందితే తప్ప అర్ధ్ కుంభ్, సెల్ఫీల ఆస్వాదన పూర్తి కాదు. మన మాతృమూర్తి గంగమ్మ మనకు శక్తినిచ్చే తల్లి. గంగా నది శుభ్రంగా , స్పష్టంగా తయారై, ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా వుండాలి. గంగానదిని పరిశుభ్రంగా వుంచే కార్యక్రమం చాలా వేగంగా జరుగుతోంది.
ఈ రోజున ప్రారంభించిన వేలాది కోట్ల రూపాయల వ్యయం కాగల పలు ప్రాజెక్టుల్లో గంగమ్మ తల్లి శుద్ధి, గంగా నది ఘాట్ల సుందరీకరణకు సంబంధించిన ప్రాజెక్టు కూడా వుంది. 1700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మురుగునీటి శుద్ధి కర్మాగారమనేది… నగరంలోనుంచి వచ్చే డజనుకుపైగా మురికికాలువల నీటిని గంగానదిలోకి వెళ్లకుండా ఆపుతుంది. అదే సమయంలో నమామి గంగే ప్రాజెక్టు కింద 150 ఘాట్లను సుందరీకరించడం జరుగుతోంది. వీటిలో50 ఘాట్లకు సంబంధించిన పని ఇప్పటికే పూర్తయింది. వాటిలో 6 ఘాట్లను ఈ రోజు ప్రారంభించడం జరిగింది.
సోదర సోదరీమణులారా,
ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లోలాగానే కాశీ, కాన్పూర్, ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నగరాల్లో గంగా నది ఒడ్డున ఇలాంటి సౌకర్యాలనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. నమామీ గంగే మిషన్ కింద ఇంతవరకూ 24, 500 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం జరిగింది. ఐదువేల కోట్ల విలువైన 75 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. వేల కోట్ల రూపాయల విలువలైన 150 ప్రాజెక్టులకు సంబంధించిన పని శరవేగంగా కొనసాగుతోంది.
స్నేహితులారా,
గంగా నదిని పరిశుభ్రంగా వుంచడం, నిరంతరాయంగా పారేలా చూడటంలో ప్రభుత్వానికి వున్న బాద్యతతోపాటు గంగమ్మ తల్లికి సంబంధించి కోట్లాది మంది స్వచ్ఛాగ్రాహులు, సేవకులు నిర్వర్తించాల్సిన బాధ్యత కూడా చాలా ముఖ్యమైంది . భారీ స్థాయిలో ప్రజలు ఈ కార్యక్రమంతో సంబంధం కలిగి వున్నారు. వారి ప్రచార ఉద్యమం వ్యక్తిగత స్థాయిలో నడుస్తోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజల భాగస్వామ్యం, నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఊతమిస్తున్నాయి. దాదాపుగా గంగానది ఒడ్డున వున్నపల్లెలన్నీ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
సోదర సోదరీమణులారా,
శుభ్రత అనేది దైవత్వంతో సమానమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కుంభ్ సమయంలో ఇక్కడ దేవతలు నివసిస్తారు. కుంభ్ మేళా కోసం ఈ సారి ఎలాంటి రాజీ లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాం. గంగానదిశుద్ధి కార్యక్రమం లేదా శుభ్రమైన కుంభ్ ను నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటాం.
ఇక్కడకు రావడానికి ముందు నేను స్వచ్ఛ్ కుంభ్ ప్రదర్శనను తిలకించాను. కుంభ్ మేళాను పరిశుభ్రంగా నిర్వహించడానికి వీలుగా కుంభ్ సమయంలో శుభ్రతకోసం పోర్టబుల్ కంపాక్టర్, ఇంకా ఇతర ఆధునిక పద్ధతులను ఉపయోగించడం ఇప్పటికే మొదలుపెట్టాం.
స్నేహితులారా,
కుంభ్ మేళాను నిర్వహించడానికిగాను అద్భుతంగా, కనీ వినీ ఎరగని రీతిలో, ఆధ్యాత్మికతను ప్రతిబింబించే ఏర్పాట్లను చేయడానికిగాను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశానికి సంబంధించి సంగ్రహంగాగల వైభవోపేత గతాన్ని, ప్రపంచానికి సంబంధించిన అద్భుతమైన భవిష్యత్ ను ప్రదర్శించడానికిగాను ప్రభుత్వం సర్వశక్తులు వినియోగిస్తోంది.
ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోను ప్రయాగ్ రాజ్ ప్రజలు భాగస్వాములవుతున్నందుకు నాకు సంతోషంగా వుంది. మీరు కూడా మీ మీ వ్యక్తిగత స్థాయిలో శ్రమిస్తున్నారు. నగరాన్ని శుభ్రంగా వుండడానికి, మంచి ఆతిథ్యం అందించడంలోనూ సరైన వాతావరణం వుండేలా చూడడానికిగాను మీరు కూడా పని చేస్తున్నారు. నగరాన్ని అలంకరించడానికిగాను ఉపయోగించే ఆకర్షణీయమైన చిత్రాలను ఇక్కడ ప్రదర్శనలో చూశాను. చిత్రాల ద్వారా ప్రయాగ్ రాజ్ ను, భారతదేశాన్ని ఆవిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం. ఇక్కడకువచ్చ ప్రతి పర్యాటకునికి ఇది మంచి అనుభవంగా మిగిలిపోతుంది.
స్నేహితులారా,
ప్రయాగ్ రాజ్ ప్రజల భావావేశాలను అర్థం చేసుకున్న తర్వాత, మీరు చూపే ప్రేమను దృష్టిలో పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగాగల పలువురుప్రముఖులను అర్ధ్ కుంభ్ మేళాకు ఆహ్వానించాను. గత ఒకటి ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా సరే అక్కడ గల భారతీయులను అర్ధ్‌కుంభ్ మేళాకు రమ్మని ఆహ్వానం పలికాను. వారి విదేశీ స్నేహితులను తీసుకొని రావాలని కోరాను. భారతీయ వారసత్వంతో మమేకంకావాలని కోరాను. నేను కూడా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందినవాడిని కాబట్టి ఈ ఆహ్వానం పలికాను.
మీరు చూసే వుంటారు నిన్న సంగమమం దగ్గర 70 దేశాల జాతీయ జెండాలను ఎగరేయడం జరిగింది. 70 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, ప్రతినిధులు మొత్తం కుంభ్ ప్రాంతాన్ని తిలకించి, ఇక్కడ వున్న సుందర వాతావరణాన్ని ఆస్వాదించారు.
ఇలాంటి కార్యక్రమాలద్వారా కుంభ్ ప్రాధాన్యతను అంతర్జాతీయంగా ఇనుమడింపచేయడం జరుగుతుంది.
స్నేహితులారా,
ఈ సారి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన రెండు సాంస్కృతిక పట్టణాల్లో ఒకేసారి రెండు ముఖ్యమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఈ రెండు ప్రాంతాలు ప్రయాగ్ రాజ్, కాశీ. దేశ విదేశాలనుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడ అర్ధ్ కుంభ్ కు హాజరవుతారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వున్న పలువురు ప్రవాస భారతీయులు కాశీలో జరిగే ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రవాస భారతీయ దినోత్సవంలో పాల్గొనే భారతీయులు ఈ ప్రాంతాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది.
సోదర సోదరీమణులారా,
అర్ధ కుంభ్ మేళా అనేది కోట్లాది మంది ప్రజలు ఓ చోటకు చేరి చేసుకునే సంబరమే కాదు ఇది మన దేశానికి ఒక దిశను కూడా చుపుతుంది. ఇక్కడకు వచ్చిన ప్రజల మధ్యన జరిగే సంభాషణలు, సంబంధబాంధవ్యాలద్వారా ఈ దిశ ఏర్పడుతుంది. కుంభ్ ను సందర్శించే కోట్లాది మంది ప్రజల ఆలోచనలు దేశ సౌభాగ్యాన్ని పెంచుతాయి. సాధికారతను మరింత అధికం చేస్తాయి.
భారతదేశానికి, భారతీయతకు మహోన్నత సాక్ష్యంగా నిలిచే సంబరమే కుంభ్ మేళా. భాషలకు, సంప్రదాయాలకు అతీతంగా అందరినీ ఏకంగా చేసే పండగే కుంభ్. ప్రజలనే కాదు, గ్రామాలను, నగరాలను ఏకం చేసే పండగ ఇది. ఐక్యతగా నిలిచే భారతదేశం శ్రేష్టమైన భారతదేశమనే భావనను ఇక్కడ మనం దర్శించవచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడకు వచ్చే అతిథులపట్ల ప్రత్యేక గౌరవమర్యాదలు చూపడం మన బాధ్యత. ఈ మేళా అనేది ఆధ్యాత్మికతకోసం మాత్రమే కాదు. భారతదేశ పరువు ప్రతిష్టను ఇనుమడింపచేసేది కూడా. కుంభ్ పండగ అయిపోయిన తర్వాత ఇక్కడనుంచి తమ ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తమతోపాటు నూతన భారతదేశ చిత్రాన్ని మదిలో నింపుకొని వెళ్లాలి.
ఇక్కడ నిర్వహణనుంచి పాఠాలు నేర్చుకోవడానికిగాను కుంభ్ మేళా సమయంలో వేలాది మంది విద్యార్థులు ఇక్కడకు వస్తారు. ఈ కార్యక్రమం విస్తృతి, వైవిధ్యం, విజయం అనే అంశాలకు సంబంధించి…. ప్రపంచంలోనే అతి పెద్ద మేనేజ్ మెంట్ విశ్వవిద్యాలయం తమ విద్యార్థులకు మెళకువలు నేర్పుతోంది.
స్నేహితులారా,
సాంస్కృతిక వారసత్వానికి, విజ్ఞానానికి నెలవు భారతదేశం. భారతదేశానికి వున్న ఈ శక్తిని ప్రపంచానికి తెలియజేయడానికి స్వామి శ్రీ వివేకానందులతోపాటు అనేక మంది సాధువులు తమ జీవితాలను అంకితం చేశారు. గత నాలుగు, నాలుగన్నర సంవత్సరాలుగా భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వ ప్రభావాన్ని,వనరులతోపాటు ఇనుమడింపచేయడానికిగాను కేంద్రప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
ఈ రోజున ఈ పవిత్ర ప్రయాగ్ రాజ్ పుణ్యభూమి మీద నిలబడుకొని మీకు మరో ముఖ్యమైన అంశాన్ని తెలియజేయబోతున్నాను. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ ను న్యాయాలయం అని కూడా పిలవవచ్చు. కొంతకాలంగా న్యాయవ్యవస్థపై వత్తిడి పెట్టిన విధానాన్ని చూస్తే ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రజలు, యువకులు దీని గురించి అప్రమత్తంగా వుండేలా చేయడం సమంజసమని అంటున్నాను.
స్నేహితులారా,
ఈ దేశంలో సుదీర్ఘకాలం పాలన చేసిన పార్టీ తనను తాను అన్నిటికీ అతీతమని భావించింది. చట్టం, న్యాయం, సంస్థలు ఆఖరికి దేశానికి అతీతంగా భావించింది. ఈ పార్టీ ప్రతి సంస్థను ధ్వంసం చేసింది. తాను చెప్పినట్టుగా వినని రాజ్యాంగ సంస్థలను సైతం అది ధ్వంసం చేసింది.
సోదర సోదరీమణులారా,
ఈ నియంతృత్వ పోకడలతో దేశ న్యాయ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరిగాయి. సుదీర్ఘ కాలం పాలన చేసిన పార్టీ అవినీతి, నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా నిలబడిన సంస్థల్లో న్యాయవ్యవస్థ కూడా వుంది. కాంగ్రెస్ పార్టీ న్యాయవ్యవస్థను ఎందుకు వ్యతిరేకిస్తుందో ప్రయాగ్ రాజ్, ఉత్తర్ ప్రదేశ్ ప్రజలకు తెలిసింతగా ఇంకెవరికి తెలుసు? ప్రజాభిప్రాయాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నం చేసిన నాటి రోజులను ఉత్తర్ ప్రదేశ్ ప్రజలు తప్పకుండా గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ నాడు వారు చేసిన పని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా?
స్నేహితులారా,
రాజ్యాంగానికి విలువనిచ్చి, సత్యాన్ని నిలబెట్టింది ప్రయాగ్ రాజ్ హై కోర్టు. ఈ విషయాన్ని భారతీ జాతి ఏ నాటికి మరిచిపోదు. ఆ నాడు కాంగ్రెస్ నేతల్ని పార్లమెంటునుంచి బైటకు పంపించింది ప్రయాగ్ రాజ్ హైకోర్టు. అప్పుడు వారు ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని ప్రయత్నించారు. ఎమర్జెన్సీ ప్రకటించారు. నిజానికి వారు దేశ రాజ్యాంగాన్నిమార్చేశారు కూడా. ఎన్నికల ఫిర్యాదులు విచారించడానికిగాను న్యాయవ్యవస్థకున్న హక్కులను లాక్కోవడానికి ప్రయత్నాలు జరిగాయి.
స్నేహితులారా,
ఇది కాంగ్రెస్ నేతల తీరు తెన్ను. వారి ప్రవర్తన కారణంగా వారి పార్టీ ముందు రాజ్యాంగ సంస్థలు చేతులు ముడుచుకొని పని చేయాల్సి వచ్చింది. వారి మాట విననివారినెవరినైనా సరే ధ్వంసం చేయాలని వారు చూశారు. వారు ఫ్యూడల్, నియంతృత్వ స్వభావంతో స్ఫూర్తి పొంది తటస్థ సంస్థలను నాశనం చేయాలని చూశారు. న్యాయవ్యవస్థ గౌరవమర్యాదలను పెకిలించి వేయడానికిగాను కాంగ్రెస్ పార్టీ కండ బలాన్ని మాత్రమే కాదు మోసపూరిత ధోరణిని కూడా ఉపయోగించింది. వారు తమ కుట్రలను విజయవంతం చేయడానికి మోసాలకు పాల్పడ్డారు. వక్రమార్గాలను అనుసరించారు. దోపిడీలకు తెగబడ్డారు. న్యాయవ్యవస్థకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎలా వుంటుందంటే వారు అధికారంలో వుంటే న్యాయవ్యవస్థను అస్థిరపరుస్తారు. ప్రతిపక్షంలో రాగానే అధికార పార్టీ మీద విమర్శలు గుప్పించి బెదిరించడానికి ప్రయత్నిస్తారు.
స్నేహితులారా,
అత్యంత కీలకమైన కేశవానంద భర్తి కేసును దేశ ప్రజలకు గుర్తుచేయాలని అనుకుంటున్నాను. ఎలాంటి వత్తిళ్లకు లొంగకుండా న్యాయమూర్తులు తీర్పులనివ్వాలని చూస్తున్నప్పుడు …తరతరాలుగా వున్న న్యాయవ్యవస్థ సంప్రదాయాన్ని కాంగ్రెస్ పక్కన పెట్టింది.
అత్యంత సీనియారిటీ వున్న న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించకుండా సీనియారిటీలో మూడో స్థానంలో వున్న న్యాయమూర్తిని ముందుకు తెచ్చి ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఇదీ వారి పని సంస్కృతి. న్యాయవ్యవస్థపైన వత్తిడి తేవడానికి వారు చేసే పని ఇది. ఎమర్జెన్సీ విధించడానికి జస్టిస్ ఖన్నా అంగీకరించకపోయేసరికి ఆయన విషయంలో కూడా…. ముందు నేను చెప్పినట్టుగానే చేశారు. ఆయన సీనియారిటీనీ నిర్లక్ష్యం చేశారు.
సోదర సోదరీమణులారా,
వారు దేశ సంక్షేమంకోసంగానీ, ప్రజాస్వామ్య సంక్షేమంకోసంగానీ పని చేయలేదు. వారి స్వప్రయోజనాలకోసమే పని చేశారు. వారికి చట్టమన్నా లెక్క లేదు. అలాగే సంప్రదాయాలన్నా లెక్క లేదు. వారి నేతల్లో ఒక నేత చేసిన ప్రకటన ఆ నాడు వార్తల్లో పతాక శీర్షికల్లో నిలిచింది. మా సిద్ధాంతాలు, అభిప్రాయాలు, పనులు, మా సూచనలతో ఏకీభవించే వ్యక్తినే ప్రధాన న్యాయమూర్తిగా అనుమతిస్తామంటూ ఆ నేత ప్రకటించారు.
స్నేహితులారా,
మన దేశ రాజ్యాంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మన రాజ్యాంగ వ్యవస్థ పని చేస్తోంది. అయితే ఒక రాజకీయ పార్టీ అత్యాశను, ఈర్ష్యను, అధికారాన్ని, ఇంకా ఇతర అనేక అంశాలను ఉపయోగించుకొని న్యాయ వ్యవస్థను తనకు అనుగుణంగా పని చేయించుకోవాలని చూసింది..ఈ విషయాన్ని దేశ ప్రజలు గమనిస్తూనే వున్నారు.
ఈ మద్యనే మనం చూశాం..న్యాయవ్యవస్థలో ఉన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని తేవడానికి వాళ్లు ఎలా ప్రయత్నించారో చూశాం. గతంలోలాగా ఇప్పుడు కూడా న్యాయమూర్తులను భయపెట్టి, బెదిరించాలని చూశారు.
వార్తల్లోకి వచ్చిన ఆ ప్రకటన నాకు ఇంకా గుర్తుంది. వారి నేతల్లో ఒకరి విచారణ సందర్భంగా ఒక న్యాయమూర్తిని బెదిరించారు. మీ సతీమణి కర్వా చౌత్ పండగను చేసుకోవాలని మీకు లేదా? అని ప్రశ్నించారు. ఇది బెదిరింపు కాదా?
సోదర సోదరీమణులారా,
ప్రతి వ్యవస్థను నాశనం చేసినవాళ్లు ఇపపుడు ప్రజాస్వామ్యం గురింంచి గగ్గోలు పెడుతున్నారు. వారి ప్రవర్తన, కుట్రలు ఎప్పటికప్పుడు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదేంటంటే వాళ్లు తమను తాము ఈ దేశానికింటే,ప్రజాస్వామ్యానికంటే, న్యాయవ్యవస్థకంటే, ప్రజలకంటే అధికులమని భావిస్తుంటారు. రెండు రోజుల క్రితమే మరొక ఉదాహరణ చూశాం. కాబట్టి మీరందరూ ఇలాంటి వ్యక్తులు, పార్టీల విషయంలో జాగ్రత్తగా, మెళకువగా వుండండి.
సోదర సోదరీమణులారా,
గతంలోలాగానే కాంగ్రెస్ వర్తమానం చిందరవందరగా వుంది. అధికారం కోసం, స్వార్థ ప్రయోజనాలకోసం కాంగ్రెస్ వాళ్లు ఈ దేశ ప్రజల గురించి, దేశం గురించి, దేశ ఆర్ధిక, సాంస్కృతిక ప్రగతిని గురించి ఏమాత్రం లెక్క చేయడం లేదు. వాళ్లు దేశ సంస్కృతి గురించిప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఆలోచిస్తారు. మనకు మాత్రం దేశం, దేశ సౌభాగ్యం, వైభవం, ఆధ్యాత్మిక ప్రగతి మన ఆలోచనల్లో భాగం.
ప్రసాద్ యోజనలో అనుసరిస్తున్న విలువల ప్రకారం ఉత్తర్ ప్రదేశ్ తోపాటు దేశవ్యాప్తంగా భక్తి, ఆధ్యాత్మికతలతో సంబంధమున్న ప్రాంతాలను అభివృద్ధి పరచడం జరుగుతోంది. అలా గుర్తించి ప్రాంతాల్లో సౌకర్యాలు అభివృద్ధి చేయడం జరుగుతోంది. ప్రయాగ్ రాజ్, కాశీ, అయోధ్య- బృందావన్, కేదార నాద్, కామాఖ్య, శబరిమల మొదలైన మత ప్రాధాన్యత గత కేంద్రాలను అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతోంది.
సోదర సోదరీమణులారా,
అర్ధ్ కుంభ్ లో భారతదేశం ఎలా ప్రగతి సాధిస్తున్నది, పాత కొత్తల కలయికగా ఎలా రూపొందుతున్నది సంగ్రహంగా మీరు చూడగలరు.
ఆధునికతను ఆధ్యాత్మికతను, అభివృద్ధిని నమ్మకాన్ని, సౌకర్యాన్ని నమ్మకాన్ని మేళవించి కుంభ్ మేళాను విజయవంతం చేయాలని ప్రయాగ్ ప్రజలను కోరుతున్నాను.
ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహిస్తోంది. కానీ ఇంత గొప్ప కార్యక్రమం కేవలం ప్రభుత్వ కృషి కారణంగానే విజయవంతం కాదు. నేను, యోగీజీ, ఇంకా ఇతర నా సహచరులందరం ఈ సారి ప్రజలతో చేయి చేయి కలిపి పని చేస్తాం. ఆర్ధ్ కుంభ్‌ను విజయవంతం చేస్తాం.
ఈ ఆకాంక్షతో మీకు, ప్రయాగ్ రాజ్ ప్రజలందరికీ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం సందర్భంగా మరో సారి అభినందనలు తెలియజేస్తున్నాను.
జై గంగా మాతా – జై!
జై యమునా మాతా- జై !
జై సరస్వతి మాతా – జై !
జై తీర్థ రాజ్ – జై తీర్థ రాజ్ !
జై తీర్థ రాజ్ – జై తీర్థ రాజ్ !
భారతమాత చిరకాలం వర్ధిల్లాలి!
భారత మాత చిరకాలం వర్ధిల్లాలి!!
భారత మాత చిరకాలం వర్ధిల్లాలి!!!
అందరికీ అభినందనలు.
तप,
— PMO India (@PMOIndia) December 16, 2018
तपस्या,
संस्कृति,
संस्कार की धरती तीर्थराज प्रयाग के जन-जन को मेरा सादर प्रणाम!
जब भी प्रयागराज आने का अवसर मिलता है तो मन और मस्तिष्क में एक अलग ही ऊर्जा का संचार होता है: PM
आज मैं आप सभी को एक खुशखबरी देने आया हूं,
— PMO India (@PMOIndia) December 16, 2018
इस बार अर्धकुंभ में सभी श्रद्धालु अक्षय वट के दर्शन कर सकेंगे।
कई पीढ़ियों से ये अक्षयवट किले में बंद था।
लेकिन इस बार यहां आने वाला हर श्रद्धालु स्नान करने के बाद अक्षयवट के दर्शन का सौभाग्य भी प्राप्त कर सकेगा: PM
सरकार ने कुंभ के दौरान कनेक्टिवटी से लेकर यहां के इंफ्रास्ट्रक्चर पर विशेष ध्यान दिया है।
— PMO India (@PMOIndia) December 16, 2018
हमारा प्रयास प्रयागराज तक आने वाले हर रास्ते को मजूबत करने का, सुधारने का है।
चाहे वो रेलमार्ग हो,
एयर कनेक्टिविटी हो या फिर
सड़कों को सुधारने की बात हो: PM
कुंभ को ध्यान में रखकर रेलवे मंत्रालय इस बार भी अनेक नई ट्रेनें चलाने जा रहा है।
— PMO India (@PMOIndia) December 16, 2018
अभी शहर के बड़े फ्लाईओवर,
रेलवे-ओवरब्रिज और अंडरपास,
बिजली व पेयजल की जिन परियोजनाओं का लोकार्पण मैंने किया है उससे यहां का इंफ्रास्ट्रक्चर और क्नेक्टिविटी दोनों ही सुधरेगी: PM
इस कार्यक्रम के बाद मैं यहां से आपके प्रयागराज एयरपोर्ट के नए टर्मिनल का उद्घाटन करने भी जा रहा हूं।
— PMO India (@PMOIndia) December 16, 2018
इस नए टर्मिनल को रिकॉर्ड एक साल के भीतर बनाया गया है।
इस टर्मिनल से यात्रियों की सुविधा तो बढ़ेगी ही, देश के कई शहरों से प्रयागराज की कनेक्टिविटी भी बढ़ जाएगी: PM
सरकार का प्रयास है कि इस बार अर्धकुंभ में
— PMO India (@PMOIndia) December 16, 2018
तप से तकनीक तक के हर पहलू का अनुभव दुनियाभर के लोगों को मिल सके।
अध्यात्म,
आस्था और
आधुनिकता की त्रिवेणी कितनी भव्य और बेजोड़ हो सकती है,
इसका अनुभव लेकर लोग यहां से जाएं, इसकी कोशिश की जा रही है: PM
त्रिवेणी की शक्ति का एक बड़ा स्रोत हैं मां गंगा।
— PMO India (@PMOIndia) December 16, 2018
मां गंगा
स्वच्छ हों,
निर्मल हों,
अविरल हों,
इसके लिए सरकार तेज़ गति से काम कर रही है।
आज जो प्रोजेक्ट्स का लोकार्पण हुआ है उसमें गंगाजी की सफाई और
यहां के घाटों के सुंदरीकरण से जुड़े अनेक प्रोजेक्ट्स भी शामिल हैं: PM
1700 करोड़ रुपए की लागत से बने सीवेज-ट्रीटमेंट प्लांट्स से शहर के करीब एक दर्जन नालों को सीधे गंगा जी में बहने से रोका जा सकेगा।
— PMO India (@PMOIndia) December 16, 2018
वहीं नमामि-गंगे परियोजना में करीब डेढ़ सौ घाटों का सौंदर्यीकरण किया जाना है।
इसमें से करीब 50 घाटों का काम पूरा हो गया है: PM
केंद्र सरकार, उत्तर प्रदेश सरकार के साथ मिलकर ये सुनिश्चित करने में जुटी है कि ये आयोजन
— PMO India (@PMOIndia) December 16, 2018
दर्शनीय,
दार्शनिक और
दिव्य बने।
सरकार का पूरा प्रयास है कि यहां भारत के गौरवशाली अतीत के दर्शन और
वैभवशाली भविष्य की झलक दुनिया को दिखने को मिले: PM
कुंभ में आने वाले करोड़ों लोगों के साथ ही करोड़ों विचारों का प्रवाह भी भारत को समृद्ध और सशक्त बनाता रहा है।
— PMO India (@PMOIndia) December 16, 2018
कुंभ का पर्व भारत और भारतीयता का सबसे बड़ा प्रमाण है।
ये पर्व भाषा, भूषा और भिन्नता को खत्म कर एक होने की प्रेरणा देता है: PM
ये पर्व हमें जोड़ता है,
— PMO India (@PMOIndia) December 16, 2018
ये पर्व गांव और शहर को एक करता है,
एक भारत-श्रेष्ठ भारत की सही तस्वीर यहां दिखती है।
ऐसे में हमारी जिम्मेदारी है कि यहां आने वाले हर अतिथि का ध्यान रखें।
ये आयोजन सिर्फ श्रद्धा नहीं देश की प्रतिष्ठा का भी सवाल है: PM
मैं पवित्र प्रयागराज में आपसे से एक और अहम विषय पर बात करना चाहता हूं।
— PMO India (@PMOIndia) December 16, 2018
प्रयागराज वो जगह हैं जिसे उत्तर प्रदेश में न्याय का मंदिर भी कहा जा सकता है।
कुछ समय से जिस तरह एक बार फिर न्यायपालिका पर दबाव का खेल शुरू हुआ है,
उस स्थिति में देश को को सतर्क किया जाना आवश्यक है: PM
देश पर सबसे ज्यादा समय तक शासन करने वाली पार्टी ने हमेशा ही खुद को हर कानून,
— PMO India (@PMOIndia) December 16, 2018
न्याय-पालिका, संस्था और यहां तक कि देश से भी ऊपर माना है।
देश की हर उस संस्था को इस पार्टी ने बर्बाद कर दिया जो उसकी मर्जी से नहीं चली,
उसके इशारों पर काम करने, झुकने को तैयार नहीं हुई: PM
इसी मनमानी की वजह से हमारे देश की न्याय प्रणाली को भी कमजोर करने का प्रयास किया गया।
— PMO India (@PMOIndia) December 16, 2018
इसका सिर्फ एक कारण था कि न्याय-पालिका उन संस्थाओँ में से एक रही है जो इस पार्टी के भ्रष्ट और निरंकुश तरीकों के खिलाफ खड़ी रहती है: PM
इस बात को प्रयागराज और यूपी के लोगों से बेहतर कौन जान सकता है कि कांग्रेस को न्याय-पालिका क्यों पसंद नहीं है ?
— PMO India (@PMOIndia) December 16, 2018
यूपी के लोग वो दिन याद करें जब इस पार्टी की सर्वोच्च नेता द्वारा यहां जनमत को अपमानित करने काम किया गया था ?
क्या ये लोकतंत्र का अपमान नहीं था ?: PM
कांग्रेस के नेताओं की यह प्रवृत्ति रही है। इस प्रवृत्ति में देश की संवैधानिक संस्थाओँ को पार्टी के आगे हाथ बांधे खड़ा रहने पर मजबूर किया जाता है
— PMO India (@PMOIndia) December 16, 2018
जो झुकता नहीं उसे तोड़ने की कोशिश की जाती है। ये उनकी राजशाही सोच है जो उन्हें निष्पक्ष संस्थाओं को बर्बाद करने को उकसाती रहती है: PM
हाल में ही हमने देखा कि कैसे उन्होंने न्याय-पालिका के सर्वोच्च न्यायमूर्ति के खिलाफ महाभियोग प्रस्ताव लाने की कोशिश की।
— PMO India (@PMOIndia) December 16, 2018
जजो को ड़राने धमकाने की ये कोशिश उनकी पुरानी सोच का हिस्सा रही है: PM
ये लोग हर संस्था को बर्बाद करने का प्रयास करने के बाद अब लोकतंत्र की दुहाई दे रहे हैं।
— PMO India (@PMOIndia) December 16, 2018
लेकिन इनका बार-बार ये साबित कर रही हैं कि
ये खुद को,
देश,
लोकतंत्र,
न्याय-पालिका और
यहां तक कि लोगों के भी ऊपर समझते हैं।
अभी दो दिन पहले भी हम इसका एक और उदाहरण देख चुके हैं: PM
भारत किस प्रकार बदल रहा है, नया भारत कैसे
— PMO India (@PMOIndia) December 16, 2018
पौराणिकता और आधुनिकता को समेट रहा है,
उसकी झलक अर्धकुंभ में मिलने वाली है।
मेरा आप सभी प्रयागवासियों से आग्रह है कि हम
आधुनिकता से अध्यात्म को,
विकास से विश्वास को और
सहूलियत से श्रद्धा को जोड़कर कुंभ को सफलतम आयोजन बनाएं: PM