పిఎంఇండియా
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8, 2016 : గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు చెందిన ప్రధాన మంత్రి గ్రామీణ అభివృద్ధి విశిష్ట సభ్యుల (పిఎమ్ఆర్ డిఎఫ్) పథకం కింద పల్లెలలో పనిచేస్తున్న 230 మందికి పైగా యువతీయువకులతో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంభాషించారు.
11 మంది యువ ప్రతినిధులు ఈ సందర్భంగా తాము మారుమూల ప్రాంతాలు, పల్లెలు, గిరిజన గ్రామాలు, వామపక్ష ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో మహిళా సాధికారత, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ, విద్య, పౌష్టికాహారం, జీవనోపాధిమార్గాలు, స్వచ్ఛ భారత్, ఏక్ భారత్- శ్రేష్ట భారత్ లతో పాటు పరిపాలనలో ప్రజల ప్రాతినిధ్యం వంటి పలు కార్యక్రమాలలో చేస్తున్న కృషిని గురించి సంక్షిప్తంగా నివేదించారు.
ఆ తరువాత ప్రధాన మంత్రితో చర్చ చోటు చేసుకొంది. ఇందులో పలువురు ప్రతినిధులు పాల్గొని, భారతదేశ ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో విద్యావకాశాలు, గిరిజన ప్రాంతాల వికాసం, సేంద్రియ వ్యవసాయం, దివ్యాంగుల సంక్షేమం వంటి అంశాలపైన తమ ఆలోచనలను పంచుకున్నారు.
“నరేంద్ర మోదీ యాప్” నకు సంబంధించి స్పందనలను కోరుతూ పిఎమ్ఆర్ డిఎఫ్ విశిష్ట సభ్యులందరికీ తాను ఒక లేఖను రాసిన సంగతిని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఫెలోల నుంచి తనకు బోలెడు ప్రతిస్పందనలు అందినట్లు ఆయన వెల్లడిస్తూ, అందుకు వారిని అభినందించారు. వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఫిర్యాదు రాకపోవడం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇవాళ తన దృష్టికి తీసుకు వచ్చిన ప్రెజెంటేషన్ లలోనూ, దీంతో పాటు తనకు అందిన ప్రతిస్పందనలలోనూ ప్రజల ప్రాతినిధ్యం అనేది ఉమ్మడిగా కనిపించిన అంశం అని ప్రధాన మంత్రి వివరించారు. మార్పును తీసుకు రావడానికి ఇది అత్యంత ముఖ్యమైన అంశం కావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలోని పల్లె ప్రాంతాలలో, వెనుకబడిన ప్రాంతాలలో తరచుగా సమకాలికులు, కుటుంబ సభ్యుల నుంచి ఎదురయ్యే ఒత్తిడులను తట్టుకొని నిలబడుతూ అంకిత భావంతో, మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారు మీరు అంటూ ప్రతినిధులను ఆయన ప్రశంసించారు.
పిఎమ్ఆర్ డిఎఫ్ కార్యక్రమానికిమరింతగా మెరుగులు దిద్దడానికి తగిన నిర్దిష్ట వ్యాఖ్యలను, సూచనలను అందజేయవలసిందని ప్రధాన మంత్రి కోరారు.
ప్రధాన మంత్రి ”స్క్రిప్టింగ్ చేంజ్” అనే ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో దేశం నలు మూలల్లో పిఎమ్ఆర్ డిఎఫ్ ఫెలోస్ చేస్తున్న పనుల సారాన్ని దృశ్యాల రూపంలో పొందుపరిచారు.
కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ చౌదరి బీరేందర్ సింగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Extensive interaction with PM Rural Development Fellows. Heard novel experiences on agriculture, rural development, education & other issues
— Narendra Modi (@narendramodi) February 8, 2016
Our belief in people's participation is firm. It is our Jan Shakti that will take India to new heights of progress. https://t.co/fBy7ScQ1V8
— Narendra Modi (@narendramodi) February 8, 2016