Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆరోగ్య సంరక్షణ సంబంధ మౌలిక స‌దుపాయాలకు ప్రోత్సాహక చర్య


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఈ దిగువన ప్రస్తావించిన వాటికి ఆమోదం తెలిపింది:

 

(ఎ) (i) జ‌మ్ము లోని సాంబా లో గల విజ‌య్‌న‌గ‌ర్‌ లో 1,661 కోట్ల రూపాయ‌ల‌ వ్యయం తో ఒక ఎఐఐఎంఎస్ స్థాపన

 

(ii) కశ్మీర్‌ లోని పుల్ వామా లో గల అవంతీపురా లో 1,828 కోట్ల రూపాయ‌ల‌ వ్యయం తో ఒక ఎఐఐఎంఎస్ స్థాపన

 

(iii) గుజ‌రాత్‌ లోని రాజ్‌కోట్‌ లో 1,195 కోట్ల రూపాయ‌ల వ్య‌యం తో ఒక ఎఐఐఎంఎస్ స్థాపన.  ఈ మూడు చోట్ల ఎఐఐఎంఎస్ లను ప్ర‌ధాన‌ మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

(బి) మూడు ఎఐఐఎంఎస్‌ ల‌ కోసం 2,25,000 రూపాయల (ఫిక్స్ డ్) మూల వేతనం + ఎన్‌పిఎ (అయితే వేత‌నం+ఎన్‌ పిఎ 2,37,500 రూపాయ‌ల‌ కన్నా మించ‌దు) తో ఒక డైరెక్ట‌ర్ పదవి చొప్పున ఏర్పాటు చేస్తారు.

 

కాలావధి:

      1.

విజ‌య్‌న‌గ‌ర్‌, సాంబా, జ‌మ్ము

48 నెల‌లు

స్థూలం గా నిర్మాణానికి ముందు ద‌శ‌ కు 12 నెల‌లు, నిర్మాణ ద‌శ‌ కు 30 నెల‌లు మరియు స్థిరీక‌ర‌ణ‌/ ప్రారంభానికి 6 నెల‌లు.

  1.  

అవంతీపురా, పుల్ వామా, క‌శ్మీర్

72 నెలలు

స్థూలం గా నిర్మాణానికి ముందు ద‌శ కు 12 నెల‌లు, నిర్మాణ ద‌శ కు 54 నెల‌లు, స్థిరీక‌ర‌ణ‌/ ప్రారంభానికి 6 నెల‌లు.

  1.  

రాజ్‌కోట్‌, గుజ‌రాత్‌

45 నెలలు

స్థూలం గా నిర్మాణ ముంద‌స్తు ద‌శ 10 నెల‌లు, నిర్మాణ ద‌శ కు 32 నెల‌లు,  స్థిరీక‌ర‌ణ‌/ ప్రారంభానికి 3 నెల‌లు.

వరుస సంఖ్య కొత్త ఎఐఐఎంఎస్‌ నిర్మాణానికి కాలావధి మరియు ఇత‌ర వివ‌రాలు

 

వివ‌రాలు :

 

 

 

 

            ఎ.   నూత‌న ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు ద్వారా ఆస్ప‌త్రుల నిర్మాణం, మెడిక‌ల్‌ & న‌ర్సింగ్‌ కోర్సుల‌ కు టీచింగ్ బ్లాక్ నిర్మాణం, రెసిడెన్షియ‌ల్‌ కాంప్లెక్స్, ఇత‌ర అనుబంధ సౌక‌ర్యాలు/ సేవ‌లు అందుబాటు లోకి వ‌స్తాయి. స్థూలం గా న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎంఎస్ త‌ర‌హా లో అలాగే పిఎంఎస్‌ఎస్‌ వై తొలి ద‌శ లో భాగం గా చేప‌ట్టిన ఎఐఐఎంఎస్‌ ల త‌ర‌హా లో స‌దుపాయాలు అందుబాటు లోకి వ‌స్తాయి.  నాణ్య‌మైన వైద్య‌ సేవ‌ లు ఈ ప్రాంతాల‌ లో అందుబాటు లోకి తీసుకు వ‌చ్చేందుకు, వైద్య విద్య‌, న‌ర్సింగ్ విద్య‌, ప‌రిశోధ‌న‌ ల‌ కోసం ఈ కొత్త ఎఐఐఎం ఎస్‌ ల‌ను జాతీయ ప్రాధాన్యం గ‌ల సంస్థ‌లు గా ఏర్పాటు చేస్తున్నారు.

 

 

 

బి) (i) ప్ర‌తి కొత్త ఎఐఐఎంఎస్ లో 100 యుజి (ఎం బిబిఎస్‌) సీట్లు, 60 బి.ఎస్‌సి. న‌ర్సింగ్ సీట్లు అందుబాటు లోకి   వ‌స్తాయి.

 

(ii) ప్ర‌తి కొత్త ఎఐఐఎంఎస్‌ లో 15-20 సూప‌ర్‌ స్పెశాలిటీ విభాగాలు ఏర్పాటు అవుతాయి.

 

(iii) ప్ర‌తి కొత్త ఎఐఐఎంఎస్‌ లో 750 వ‌ర‌కు ఆస్ప‌త్రి ప‌డ‌క‌ లు అందుబాటు లోకి వ‌స్తాయి. ఇందులో ఎమ‌ర్జెన్సీ, ట్రామా కేర్ బెడ్‌లు, ఆయుష్ బెడ్‌లు, ప్రైవేట్ బెడ్‌లు, ఐసియు స్పెషాలిటీ, సూప‌ర్ స్పెశాలిటీ బెడ్లు ఉంటాయి.

 

(iv) ప్ర‌తి కొత్త ఎఐఐఎంఎస్ లో ప్ర‌తి రోజూ సుమారు 1500 ఒపిడి రోగుల కు మరియు వార్డు లలో ప్రతి ఒక్క నెల కు సుమారు గా 1000 రోగుల కు చికిత్స చేయడం జరుగుతుంది.

 

(v) ప్ర‌తి కొత్త ఎఐఐఎంఎస్ లో ఒక మెడిక‌ల్ కాలేజి, ఒక ఆయుష్‌ బ్లాక్‌, ఆడిటోరియం, నైట్‌ శెల్ట‌ర్‌, అతిథి గృహం, వసతిగృహాలు, రెసిడెన్షియ‌ల్ స‌దుపాయాలు ఉంటాయి.

 

వ్యయం:

 

 

నూత‌న ఎఐఐఎంఎస్‌ ల నిర్మాణాన్ని పూర్తి గా కేంద్ర ప్ర‌భుత్వ‌నిధుల‌ తోనే చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది.  ఈ ఎఐఐఎంఎస్‌ ల కార్య‌క‌లాపాలు, వాటి నిర్వ‌హ‌ణ వ్య‌యాల‌ ను కూడా పూర్తి గా కేంద్ర ప్ర‌భుత్వ‌మే భ‌రించ‌నుంది.

 

 

 

 

 

కొత్త ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు మూల‌ధ‌న ఆస్తుల‌ ను ఏర్పాటు చేస్తుంది. ఇందుకు ఆరు కొత్త ఎఐఐఎంఎస్‌ ల త‌ర‌హా లో వాటి నిర్వ‌హ‌ణ‌ కు ప్ర‌త్యేక మాన‌వ వ‌న‌రుల క‌ల్ప‌న జ‌ర‌గుతుంది.

 

 

 

 

ప్ర‌భావం:

 

 

         కొత్త ఎఐఐఎంఎస్‌ ల ఏర్పాటు వైద్య విద్య రంగం లో, శిక్ష‌ణ రంగం లో మార్పు కు దోహ‌దం చేస్తుంది. అలాగే ఈ ప్రాంతాల‌ లో వైద్య‌ సిబ్బంది కొర‌త‌ ను అధిగ‌మించ‌డాని కి ఉప‌క‌రిస్తుంది.

         కొత్త ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు రెండు ప్ర‌యోజ‌నాల‌ ను నెర‌వేరుస్తుంది. ఒక‌టి, ప్ర‌జ‌ల‌ కు సూప‌ర్ స్పెశాలిటీ వైద్య సేవ‌ లు అందుబాటు లోకి వ‌స్తాయి.

         ఇది పెద్ద ఎత్తు న ఈ ప్రాంతం లో వైద్యుల‌ ను, ఇత‌ర ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌ ను త‌యారుచేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.  వీరు జాతీయ ఆరోగ్య అభియాన్ (ఎన్  హెచ్ ఎమ్) లో భాగం గా ఏర్ప‌డిన‌ ప్రాథమిక మరియు ద్వితీయ స్థాయి సంస్థ‌ల‌ / సదుపాయాల‌ కై ఉప‌యోగ‌ప‌డ‌తారు.

 

 

 

ఉపాధి క‌ల్ప‌న‌:

 

         జ‌మ్ము &  కశ్మీర్‌ లోను మరియు గుజ‌రాత్‌ లోను ఎఐఐఎంఎస్ ల ఏర్పాటు వ‌ల్ల వివిధ ఫేక‌ల్టీ, నాన్ ఫేక‌ల్టీ ఉద్యోగాల‌ లో ప్ర‌తి ఎఐఐఎమ్ఎస్ కు 3,000  ఉద్యోగాల‌ వ‌ర‌కు అందుబాటు లోకి వ‌స్తాయి.

         షాపింగ్ సెంట‌ర్‌, కేంటీన్. ఎఐఐఎమ్ ఎస్ చుట్టుప‌క్క‌ల‌ ఇత‌ర స‌దుపాయాల వ‌ల్ల ప‌రోక్షం గా కూడా ఉపాధి క‌ల్ప‌న జ‌రుగుతుంది.

         కొత్త ఎఐఐఎమ్ఎస్ కోసం చేప‌ట్టే నిర్మాణాల వ‌ల్ల సైతం నిర్మాణ ద‌శ‌ లో చెప్పుకోద‌గిన స్థాయి లో ఉపాధి అవ‌కాశాలు స‌మ‌కూరుతాయి.

 

 

పూర్వరంగం:

ప్ర‌ధాన‌ మంత్రి స్వాస్థ్య సుర‌క్ష యోజ‌న (పిఎంఎస్ఎస్‌వై) అనేది కేంద్ర ప్ర‌భుత్వ‌ రంగ ప‌థ‌కం.  ఇది దేశం లోని వివిధ ప్రాంతాల‌ లో అందుబాటు లో వైద్య సేవ‌ల‌ కు సంబంధించిన అస‌మాన‌త‌ల‌ ను తొల‌గించేందుకు ఉద్దేశించింది. అలాగే వైద్య విద్య స‌దుపాయాల‌కు సంబంధించి వెనుక‌బ‌డి ఉన్న రాష్ట్రాల‌ లో స‌దుపాయాల‌ ను క‌ల్పించేందుకు ఉద్దేశించింది.

 

జ‌మ్ము ప్రాంతాని కి ఒక‌టి, కశ్మీర్ ప్రాంతాని కి ఒక‌టి చొప్పున ఏర్పాటు చేయ‌నున్న ఎఐఐఎంఎస్‌ ల‌ను ప్ర‌ధాన‌ మంత్రి అభివృద్ధి ప్యేకేజి ప‌థ‌కం లో భాగం గా 2015వ సంవత్సరం న‌వంబ‌ర్ 7వ తేదీ న ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌క‌టించారు.  గుజ‌రాత్‌ లో ఎఐఐఎంఎస్‌ ను గురించి ఆర్థిక‌ మంత్రి  2017-18 సంవత్సర బ‌డ్జెటు ప్ర‌సంగం లో ప్ర‌క‌టించారు.

 

 

**