Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ముంబైలో మేక్ ఇన్ ఇండియా వీక్

s2016021377279

s2016021377276

s2016021377274


ముంబైలో మేక్ ఇన్ ఇండియా వీక్ ను ఈ రోజు ప్రారంభించిన త‌రువాత‌ ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స్వీడన్, ఫిన్ లాండ్ ప్రధానులతో, పోలాండ్ ఉప ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫెన్ లాఫ్ వెన్ తో చర్చల సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో స్వీడన్ ప్ర‌ముఖ‌ భాగస్వామిగా ఉందంటూ కొనియాడారు. రక్షణ, ఎలక్ట్రానిక్ వస్తువులు, వైద్య పరికరాల రంగాల‌లో భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలని స్వీడన్ కంపెనీలను ఆహ్వానించారు.

ఫిన్ లాండ్ ప్రధాని శ్రీ జుహా సిపిలాతో చర్చల సందర్భంగా శ్రీ న‌రేంద్ర మోదీ ఇంజినీరింగ్, ప‌వ‌ర్ ప్లాంటులు, బయోటెక్, ఇన్నోవేషన్ విభాగాల్లో ఫిన్ లాండ్ చురుకైన భాగస్వామి లంటూ ఆ దేశాన్ని ఆహ్వానించారు. చెన్నైలోని ట్రివిట్రాన్ కు చెందిన‌ అత్యాధునిక హెల్త్ కేర్ యూనిట్ ను ఇద్దరు ప్రధానులు టెలీ కాన్ఫరెన్స్ మాధ్య‌మం ద్వారా ప్రారంభించారు.

పోలాండ్ ఉప ప్రధాని డాక్టర్ పియోటర్ గ్లిన్స్కీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన స్వ రాష్ర్టం గుజరాత్ లోని జాం న‌గ‌ర్ ఎంతో కాలంగా పోలాండ్ తో అనుబంధాన్ని కొన‌సాగిస్తున్నట్లు గుర్తు చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్, క్లీన్ ఎనర్జీ, రవాణా రంగాల‌లో సహకారానికి గల అవకాశాలపై శ్రీ మోదీ చర్చించారు.

***