Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ 2019 కోసం భారత్ ను సందర్శించనున్న డెన్ మార్క్ ప్ర‌ధాని


డెన్ మార్క్ ప్ర‌ధాని శ్రేష్ఠులు శ్రీ లార్స్ లొకే రాస్ ముసేన్ ఈ నెల 18వ,19వ తేదీల‌ లో భారతదేశాన్ని సందర్శించనున్నారు. వైబ్రంట్ గుజ‌రాత్ గ్లోబల్ స‌మిట్ -2019 లో ఒక భాగస్వామ్య దేశం గా డెన్ మార్క్ పాలుపంచుకొంటోంది. ప్రధాన డేనిష్ కంపెనీ ల సిఇఒ ల‌తో కూడిన ఓ ప్రతినిధివర్గం ప్రధాని శ్రీ రాస్ ముసేన్ వెంట వస్తోంది.

వైబ్రంట్ గుజ‌రాత్ స‌మిట్ సంద‌ర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, డెన్ మార్క్ ప్ర‌ధాని శ్రీ రాస్ ముసేన్ లు గాంధీనగర్ లో 2019వ సంవత్సరం జనవరి 18వ తేదీ న ద్వైపాక్షిక స‌మావేశం జ‌రిపారు. ఉభయ ప్రధానులు ఇంతకు ముందు 2018వ సంవత్సరం ఏప్రిల్ లో స్టాక్ హోం లో మొద‌టి ఇండియా- నార్డిక్ స‌మిట్ లో భేటీ అయ్యారు.

తాజా గా జ‌రిగిన స‌మావేశం లో ద్వైపాక్షిక స‌హ‌కారాని కి సంబంధించిన ప‌లు అంశాల‌పై ఇరువురు ప్ర‌ధానులు సంప్రదింపు లు జరిపారు. పరస్పర ప్రయోజనాలు ముడిపడిన బహుళ పార్శ్విక అంశాల పైన ప్ర‌ధానులు ఇరువురూ వారి వారి ఆలోచ‌న‌ల ను పంచుకున్నారు. ఇరు దేశాల మ‌ధ్య‌ ద్వైపాక్షిక వాణిజ్యాపకపి, పెట్టుబ‌డులను విస్తరించుకొనేందుకు అపార‌మైన అవకాశం ఉందని వారు గుర్తించారు.

ప‌లు ముఖ్య‌మైన సాంకేతిక‌త‌ల విష‌యంలో డెన్ మార్క్ అంత‌ర్జాతీయ స్థాయి లో ప్ర‌సిద్ధి చెందింది. ఈ సాంకేతికతలు భార‌త‌దేశాని కీ ప్రాసంగికమైనవే. డెన్ మార్క్ వద్ద నైపుణ్యాలు ఉన్నాయని, భారతదేశం వద్ద వనరులు ఉన్నాయని, ప్రపంచానికి నూతన సాంకేతికత ల ఆవశ్యకత ఉందని ప్రధాన మంత్రి అన్నారు. అంతర్జాతీయ స‌మ‌స్య‌లైన ఆహార భ‌ద్ర‌త‌, నీటి నిర్వ‌హ‌ణ‌, జల వాయు పరివర్తన, సుస్థిర అభివృద్ధి వంటి వాటి విష‌యం లో ప‌రిష్కారాలను క‌నుగొనగలిగే ఒక పరిశోధక వేదిక ను ఏర్పాటు చేయవలసిందిగా భారతదేశాన్ని, డెన్ మార్క్ ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఉత్సాహపరిచారు.

ఈ స‌మావేశం సంద‌ర్భంగా ఇరు దేశాల మ‌ధ్య‌ అవ‌గాహ‌న ఒప్పంద ప‌త్రాల‌ ను ఇచ్చి పుచ్చుకోవ‌డం జ‌రిగింది. స‌ముద్ర సంబంధిత అంశాల్లో భార‌త‌దేశ నౌకా ర‌వాణా శాఖ‌ కు, డెన్ మార్క్ ప‌రిశ్ర‌మ‌లు, వ్యాపార‌, ఆర్ధిక వ్య‌వ‌హారాల శాఖ‌కు మ‌ధ్య‌ ఎంఒయు కుదిరింది. గోవా రాజ‌ధాని ప‌ణజి లో అర్బ‌న్ లివింగ్ ల్యాబ్ ను ఏర్పాటు చేయ‌డానికిగాను ఇమాజిన్ పణజి స్మార్ట్ సిటీ డివెల‌ప్ మెంట్ లిమిటెడ్‌ కు న్యూ ఢిల్లీ లోని డేనిష్ ఎంబ‌సీ కి మ‌ధ్య‌ మ‌రో ఎంఒయు కుదిరింది.

130 కి పైగా డెన్ మార్క్ కంపెనీ లు భార‌త‌దేశం లో పెట్టుబ‌డులు పెట్టాయి. నౌకా ర‌వాణా, నవీకరణీయ యోగ్య శక్తి, ప‌ర్యావ‌ర‌ణం, వ్య‌వ‌సాయం, ఆహార ప‌దార్థాల త‌యారీ రంగాల్లో ఈ కంపెనీ లు పెట్టుబ‌డులు పెట్టాయి. ఇవి ఇత‌ర రంగాల్లోకి విస్త‌రించ‌డానికి ఉత్సుక‌త చూపుతున్నాయి. స్మార్ట్ అర్బన్ డివెలప్ మెంట్, వ్య‌ర్థాల‌ నుండి శ‌క్తి ఉత్ప‌త్తి మొద‌లైన రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటున్నాయి. గుజరాత్ లో శిప్పింగ్, నవీకరణీయ యోగ్య శక్తి రంగాల‌ లో ప‌లు ప్ర‌ధాన‌ డేనిష్ కంపెనీ లు పనిచేస్తున్నాయి.

డెన్ మార్క్ ప్ర‌ధాని శ్రీ రాస్ ముసేన్ న్యూ ఢిల్లీ లోని డేనిష్ రాయబార కార్యలయం నూతన భవనాన్ని మరియు డేనిష్ సాంస్కృతిక సంస్థ‌ ను ప్రారంభిస్తారు. 2019వ సంవత్సరం జ‌న‌వ‌రి 19 వ తేదీ న న్యూ ఢిల్లీ లోప్రారంభించనున్నారు. ఆయ‌న ఆగ్రా ను కూడా సంద‌ర్శించనున్నారు.