Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ప‌టం ఆవిష్క‌ర‌ణ కార్యక్రమం సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యలు


భార‌త‌దేశ రాష్ట్రప‌తి శ్రీ రామ్ నాథ్ కోవింద్ నేడు పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లో పూర్వ ప్ర‌ధాని శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ ప‌టాన్ని ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భం గా హాజ‌రైన వారి లో ఉప‌ రాష్ట్రప‌తి శ్రీ ఎం. వెంక‌య్య‌ నాయుడు, ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, లోక్ స‌భ స్పీక‌ర్ శ్రీ‌మ‌తి సుమిత్ర మ‌హాజ‌న్ ల‌తో పాటు ప‌లువురు ఇత‌ర ప్ర‌ముఖులు ఉన్నారు.

ఈ సంద‌ర్భం గా స‌భికుల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగించారు. వ‌రుస ట్వీట్ ల‌లో ప్ర‌ధాన మంత్రి ఏమ‌ని పేర్కొన్నారంటే:

“ఇక మీద‌ట అట‌ల్ గారు పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్ లో ఎల్ల కాలం ఉంటూ మ‌న‌ కందరికీ ప్రేర‌ణ ను అందిస్తూ మన ను దీవిస్తుంటారు.

అట‌ల్ గారి మంచిత‌నాన్ని గురించి మ‌నం మాట్లాడుకోవ‌టం మొద‌లుపెట్టామంటే గనక అది గంట‌ల తరబడి సాగుతుంది.

అట‌ల్ గారు ఒక సుదీర్ఘ రాజ‌కీయ జీవ‌నాన్ని గ‌డిపారు. అందులో చాలా కాలం పాటు ప్ర‌తిప‌క్షం లో గడచిపోయింది.

అయిన‌ప్ప‌టికీ, ప్ర‌జాహితం ముడిప‌డిన‌టువంటి అంశాల ను ఆయ‌న ప్ర‌స్తావిస్తూ వ‌చ్చారు; ఆయన త‌న సిద్ధాంతం నుండి ఎన్న‌టికీ దారి త‌ప్పనేలేదు.

అట‌ల్ గారి ఉప‌న్యాసం లో ఒక శ‌క్తి అంటూ ఉండేది. అదే విధం గా, అట‌ల్ గారి మౌనం లో కూడా అంతే స‌మాన‌మైన శ‌క్తి దాగి ఉండేది.

ఆయ‌న సంభాష‌ణా ప్రావీణ్యం సాటి లేనటువంటిది. ఆయ‌న లో ఒక గొప్ప హాస్య చ‌తుర‌త తొణికిసలాడేది”.