Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ యుద్ధ స్మార‌కాన్ని రేప‌టి రోజు న దేశ‌ల ప్ర‌జ‌ల కు అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి


జాతీయ యుద్ధ స్మార‌కాన్ని రేపు అంటే ఫిబ్ర‌వ‌రి 25 వ తేదీ నాడు జ‌రుగనున్న ఒక సంప్రదాయబద్ధ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేయనున్నారు. ఈ సంద‌ర్భం గా మాజీ సైనికోద్యోగుల‌ ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించనున్నారు.

న్యూ ఢిల్లీ లోని ఇండియా గేట్ స‌మీపం లో గల జాతీయ యుద్ధ స్మార‌కం స్వాతంత్య్రం సిద్ధించిన త‌రువాత దేశాన్ని కాపాడుతూ ప్రాణాలను అర్పించిన మ‌న జ‌వానుల కు ఒక స‌ముచిత‌ నివాళి వలె ఉంది.

శాంతి ప‌రిర‌క్ష‌క ఉద్య‌మాల లోను, చొర‌బాటుదారుల ను నిరోధించే కార్య‌క‌లాపాల లోను పాలుపంచుకొన్న సైనికులు మ‌రియు క‌ర్త‌వ్య నిర్వ‌హ‌ణ లో సర్వన్నతమైనటువంటి త్యాగాన్ని చేసిన‌ సైనికుల ను ఈ క‌ట్ట‌డం గుర్తు కు తెస్తుంది.

ఒక అత్యాధునిక‌మైన ప్రపంచ శ్రేణి క‌ట్ట‌డం గా జాతీయ యుద్ధ స్మార‌కాన్ని నిర్మించ‌నున్న‌ట్లు 2014వ సంవ‌త్స‌రం లో ప్ర‌ధాన మంత్రి త‌న దార్శ‌నిక‌త ను వెల్ల‌డించారు.

జాతీయ యుద్ధ స్మార‌కం లో భాగం గా నాలుగు స‌మ కేంద్రీయ వృత్తాలు ఉన్నాయి. వాటి పేర్లు.. ‘అమ‌ర్ చ‌క్ర’ లేదా అమ‌ర వృత్తం, ‘వీర‌తా చ‌క్ర’ లేదా సాహస వృత్తం, ‘త్యాగ్‌ చ‌క్ర’ లేదా త్యాగ వృత్తం, ‘ర‌క్ష‌క్ చ‌క్ర‌’ లేదా ర‌క్ష‌ణ వృత్తం.

జాతీయ‌ యుద్ధ స్మార‌క ప్రాంగణం లో ఒక కేంద్రీయ చ‌తుష్కోణ స్తంభం, ఒక నిరంత‌రాయం జ్వ‌లిస్తూ ఉండే అగ్ని శిఖ తో పాటు భార‌తీయ సేన, వాయు సేన‌, ఇంకా నౌకా ద‌ళం పోరు స‌లిపిన ప్ర‌సిద్ధ స‌మ‌ర సన్నివేశాలను ప్రతిబింబించేటటువంటి ఆరు కాంస్య కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి.

ప‌ర‌మ వీర చ‌క్ర పుర‌స్కారాలంకృతులైన 21 మంది యొక్క ఊర్థ్వ కాయ మూర్తుల‌ ను ప‌ర‌మ యోద్ధా స్థ‌లం లో నెల‌కొల్ప‌డ‌మైంది. వీటి లో ముగ్గురు స‌జీవ పుర‌స్కార స్వీక‌ర్త లు సుబేదార్ మేజర్ (రిటైర్డ్‌) శ్రీ బాణా సింహ్, సుబేదార్ మేజ‌ర్ శ్రీ యోగేంద్ర సింహ్, ఇంకా సుబేదార్ శ్రీ సంజయ్ కుమార్ ల యొక్క ప్ర‌తిమ‌లు కూడా భాగం గా ఉన్నాయి.

మృత వీరుల‌ కు ఒక దీటైన‌టువంటి నివాళి ని అర్పించడం కోసం కృత‌జ్ఞతబద్ధ దేశ ప్ర‌జానీకం యొక్క ఆకాంక్షల తాలూకు పరిణతి కి జాతీయ యుద్ధ స్మార‌కం ప్రతీక గా నిలుస్తుంది.