Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

1957 సంవత్సర గనులు, ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టానికి సవరణ


1957 సంవత్సర గనులు, ఖనిజాల (అభివృద్ధి మరియు నియంత్రణ) చట్టం (ఎమ్ఎమ్ డీఆర్ యాక్టు, 1957)లో సవరణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. వేలం ద్వారా మంజూరు చేయని కేప్టివ్ మైనింగ్ లీజుల బదలాయింపునకు ఈ సవరణ వీలు కల్పిస్తుంది. ఫలితంగా కంపెనీల విలీనాలు, కొనుగోళ్లకు వెసులుబాటు కలుగుతుంది. అంతే కాక, కంపెనీలు వాటి లాభదాయకతను మెరుగుపరచుకోవడానికి వీలుగా సరళతరమైన పద్ధతిలో వ్యాపారం చేయగలుగుతాయి. కేప్టివ్ లీజుల నుంచి ఖనిజ నిక్షేపాల సరఫరాలపై ఆధారపడ్డ కంపెనీలకు వ్యయాలు కూడా తగ్గుతాయి. ఈ బదలాయింపు నిబంధనలు ఏదైనా కంపెనీ గాని, లేదా ఆ కంపెనీకి చెందిన క్యాప్టివ్ మైనింగ్ లీజు గాని తాకట్టుకు లోనైన పక్షంలో.. ఆ కంపెనీకి చెందిన స్ట్రెస్ డ్ అసెట్స్ ను లిక్విడేట్ చేసే అధికారాన్ని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు కల్పిస్తాయి.

వేలం ద్వారా మంజూరు చేయని కేప్టివ్ లీజులను బదలాయించాలని కోరుకునే కౌలుదారులకు ఈ సవరణ ప్రయోజనం చేకూర్చుతుంది. బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు కూడా ఇది ఉపయోగకరమే. ఇది ప్రభుత్వంపై ఎటువంటి ఒకసారి వ్యయాన్ని గాని, పునరావృత్త వ్యయాన్ని గాని మోపదు.

పూర్వ రంగం :

వేలం ద్వారా మంజూరు చేసిన ప్రత్యేక సౌకర్యాల బదలాయింపు పరిధిని 2015 నాటి ఎమ్ఎమ్ డీఆర్ అమెండమెంట్ యాక్ట్ ద్వారా సవరించిన 1957 సంవత్సర ఎమ్ఎమ్ డీఆర్ యాక్టు పరిమితం చేసేసింది. అది కంపెనీ విలీనాల కొనుగోళ్ల పై ఆంక్షలకు కూడా తావిచ్చింది. కేప్టివ్ లీజుల నుంచి సరఫరా అయ్యే ఖనిజ నిక్షేపాలపై ఆధారపడి వ్యాపారం చేసే కంపెనీలకు ఇది ఒక అవరోధంగానూ పరిణమించింది. తాకట్టుకు లోనైన కంపెనీ, లేదా ఆ కంపెనీకి చెందిన కేప్టివ్ మైనింగ్ లీజు తాలూకు స్ట్రెస్ డ్ అసెట్స్ ను బ్యాంకులు,ఆర్థిక సంస్థలు లిక్విడేట్ చేయదలిస్తే అందుకు ఈ నిబంధన ఒక అడ్డంకిగా నిలిచింది.

***