Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శిక్ష‌ణ భ‌వ‌న్ మ‌రియు విద్యార్థి భ‌వ‌న్ కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

శిక్ష‌ణ భ‌వ‌న్ మ‌రియు విద్యార్థి భ‌వ‌న్ కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

శిక్ష‌ణ భ‌వ‌న్ మ‌రియు విద్యార్థి భ‌వ‌న్ కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి

శిక్ష‌ణ భ‌వ‌న్ మ‌రియు విద్యార్థి భ‌వ‌న్ కు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ లోని అడాల‌జ్ లో గ‌ల అన్న‌పూర్ణ ధామ్ ట్ర‌స్ట్ లో శిక్ష‌ణ భ‌వ‌న్ మ‌రియు విద్యార్థి భ‌వ‌న్ కు నేడు శంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఏదైనా ఒక యుగం యొక్క స‌వాళ్ళ ను ప‌రిష్క‌రించ‌డం కోసం స‌ముదాయాలు నాయ‌క‌త్వాన్ని వ‌హించేటటువంటి విశిష్ట‌ సంప్ర‌దాయాన్ని భార‌త‌దేశం క‌లిగివున్నద‌ని పేర్కొన్నారు. విద్య ను మ‌రియు సేద్యపు నీటి పారుద‌ల ను మెరుగు ప‌ర‌చ‌డం కోసం స‌ముదాయాలు ఏక‌మైన విష‌యాన్ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆ విధ‌మైన‌టువంటి సాముదాయ‌క ప్ర‌య‌త్నాలు ప్ర‌జల కు చాలా మేలు చేశాయ‌ని ఆయ‌న వివ‌రించారు.

స‌ర్ దార్ వ‌ల్ల‌భ్ భాయ్ ప‌టేల్ ను ప్ర‌ధాన మంత్రి స్మ‌రిస్తూ, స‌హ‌కార రంగం లో స‌ర్ దార్ ప‌టేల్ గారి ప్ర‌య‌త్నాలు ఎన్న‌టికీ మ‌రచిపోకూడదన్నారు.

ఫూడ్ ప్రాసెసింగ్ అంశం లో కృషి చేయ‌వ‌ల‌సింది గా గుజ‌రాత్ ప్ర‌జ‌ల కు ప్ర‌ధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఆ తరహా విలువ‌ జోడింపు రైతు ల‌కు, ప‌రిశ్ర‌మ కు కూడా ల‌బ్ది ని చేకూర్చుతుంద‌ని ఆయ‌న చెప్పారు.

అన్న‌పూర్ణ మాత కు ప్ర‌ధాన మంత్రి స్మృత్యంజ‌లి ని ఘ‌టిస్తూ, మహిళల- పురుషుల మధ్య స‌మాన‌త్వం తో పాటు ప్ర‌తి ఒక్క‌రి స‌మృద్ధి కి అవ‌స‌ర‌మైన శ‌క్తి ని స‌మాజాని కి అన్న‌పూర్ణ ధామ్ ట్ర‌స్టు అందించాల‌ని అభిలషించారు.