Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప‌ట్నా హైకోర్టు శ‌తాబ్ది ఉత్స‌వాల ముగింపు స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం

ప‌ట్నా హైకోర్టు శ‌తాబ్ది ఉత్స‌వాల ముగింపు స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం


ప‌ట్నా హైకోర్టు శ‌తాబ్ది ఉత్స‌వాల ముగింపు స‌మావేశంలో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ప‌ట్నా హైకోర్టు వ‌ద్ద ఏర్పాటు చేసిన స‌భ‌లో మాట్లాడుతూ గ‌త వంద సంవ‌త్స‌రాల్లో ప‌ట్నా హైకోర్టు సాధించిన ఘ‌న‌త‌ల్ని కొనియాడారు. ఈ వంద సంవ‌త్స‌రాల్లో ప‌ట్నా హైకోర్టు సాధించిన విశిష్టత‌ల్నిమ‌రింత‌ ముందుకు తీసుకుపోవాల‌న్నారు. అంద‌రూ స‌మైక్యంగా నూత‌న నిర్ణ‌యాలు తీసుకొని రాబోయే సంవ‌త్స‌రాల్లో స‌రికొత్త ప్ర‌మాణాల‌ను నెల‌కొల్ప‌డానికి కృషి చేయాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ సాంకేతిక‌రంగ సామ‌ర్థ్యాన్ని ప్ర‌స్తావించారు. ప‌ట్నాహైకోర్టు బార్‌, బెంచ్‌, కోర్టు ఈ మూడూ టెక్నాల‌జీని స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకోవాల‌ని కోరారు. సాంకేతిక‌త‌ను చ‌క్క‌గా ఉప‌యోగించుకుంటే వాద‌న‌లుగానీ, తీర్పులుగానీ నాణ్యత‌తో ఉంటాయ‌ని ప్ర‌ధాని వివ‌రించారు.