Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిక్కిమ్, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, త్రిపుర‌ ల‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంట‌ర్‌ ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాప‌న చేసిన అనంతరం ప్ర‌ధాన‌ మంత్రి చేసిన ప్ర‌సంగ‌ం యొక్క పాఠం


 

ఈశాన్య రాష్ట్రాల‌ లో స్మార్ట్ గ‌వ‌ర్నెన్న్‌ కు సంబంధించిన ఈ నూత‌న ప్రారంభం లో నేను భాగ‌స్వామి ని కావ‌డం ఎంతో ఆనందం గా ఉంది.  గంగ్‌టోక్‌, నామ్‌ చీ, పాసీఘాట్‌, ఈటాన‌గ‌ర్‌, అగ‌ర్త‌లా లో ఇంటిగ్రేటెడ్  కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంట‌ర్‌ ల‌ ప్రారంభం ఒక ర‌కం గా స్వాగ‌తించ‌ద‌గ్గ చ‌ర్య‌.

ఈశాన్య రాష్ట్రాల ప‌ట్ట‌ణ కేంద్రాలు, వాటికి గ‌ల నైపుణ్యం క‌లిగిన అపార మాన‌వ‌ వ‌న‌రుల‌ తో ఈ ప్రాంతం మొత్తానికి అద్భుత ప్ర‌గ‌తి కేంద్రాలు గా రూపొందే అవ‌కాశం ఉంది.

స్మార్ట్ సిటీ మిశన్ ఆయా న‌గ‌రాల‌కు గ‌ల సామ‌ర్ధ్యాల‌ ను, స‌వాళ్ల‌ ను గుర్తించే వీలు క‌ల్పిస్తుంది.  ప్ర‌జా సంప్ర‌దింపుల ద్వారా స‌వాళ్ల‌ కు సమ‌ర్ధ‌వంత‌మైన ప‌రిష్కారాల‌ ను సాధిస్తుంది.

స్మార్ట్ సిటీ క‌మాండ్ ఎండ్ కంట్రోల్ సెంట‌ర్ లు డిజిట‌ల్ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించి వివిధ సేవా నెట్ వ‌ర్క్‌ ల‌ను అనుసంధానం చేస్తుంది.  ఇది పోలీసు, ర‌వాణా, విద్యుత్తు, నీరు , పారిశుధ్యం, ప్ర‌జాభ‌ద్ర‌త సదుపాయాలు క‌ల్పించే వివిధ విభాగాల‌ తో రియ‌ల్‌ టైమ్ కొలాబ‌రేశన్ కు వీలు క‌ల్పిస్తుంది..

ఈ వ్య‌వ‌స్థ అందుబాటు లోకి రావ‌డం వ‌ల్ల పాల‌న యంత్రాంగం న‌గ‌ర కార్య‌క‌లాపాల‌ ను మ‌రింత మెరుగు గా  నిర్వ‌హించ‌డానికి, ఎప్ప‌టిక‌ప్పుడు వెంట‌నే స్పందించ‌డానికి అవ‌కాశం క‌లుగుతుంది.

ఇంటిగ్రేటెడ్  కమాండ్ ఎండ్ కంట్రోల్ సెంటర్ ల అమ‌లు దేశ‌వ్యాప్తం గా వేగం పుంజుకొంటోంది.  2019వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నాటి కి దేశం లోని 15 న‌గ‌రాల‌ లో అందుబాటు లోకి వ‌చ్చాయి.  మ‌రో 50 న‌గ‌రాల‌ లో వీటి ప‌నులు పురోగ‌తి లో ఉన్నాయి.
2019 అక్టోబ‌ర్ నాటికి ఈశాన్య ప్రాంతం లో తొలి స్మార్ట్ కమాండ్ కంట్రోల్ సెంట‌ర్ అందుబాటు లోకి రానుంది.

ఈ కేంద్రం లోని ముఖ్య‌మైన అంశం, పౌరుల భ‌ద్ర‌త‌ కోసం సిసిటివి నిఘా వ్య‌వ‌స్థ పని చేస్తుంది.  నేరాల‌ ను అదుపు చేసే రీతి లో దీని కి రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రిగింది.

అలాగే ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్య‌వ‌స్థ ట్రాఫిక్ ర‌ద్దీ ని త‌గ్గించ‌డానికి ఉప‌క‌రిస్తుంది.

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ లోని ఘ‌న‌ వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్థ ఈ న‌గ‌రాల‌ లో పారిశుధ్య ప‌రిస్థితుల‌ ను మ‌రింత మెరుగుప‌రచ‌నుంది.  స్మార్ట్ విద్యుద్దీపాల వ్య‌వ‌స్థ మ‌న వీధుల‌ ను సుర‌క్షితం గా, పౌరుల‌ కు సౌక‌ర్య‌వంతం గా ఉండ‌నుంది.  ఎల్‌ఇడి వ్య‌వ‌స్థ‌ కు మార‌డం వ‌ల్ల ఇంధ‌న సామ‌ర్ధ్యం కూడా మెరుగుప‌డుతుంది.

పౌరుల‌ కు  కీల‌క స‌మాచారాన్ని అందించేందుకు  స్మార్ట్ సిటీలు ప‌బ్లిక్ అడ్ర‌స్ వ్య‌వ‌స్థ‌ ను, వేరియ‌బుల్ మెసేజ్ గుర్తుల‌ ను ఉప‌యోగించ‌నున్నాయి.

డిజిట‌ల్ స‌దుపాయం లభ్యత డిజిట‌ల్ ఇండియా మిశన్‌ లో కీల‌క‌మైంది.  సార్వజనిక వై-ఫై వ్య‌వ‌స్థ పౌరుల‌ కు ఉచిత ఇంట‌ర్ నెట్ లభ్యత స‌దుపాయం క‌ల్పిస్తుంది.

ఈశాన్య రాష్ట్రాలు వాతావ‌ర‌ణ ప‌రం గా సున్నిత‌మైన ప్రాంతం.  వాతావ‌ర‌ణ ప‌రిశీల‌క వ్య‌వ‌స్థ‌, విప‌త్తు ల నిర్వ‌హ‌ణ మాడ్యూళ్లు  ప్ర‌భుత్వాని కి, పౌరుల‌ కు రియ‌ల్‌ టైమ్ స‌మాచారాన్ని అంద‌జేస్తాయి.  ఇది మొత్తం గా ప్ర‌జ‌ల జీవ‌న నాణ్య‌త‌ ను మెరుగుప‌రచేందుకు ఉప‌క‌రిస్తుంది.

ఈ వ్య‌వ‌స్థ‌ కు సంబంధించి వివిధ అంశాల‌ ను విస్త‌రింప‌చేయ‌డం , అమ‌లు చేయ‌డం వ‌ల్ల సుల‌భ‌త‌ర జీవ‌నాన్ని ఇది మ‌రింత మెరుగుప‌రుస్తుంది.

ఈశాన్య‌ రాష్ట్రాల‌ లో ప‌ది స్మార్ట్ సిటీస్ లో సుమారు 15,000 కోట్ల రూపాయ‌ల విలువ‌ గ‌ల 500 ప్రాజెక్టులు ఉన్న‌ట్టు నా దృష్టి కి వ‌చ్చింది.  ఇందులో ఇప్ప‌టికే 59 ప్రాజెక్టుల‌కు వ‌ర్క్ ఆర్డ‌ర్లు జారీ అయ్యాయి.

సిక్కిమ్ లోని నామ్ చీ లో ఏకీకృత నీటి పారుద‌ల పథకాలు, ఎల్‌ఇడి వీధి దీపాలు, ఫుట్‌పాత్‌ లు వంటి ప‌నులు సిక్కిమ్ లోని నామ్ చీ లో ప్రారంభ‌ం అవతూ ఉండ‌టం సంతోషం క‌లిగిస్తోంది.  కొండ‌ ప్రాంత న‌గ‌రాల‌ లో నీటి స‌ర‌ఫ‌రా ఒక పెద్ద స‌వాలు.  గంగ్ టోక్ వ‌ర్ష‌పు నీటి నిల్వ‌ కు సంబంధించి ప‌నులు చేప‌ట్టింది.  అలాగే న‌గ‌రం లో వాహనాల రాకపోక ల ర‌ద్దీ ని నియంత్రించేందుకు స్మార్ట్ పార్కింగ్ స‌దుపాయాల‌ తో బ‌హుళ అంత‌స్తుల కార్  పార్కు ల నిర్మాణాన్ని చేప‌ట్ట‌డం జ‌రిగింది.

అగ‌ర్త‌లా భౌగోళికం గా చిన్న పళ్ళెం ఆకారం లో ఉండ‌డం వ‌ల్ల వ‌ర‌ద‌ల ముప్పు ను ఎదుర్కోవ‌డం స‌వాలు గా మారింది. స్మార్ట్ సిటీస్ మిశన్ లో భాగం గా ఈ స‌మ‌స్య‌ ను అధిగ‌మించేందుకు ప్రాజెక్టు లను  చేపట్ట‌డం జ‌రిగింది.

ఈటాన‌గ‌ర్ లో స్మార్ట్ రోడ్ల నిర్మాణం, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్ ద్వారా న‌గ‌ర రోడ్ నెట్‌ వ‌ర్క్‌ ను మెరుగుప‌రచేందుకు ప్ర‌ణాళిక‌లను రూపొందించారు. పాసీఘాట్ ఎదుర్కొంటున్న‌ గృహ‌నిర్మాణం, ఇంధ‌న నిర్వ‌హ‌ణ‌, వ్యాపారాభివృద్ధి స‌వాళ్ల‌ను స్మార్ట్‌ సిటీ ప్రోజెక్టుల‌ ద్వారా చేప‌ట్ట‌డం జ‌రిగింది.

అందువ‌ల్ల, ప్ర‌తి న‌గ‌రం తాను  ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ ను గుర్తించి , ఈ స‌మ‌స్య‌ల కు ప‌రిష్కారాల‌ ను సాధించే దిశ‌ గా క‌దులుతోంది.

ఇత‌ర ఐదు ఈశాన్య న‌గ‌రాలైన గువాహాటీ, ఆయిజోల్ కోహిమా, ఇమ్ఫాల్‌ మరియు శిలాంగ్ లు కూడా ఈ దిశ‌ గా ముందుకు పోతున్న‌ట్టు తెలిసి సంతోషం క‌లుగుతోంది.

స్మార్ట్ సిటీస్ మిశన్ లో భాగం గా ప్రాజెక్టు ల అమ‌లు ప్రస్తుతం వేగాన్ని పుంజుకొంటోంది.

మ‌నం మన ఈశాన్య ప్రాంత న‌గ‌రాల ముఖ‌చిత్ర మార్పు దిశ‌ గా వేగ‌వంత‌మైన అభివృద్ధి ని సాధిస్తున్నామ‌న్న న‌మ్మ‌కం నాకుంది.  దీనితో ప్ర‌జ‌ల జీవ‌న నాణ్య‌త‌  మెరుగుప‌డటం తో పాటు ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధి అధికం కానుంది.

1