Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన గాంధీ శాంతి బ‌హుమ‌తి ప్ర‌దానోత్సవం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

న్యూ ఢిల్లీ లోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన గాంధీ శాంతి బ‌హుమ‌తి ప్ర‌దానోత్సవం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

న్యూ ఢిల్లీ లోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన గాంధీ శాంతి బ‌హుమ‌తి ప్ర‌దానోత్సవం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం

న్యూ ఢిల్లీ లోని రాష్ట్రప‌తి భ‌వ‌న్ లో జ‌రిగిన గాంధీ శాంతి బ‌హుమ‌తి ప్ర‌దానోత్సవం లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం


శ్రేష్ఠులైన మాన్య రాష్ట్రప‌తి గారు, ప్రసిద్ధ మాననీయ వ్యక్తులు మ‌రియు ప్ర‌తిష్టాత్మ‌క‌ స‌త్కారాన్ని అందుకొన్న దయాళువులారా,

ముందుగా, ఈ కార్య‌క్ర‌మం ఆరంభం కావడంలో జరిగిన జాప్యానికిగాను నా యొక్క క్ష‌మాప‌ణ‌ ల‌ను ఆమోదించండి. దుర‌దృష్టవ‌శాత్తు, నేను పాల్గొన‌వ‌ల‌సిన మ‌రొక ముఖ్యమైన కార్య‌క్ర‌మం కార‌ణం గా ఇక్క‌డ కు సకాలం లో రాలేక పోయాను; అందువల్ల నేను జరిగిన జాప్యానికి గాను మీ అందరికీ నిజాయతీ తో మ‌రొక్క మారు క్ష‌మాప‌ణ‌లు చెప్తున్నాను.

ప్రతిష్టాకరమైనటువంటి గాంధీ శాంతి బ‌హుమతి ని యావత్తు ప్ర‌పంచం పూజ్య బాపూజీ 150వ జ‌యంతి ని జ‌రుపుకొంటున్న టువంటి ఈ రోజు న, మాన‌వాళి కోసం స‌మ‌ర్ప‌ణ భావం తో కృషి చేస్తూ తమ జీవితాల లో బాపూ యొక్క దార్శనికత ను నింపుకొన్న‌టువంటి కృపాళువుల కు మ‌రియు సంస్థ‌ ల‌కు ప్రదానం చేయడం నిజం గా జాతిపిత కు ఒక స‌ముచిత‌మైన నివాళి ని అర్పించ‌డ‌మే అవుతుంది.

తమ జీవితాల ను అంకితం చేసుకొన్నటువంటి సంస్థ‌లు లేదా పౌరులు ఈ విధ‌మైన‌ గుర్తింపు కు అర్హులు. క‌న్యాకుమారి లోని వివేకానంద కేంద్రం కావ‌చ్చు లేదా ఏక‌ల్ విద్యాల‌య కావ‌చ్చు, వాటి యొక్క నిరంత‌రాయ కృషి తో స‌మాజం లో నిరాదరణకు గురైన వ‌ర్గాల వారి కి విద్యార్జ‌న దిశ గా మ‌ళ్ళేందుకు స్ఫూర్తి ని అందిస్తున్నాయి. స‌మాజాభివృద్ధి కోసం పరిపూర్ణంగా అంకిత‌ం అయిన‌టు వంటి ఈ సంస్థ‌లు అట్ట‌డుగు స్థాయి లో స్థిరత్వంతో కూడిన అభివృద్ధి ప‌థ‌కాల‌ కు రూప క‌ల్ప‌న చేశాయి. వాటి ప్ర‌య‌త్నాల‌ ను గౌర‌విస్తున్న ఈ సంద‌ర్భం లో. స‌త్కార స్వీకర్తలకు నేను నా యొక్క హృద‌య పూర్వ‌కమైన అభినంద‌న‌ల ను తెలియ‌జేస్తున్నాను.

‘‘స్వ‌రాజ్యం’’ (స్వపరిపాలన) లేదా ‘‘స్వ‌చ్ఛ‌త’’ (పరిశుభ్రత) – ఈ రెండిటి లో ఏదో ఒకటి ఎంచుకోండని గాంధీ జీ ని ఒక‌సారి అడిగితే అప్పుడు ఆయ‌న నేను ఈ రెండిటి లో ఒక దానిని ఎంచుకోవలసివస్తే నేను ప‌రిశుభ్ర‌త కే మొగ్గు చూపుతాను అన్నారు. పూజ్య బాపూ యొక్క ఈ దార్శ‌నిక‌త ను నెర‌వేర్చ‌వ‌ల‌సిన బాధ్య‌త మ‌న అంద‌రిదీ.

మ‌న దేశం లో మరుగుదొడ్లను ఏర్పాటు చేసేందుకు మరియు దేశంలో మూల మూల న పరిశుభ్రత కోసం అదే పని గా పాటుప‌డున్న వ్యక్తి ఈ రోజు న అత్యంత గౌర‌వాన్వితుడు. స్వ‌చ్ఛ‌త కై ఉద్దేశించిన ప్ర‌చారం లో సుల‌భ్ శౌచాల‌య్ వంటి ఒక ఉద్య‌మం అందిస్తున్న తోడ్పాటు ను అభినందిస్తూ మరి సమ్మానించుకోవడం నిజానికి ఒక ప్రత్యేక అధికారమే అని చెప్పాలి.

మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని అక్ష‌య పాత్ర పున‌ర్ నిర్వ‌చించింది. రాష్ట్రాల‌ లో పాఠ‌శాల బాలల కు పోష‌క విలువ లు క‌లిగిన ఆహారాన్ని అందించాల‌న్న ఈ ప్ర‌భుత్వ ప‌థ‌కాన్ని ఈ సంస్థ ప‌టిష్టపరచింది. ఈ విధ‌మైన సేవ‌ల‌ ను అందించ‌డం లో ఆ సంస్థ వారు అత్యంత వృత్తి నైపుణ్యాన్ని క‌న‌బ‌రుస్తున్నారు. మరి కొద్దికాలం కింద‌ట వారి ఆధ్వ‌ర్యం లో వృందావ‌న్ లో మూడు వంద‌ల కోట్లవ భోజ‌నాన్ని వ‌డ్డించినందుకు నేను అదృష్టవంతుడి ని.

పౌష్టికాహార లోపం తో పోరాడాలని ఒక చాలా పెద్దదైనటువంటి సమగ్రమైన ఉద్యమం పైన భారత ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. భార‌త‌దేశపు చిన్నారులు ఆరోగ్యం గా ఉన్న‌ప్పుడే భార‌త‌దేశం ఆరోగ్యం గా ఉండ‌గ‌ల‌దు.

ప్ర‌భుత్వం యొక్క ఈ బృహ‌త్త‌ర‌ ఉద్య‌మం పౌరుల ప్రాతినిధ్యం తో ఏకీకృతం అయ్యి భార‌త‌దేశాన్ని స్వావ‌లంబ‌న దిశ గా న‌డిపిస్తుంది.

స్వాతంత్య్ర ఉద్య‌మం లో మహాత్మ గాంధీ యొక్క సాఫ‌ల్యాన్ని ఆయ‌న‌ లోని తరగని ఉద్వేగాని కి ఆపాదించ‌వ‌చ్చును. మ‌రి ఈ ఉద్వేగం మ‌న దేశ సంప్ర‌దాయం కూడాను. బానిస‌త్వం లో మ‌గ్గిన సంవ‌త్స‌రాలు మ‌న దేశాని కి గొప్ప విప్ల‌వ నాయ‌కుల‌ ను కూడా అందించాయి. గాంధీజీ స్వాతంత్య్ర పోరాటాన్ని ఒక ప్రజ‌ల ఆందోళ‌న గా మ‌ల‌చారు. ఇది మ‌న దేశం యొక్క పోక‌డ గా అయింది. దేశాని కి చేసే ఎటువంటి సేవ అయినా స్వాతంత్య్ర ఉద్య‌మాని కి తోడ్పాటు ను అందించేదే అన్న భావన ను ప్ర‌తి ఒక్కరి మ‌స్తిష్కం లో ఇంకేట‌ట్టు ఆయన చేశారు. స్వాతంత్య్ర ఉద్య‌మ కాలం లో వెల్లువెత్తిన ప్ర‌జ‌ల భారీ ప్రాతినిధ్యం ప్ర‌స్తుతం ఒక స‌మృద్ధ‌మైన మ‌రియు సంతోషకరమైన భార‌త‌దేశాని కి అంతే విలువైందవుతుంది. ఈ గాంధేయ దార్శ‌నిక‌తే ఆయ‌న యొక్క 150వ జ‌యంతి రోజున, మ‌రి అలాగే 2022వ సంవ‌త్స‌రం లో స్వాతంత్య్రానికి 75 సంవ‌త్స‌రాలు అవుతూ వ‌జ్రోత్స‌వాన్ని జ‌రుపుకొనే సంద‌ర్భం లో ఆయ‌న కన్న క‌ల‌ ను నెర‌వేర్చే దిశ‌ గా మన కు దారి ని చూపుతోంది. పూజ్య బాపూ ఒక విశ్వ మాన‌వుడు. స్వాతంత్య్ర ఉద్య‌మ కాలం లో ఆయ‌న‌ కు తీరిక అనేది చాలా క‌ష్టం గా దొరికిన‌ప్ప‌టికీ కుష్టు వ్యాధి తో బాధ ప‌డే వారికి సేవ చేయ‌డం కోసం ఆయ‌న వారం రోజు ల‌లో ఒక్క రోజు ను ఎంతో త‌త్ప‌ర‌త‌ తో అట్టిపెట్టుకొనే వారు. కుష్టు వ్యాధి అంతానికై ఆయ‌న త‌న స‌మ‌యాన్ని ఎంతో శ్ర‌ద్ధ తో ప‌ట్టు విడువ‌క కేటాయిస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మం లో కుష్టు వ్యాధి గ్ర‌స్తుల‌ ను వెలివేసిన ప్ర‌జ‌ల ఆలోచ‌న స‌ర‌ళి ని ఆయ‌న మార్చ‌వ‌ల‌సి వ‌చ్చింది. స‌స్క‌వాజీ కుష్టు వ్యాధి పై పోరాడ‌టం కోసం త‌న జీవితం లో నాలుగు ద‌శాబ్దాల ను అంకితం చేశారు. ఈ ప్ర‌య‌త్నాలు ఈ వ్యాధి ని గురించిన చైత‌న్యాని కి దారి పరచాయి. మ‌రి దీనితో స‌మాజ ఆమోదం సైతం ల‌భించింది. అటువంటి ప‌రివ‌ర్త‌న కార‌కులు ఎంతో మంది ఉండే వారు. వారు ఈ పౌరుల ప‌ట్ల సానుభూతి ని క‌న‌బ‌ర‌చారు. ఈ పౌరులు ఈ వ్యాధి కార‌ణం గా స‌మాజం లో వివ‌క్ష కు లోనై దైనందిన కార్య‌క‌లాపాల నుండి వెలివేయ‌బ‌డ్డారు. ఈ ప‌విత్ర‌ సంద‌ర్భం లో వారిని ప్ర‌ధాన స్ర‌వంతి లో జ‌త చేసిన వ్య‌క్తుల కృషి ని గుర్తించ‌డం ముఖ్యం. ఇది కుష్టు వ్యాధి తో ముడిప‌డ్డ క‌ళంకాన్ని తొల‌గించ‌డం కోసం బాపూ చేసిన సేవ కు ఒక స‌ముచిత‌మైనటువంటి నివాళి కాగ‌ల‌దు.

ఈ ప్ర‌పంచ నాయ‌కుడి ప్ర‌భావం ఎంత‌టిదంటే, ఆయ‌న 150వ జ‌యంతి నాడు 150 దేశాల కు పైగా దేశాల కు చెందిన గాయ‌నీ గాయ‌కులు ఆయ‌న కు ఎంతో ఇష్ట‌మైన‌టువంటి ప్రార్థ‌న గీతం ‘వైష్ణ‌వ్ జ‌న్ తో.. ’ను ముక్త కంఠం తో పాడారు. భాష రాని వారు సైతం దీని ని ఆలాపించ‌డం ఎంత సుంద‌రం గా ఉందో. దీని ని యూ ట్యూబ్ లో చూడ‌వ‌చ్చును. ఇది భార‌త‌దేశం ప్ర‌పంచ వ్యాప్తం గా తెచ్చుకొన్న‌టువంటి గుర్తింపున‌ కు ఒక నిద‌ర్శ‌నం గా ఉండి, స్ఫూర్తి ని రేకెత్తిస్తోంది. గాంధీ గారి ప‌ట్ల గౌర‌వం తో అనేక దేశాలు ఒక్క‌టైన తీరు గాంధేయ త‌త్వం మాన‌వాళి హితం దిశ గా కృషి చేయ‌డం లో చ‌రిత్ర ను సృష్టించేది గా ఉంద‌న్న వాస్త‌వాని కి ఒక్క ఉపాఖ్యానం వంటిది. దీని ని భూగోళం అంత‌టా ప్ర‌స్తుతం అంగీకరించడం జ‌రుగుతోంది.

ఇది భార‌త‌దేశం లోని పౌరులంద‌రి కీ జరిగినటువంటి అతి పెద్ద స‌మ్మానాల లో ఒక‌టి గా ఉంది. ఈ దేశం లోని బాల‌ల కు ఇంత‌కంటే మంచి గుర్తింపు మ‌రేమి ఉంటుంది.

మీ లో ప్ర‌తి ఒక్క‌రి ని మ‌రొక్క‌ మారు నేను అభినందిస్తున్నాను. మీ భావి ప్ర‌య‌త్నాలు చ‌క్క‌గా సాగాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను. పూజ్య బాపూ కు నా విన‌మ్ర వంద‌నం తో, ఈ మ‌హా నేత‌ కు శ్ర‌ద్ధాంజ‌లి ని ఘ‌టిస్తూ నా ఈ ఉప‌న్యాసాన్ని నేను ముగిస్తాను.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**