పిఎంఇండియా
సముద్ర స్థిత పవన శక్తి పై ప్రత్యేకం గా దృష్టి పెడుతూ నవీకరణ యోగ్య శక్తి రంగం లో సహకరించుకొనేందుకు భారత ప్రభుత్వ నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ కు, కింగ్‌డమ్ ఆఫ్ డెన్మార్క్ కు చెందిన ఎనర్జీ, యుటిలిటీస్ ఎండ్ క్లయిమేట్ మంత్రిత్వ శాఖ కు మధ్య కుదిరినటువంటి ఒక సహకారపూర్వక ఒప్పందాని కి మరియు భారతదేశం లో ఒక ఇండో-డేనిశ్ సెంటర్ ఆఫ్ ఎక్సలన్స్ ఫర్ రిన్యూవబుల్ ఎనర్జీ ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించినటువంటి ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం పై న్యూ ఢిల్లీ లో 2019వ సంవత్సరం మార్చి నెల లో సంతకాలయ్యాయి.
సముద్ర స్థిత పవన శక్తి పైన ప్రత్యేకం గా దృష్టి ని సారిస్తూ ఉండేటటువంటి నవీకరణ యోగ్య శక్తి రంగం లో ఉభయ దేశాల కు మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ సహకారపూర్వక ఒప్పందం యొక్క ధ్యేయం గా ఉంది. సహకరించుకొనే రంగాల లో ఆఫ్-శార్ విండ్ ప్రాజెక్ట్స్ యొక్క నిర్వహణ సంబంధిత సాంకేతిక విజ్ఞాన సామర్ధ్యం నిర్మాణం, అత్యంత దక్షత తో కూడి వుండే పవన పరిశ్రమ ను అభివృద్ధి చేసేందుకు చేపట్టవలసిన చర్యలు; అధిక నాణ్యత కలిగిన విండ్ టర్బయిన్ లు, కంపోనంట్ లు, ఇంకా ధ్రువీకరణ పత్రాల సంబంధిత ఆవశ్యకత లు వంటివి భాగం గా ఉంటాయి.
ఇండో-డేనిశ్ సెంటర్ ఆఫ్ ఎక్సల న్స్ ఇన్ ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ పవర్ అనేది సముద్ర తీరం లోని మరియు సముద్ర తీరాని కి ఆవల ఉన్న పవన శక్తి; హైబ్రిడైజేశన్ ఆఫ్ విండ్, సోలర్, హైడ్రో అండ్ స్టోరేజ్ టెక్నాలజీస్ మరియు పవన శక్తి తాలూకు ఉన్నత స్థాయి నవీకరణ యోగ్య శక్తి ఏకీకరణ, నైపుణ్యాల అభివృద్ధి/సామర్ధ్య నిర్మాణం, టెస్టింగ్, ఇంకా ఆర్ & డి.. ఈ అంశాల పై శ్రద్ధ ను వహిస్తూ నవీకరణ యోగ్య శక్తి వనరుల మూల్యాంకనం పై పని చేస్తుంది.
పత్రాల పై సంతకాల ప్రక్రియ పూర్తి కావడం ఉభయ దేశాల లో ద్వైపాక్షిక సహకారం యొక్క పటిష్టీకరణ కు సహాయకారి కానుంది.