పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 సాధారణ ఎన్నికలలో గెలుపు నకు గాను ప్రపంచ వ్యాప్త నేతల వద్ద నుండి అభినందన పూర్వకమైన టెలిఫోన్ కాల్స్ ను అందుకొన్నారు. ఆ యా నేతల లో బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా, భూటాన్ రాజు శ్రీ జిగ్మే ఖేసర్ నామ్ గ్యాల్ వాంగ్ చుక్, భూటాన్ ప్రధాని డాక్టర్ లోటే శెరింగ్, నేపాల్ ప్రధాని శ్రీ కె.పి. శర్మ ఓలి, మాల్‌దీవ్స్ అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిమ్ మొహమద్ సోలిహ్, శ్రీ లంక ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘే, రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమాన్యుయేల్ మేక్రాన్, జపాన్ ప్రధాని శ్రీ ఆబే శింజో, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, మారిషస్ ప్రధాని శ్రీ ప్రవింద్ జగన్నాథ్, యుఎఇ యువరాజు శ్రీ మొహమ్మద్ బిన్ జయేద్ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ లు ఉన్నారు.
ప్రధాన మంత్రి ని నేతలు అభినందిస్తూ, ఆయన నాయకత్వం పట్ల భారతదేశ ప్రజల లో ఉన్న ఎనలేని విశ్వాసాన్ని ఈ చారిత్రక తీర్పు ప్రతిబింబిస్తోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
వారందరి అభినందనల కు మరియు శుభాకాంక్షల కు ప్రధాన మంత్రి కృతజ్ఞత ను వ్యక్తం చేస్తూ, ఈ సాధారణ ఎన్నికలు ప్రపంచం లో అతి పెద్దదైన భారతదేశ ప్రజాస్వామ్య శక్తి కి ప్రతిరూపంగా నిలచాయన్నారు. పరస్పర ప్రయోజనకారి ద్వైపాక్షిక సంబంధాల ను మరియు బహుళ పాక్షిక సహకారాన్ని అభివృద్ధిపరచుకోవడం లో వారు సహకారాన్ని అందించినందుకు ఆయన వారికి ధన్యవాదాలు పలికారు; మరింత పటిష్టమైనటువంటి సంబంధాలను వర్ధిల్లజేసుకొనే కృషి ని కొనసాగించాలని ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి సామాజిక మాధ్యమాల లోను, ఇంకా ఇతర మార్గాల లోను తనకు అభినందన లు తెలిపిన అనేక మంది ఇతర నేతలకు కూడా తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.