Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కిర్గిజ్ రిప‌బ్లిక్ అధ్య‌క్షుని తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి


కిర్గిజ్ రిప‌బ్లిక్‌ అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడు మాన్య‌ శ్రీ సూరోన్‌ బే శరిపోవిక్ జీన్‌బెకోవ్ 2019వ సంవ‌త్స‌రం మే 30వ తేదీ న న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పదవీ ప్ర‌మాణ‌ స్వీకారోత్స‌వాని కి విచ్చేశారు.

కిర్గిస్తాన్ మ‌ధ్య ఆసియా లో భార‌త‌దేశాని కి ఒక ప్ర‌ధాన‌మైన భాగ‌స్వామి గా, శంఘాయి కోఆప‌రేశన్ ఆర్గ‌నైజేశన్ (ఎస్ సిఒ)కు ప్ర‌స్తుతం అధ్య‌క్షురాలి గా కూడా ఉంది. అధ్య‌క్షుడు శ్రీ జీన్‌బెకోవ్ ప్ర‌ధాన మంత్రి కి ఆత్మీయ అభినంద‌న‌లు తెలిపారు. 2019వ సంవ‌త్స‌రం జూన్ 13-15 తేదీల మ‌ధ్య ఎస్‌సిఒ శిఖ‌ర స‌మ్మేళ‌నం తో పాటు ద్వైపాక్షిక సంద‌ర్శ‌న కోసం కూడా కిర్గిస్తాన్ కు త‌ర‌లి రావలసిందంటూ తాను ప్రధాన మంత్రి ని ఆహ్వానించిన సంగతి ని అధ్య‌క్షుడు శ్రీ జీన్‌బెకోవ్ ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు.

భార‌త‌దేశాని కి, కిర్గిస్తాన్ కు మ‌ధ్య ఆప్యాయ‌మైనటువంటి మ‌రియు మైత్రీపూర్వ‌క‌మైనటువంటి సంబంధాలు ఉన్న సంగ‌తి ని ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెస్తూ, కొన్ని సంవత్సరాలు గా ఉభయ దేశాల మధ్య ద్వైపాక్షిక స‌హ‌కారం బ‌ల‌ప‌డుతూవుండ‌టం ప‌ట్ల సంతృప్తి ని వ్య‌క్తం చేశారు. ప‌ద‌వీప్రమాణ స్వీకారోత్స‌వాని కి అధ్య‌క్షుడు శ్రీ జీన్‌బెకోవ్ హాజ‌రు అయినందుకు ఆయ‌న ధ‌న్య‌వాదాలు ప‌లుకుతూ, కిర్గిస్తాన్ సంద‌ర్శ‌న కు త‌న ను ఆహ్వానించినందుకు కృత‌జ్ఞ‌తల ను వ్య‌క్తం చేశారు. ఈ ప‌ర్య‌ట‌న కోసం తాను ఎంతో కుతూహ‌లం తో ఎదురుచూస్తున్నానని ఆయ‌న అన్నారు.