Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

1-1-2016 నుంచి చెల్లించవలసి ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యం అదనపు కిస్తీ, మరియు పింఛన్ దారులకు కరవు సాయం విడుదల


1-1-2016 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం (డీఏ) చెల్లించవలసి ఉన్న అదనపు వాయిదా, మరియు పింఛన్ దారులకు చెల్లించవలసి ఉన్న కరవు సాయం (డీఆర్) ల విడుదల ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఇది ప్రస్తుత రేటు అయిన మూల వేతనం / పింఛన్ లలోని 119 శాతాని కన్నా 6 శాతం అధిక మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని తగిన పరిహారం ఇవ్వాలని ఇలా చేశారు.

ఇది దాదాపు 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు, 58 లక్షల మంది పింఛన్ దారులకు ప్రయోజనం కలిగించే చర్య కానుంది.

ఈ పెరుగుదల 6వ కేంద్రీయ వేతన సంఘం (సి పి సి) సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఒక ఫార్ములా కు అనుగుణంగా ఉంది. కరవు భత్యం, కరవు సహాయం ఈ రెండింటి కారణంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో (2016 జనవరి మొదలుకొని 2017 ఫిబ్రవరి వరకు మొత్తం 14 నెలల పాటు) ఖజానా పై పడే సంయుక్త భారం ఏడాదికి యథాక్రమంగా రమారమి రూ. 6,796.50 కోట్లు, రూ. 7929.24 కోట్లుగా ఉండబోతోంది.