పిఎంఇండియా
వ్యవసాయ రంగంలో సహకరించుకోవడం కోసం భారతదేశం, లిథువానియా ల మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు) పై సంతకాలు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీఅధ్యక్షత వహించారు.
తోటల పెంపకం, పంట కోతల అనంతర నిర్వహణ, సేంద్రియ వ్యవసాయం, శీతల గిడ్డంగుల అభివృద్ధి, అగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమ, పశు పోషణ, పాడి పరిశ్రమ, ఇంకా ఆక్వా కల్చర్ లు సహా వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పలు రంగాలలో సహకారానికి తాజా ఎమ్ ఒ యు వీలు కల్పిస్తుంది. తాజా ఎమ్ ఒ యు లక్ష్యాలను సాధించడానికి రెండేళ్ళకు ఒక సారి ఓ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తారు.
రెండు దేశాల శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులను, జన్యు వనరులను పరస్సరం మార్పిడి చేసుకోవడంలోను, సామర్థ్యాల పెంపుదలలోను, పంట పొలాలలో దిగుబడిని పెంపొందించడం కోసం తగిన సేద్య పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలోను ఈ ఎమ్ ఒ యు తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.