Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెల్జియం, యు ఎస్ ఎ, సౌదీ అరేబియా లకు పయనమయ్యే ముందు ప్రధాన మంత్రి ప్రకటన


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బెల్జియం, యు ఎస్ ఎ, మరియు సౌదీ అరేబియా లకు పయనమయ్యే ముందు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం ఈ కింది విధంగా ఉంది.. :

“మార్చి 30వ తేదీన నేను బ్రసెల్స్ లో ఉంటాను. బెల్జియం ప్రధాని శ్రీ చార్ల్ స్ మిచేల్ ను కలుసుకొంటాను. ఇ.యు. నాయకత్వంతో పాటు 13వ ఇండియా- ఇయు సమిట్ లో పాలు పంచుకొంటాను.

బెల్జియం ప్రజల మన:స్థయిర్యాన్ని, స్ఫూర్తిని కొనియాడటానికి ఎన్ని మాటలైనా చాలవు. బ్రసెల్స్ లో జరిగిన భయంకర దాడుల అనంతరం ప్రియతములను కోల్పోయిన వారి దు:ఖాన్ని పంచుకోవడానికి మనం వారితో భుజం భుజం కలిపి నిలబడ్డాం.

బెల్జియమ్ తో మన సంబంధాలు లోతుగా వేళ్లూనుకొన్నటువంటివీ, కాల పరీక్ష‌కు అతీతంగా నిలచినవీనూ. ఇ.యు. కేసి చూస్తే.. భారతదేశపు రెండో అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా బెల్జియం ఉంది. బెల్జియం ప్రధానితో నా భేటీ లోని పరమార్థం ఇ.యు.లోని ఈ ముఖ్యమైన సభ్య దేశంతో వ్యాపారాన్ని, పెట్టుబడులను, ఉన్నత సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందింపచేసుకోవడం.

ప్రధాని శ్రీ చార్ల్ స్ మిచేల్ తో పాటు నేను ఇండియా-బెల్జియం ఎ ఆర్ ఐ ఇ ఎస్ (ఆర్యభట్ట రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఆబ్జర్వేషనల్ సైన్సెస్) టెలిస్కోప్ ను రిమోట్ ఉపకరణం సాయంతో ప్రారంభించబోతున్నాను.

భారతదేశానికి ద యూరోపియన్ యూనియన్ ఒక ముఖ్యమైన వ్యాపార భాగస్వామియే కాకుండా, అతి పెద్ద ఎగుమతుల గమ్య స్థానం కూడా. ఈ శిఖరాగ్ర సమావేశం విస్తృత శ్రేణి డొమైన్ లలో మన బహుముఖీన అనుబంధాన్ని ముందుకు తీసుకు వెళ్లగలిగేదే.

బ్రసెల్స్ లో నేను యూరపియన్ పార్లమెంట్ సభ్యుల (ఎమ్ ఇ పి ల)ను, ఇండాలజిస్టులను, బెల్జియమ్ కు చెందిన ముఖ్య కార్యనిర్వహణ అధికారుల (సి ఇ ఒ ల)ను, అలాగే బెల్జియం లోని ప్రవాస భారతీయులను కూడా కలుసుకోబోతున్నాను. అంతే కాకుండా, బెల్జియం లోని ద అసోసియేషన్ ఆఫ్ డైమండ్ ట్రేడర్స్ బోర్డు సభ్యులతో కూడా సంభాషించనున్నాను.

అదే రోజు సాయంత్రం, నేను ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించబోతున్నాను. భారతీయుల సమూహం తోను ముచ్చటించనున్నాను.

బెల్జియం పర్యటన తరువాత, 4వ న్యూక్లియర్ సెక్యూరిటీ సమిట్ లో పాల్గొనేందుకు నేను మార్చి నెల 31వ తేదీన వాషింగ్ టన్ డి సి కి వెళతాను. అనేక దేశాలు, ప్రపంచ సంస్థలు ఆ సమిట్ లో ప్రతినిధిత్వం వహించనున్నాయి.

న్యూక్లియర్ టెర్రరిజం వల్ల న్యూక్లియర్ సెక్యూరిటీకి బెదిరింపు ఎదురవుతోంది. శిఖరాగ్ర సమావేశం ఈ అతి ముఖ్య సమస్యను గురించి చర్చించనుంది. ప్రపంచంలోని న్యూక్లియర్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ను పటిష్టపరచగల పద్ధతులేమేమిటనే చర్చను నాయకులు చేపట్టనున్నారు. ప్రత్యేకించి న్యూక్లియర్ మెటీరియల్ ను ప్రభుత్వేతర వర్గాలు దక్కించుకోకుండా ఉండాలంటే ఏం చేయాలనే అంశంపైన వారు తమ ఆలోచనలు పంచుకోనున్నారు.

శిఖరాగ్ర సమావేశం సందర్భంగా అనేక దేశాల నేతలతో నేను భేటీ కానున్నాను. ఆయా దేశాలతో ద్వైపాక్షిక‌ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడం మా భేటీలలో చర్చాంశంగా ఉండనున్నది.

అలాగే, ఎల్ ఐ జి ఒ ప్రాజెక్టు తో సాన్నిహిత్యం కలిగిన శాస్త్రవేత్త‌ల‌తో ఎప్పుడు మాట్లాడతానా అని నేను ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.

ఏప్రిల్ 2వ, 3వ తేదీలలో రాజు శ్రీ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ ఆహ్వానం మేరకు సౌదీ అరేబియాను సందర్శించబోతున్నాను.

సౌదీ అరేబియాతో భారతదేశ సంబంధాలు ప్రత్యేకమైనవి. మా భేటీలో.. ఇరు ప్రాంతాల ప్రజానీకానికి మధ్య అల్లుకున్న బలమైన బంధం కీలక పాత్ర పోషించనుంది. మన ద్వైపాక్షిక‌ సంబంధాలను మరింత లోతుకు విస్తరించుకొనే విషయమై సౌదీ నాయకత్వంతో కలసి పనిచేయాలని నేను అనుకుంటున్నాను. ప్రాంతీయ స్థితిగతులపైన చర్చ కూడా మా చర్చాంశాలలో ఒకటిగా ఉండబోతున్నది.

మన ఆర్థిక బంధాలు కూడా విస్తృతమవుతున్నాయి. భారతదేశ నాలుగో అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా సౌదీ అరేబియా ఉన్నది. అంతే కాక, భారతదేశానికి అతి పెద్ద ముడి చమురు సరఫరాదారు కూడా సౌదీ అరేబియా యే.

రాజు శ్రీ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ తో భేటీ కి తోడు, రాజ కుటుంబం లోని ఇతర ముఖ్య సభ్యుల తోనూ చర్చలు జరపాలని నేను ఆసక్తితో ఎదురుచూస్తున్నాను.

భారతదేశ అభివృద్ధి కార్యక్రమాల అమలులో సౌదీకి చెందిన ప్రధానమైన వ్యాపార సంస్థలు జట్టు కట్టాలని మేము ఆశిస్తున్నాము. ఇది రియాధ్ లో చేపట్టాలనుకున్న వ్యాపార ప్రధాన కార్యక్రమానికి సంబంధించి ముఖ్య లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది.

నేను రియాధ్ లో మస్ మాక్ ఫోర్ట్ రెస్ ను, ఎల్ & టి వర్కర్స్ నివాస సముదాయ ప్రాంగణాన్ని, మరియు టీ సీ ఎస్ ఆల్ విమెన్ ఐ టి & ఐ టి ఇ ఎస్ సెంటర్ ను సందర్శిస్తాను.”

***