పిఎంఇండియా

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న 17వ లోక్ సభ ఒకటో సమావేశం ప్రారంభం కావడాని కన్నా ముందు నూతన ఎంపీ లందరికీ ఆహ్వానం పలికారు.
సమావేశాలు ప్రారంభం అయ్యే కన్నా ముందు ప్రధాన మంత్రి విడుదల చేసిన ఒక ప్రకటన లో, “ఈ రోజు 2019 లోక్ సభ ఎన్నికలైన తరువాత ఒకటో సమావేశం ప్రారంభం అవుతున్నటువంటి రోజు. కొత్త గా ఎంపీ లుగా ఎన్నికైన వారందరి కి ఇదే నా స్వాగతం. వారి తో పాటే కొత్త ఆశలు, నూతన ఆకాంక్షలు, ఇంకా సేవ చేయాలన్న సరిక్రొత్త సంకల్పం కూడా వస్తున్నాయి” అని పేర్కొన్నారు.
పదిహేడో లోక్ సభ లో మహిళా పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరిగినందుకు ప్రధాన మంత్రి హర్షాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటు సజావు గా సాగినప్పుడే ప్రజలు పెట్టుకున్న ఆకాంక్షల ను అది నెరవేర్చ గలుగుతుంది అని ఆయన అన్నారు.
పార్లమెంట్ తరహా ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షాని కి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ఆయన చాటి చెప్పారు. ప్రతిపక్షం సభా కార్యకలాపాల లో పాలు పంచుని ఒక క్రియాశీలమైన భూమిక ను పోషిస్తుందన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు. విపక్షం లోక్ సభ లో తన కు ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ను గురించి ఆందోళన చెందనక్కర లేదు అని ప్రధాన మంత్రి అన్నారు.
“మనం పార్లమెంటు కు వచ్చామంటే, పక్షం మరియు విపక్షం అన్న సంగతి ని మరచి పోవాలి. మనం సమస్యల ను గురించి ‘నిష్పక్ష స్ఫూర్తి’తో ఆలోచించాలి, దేశ ప్రజల విశాల హితం కోసం పని చేయాలి” అని ప్రధాన మంత్రి చెప్పారు.
Speaking at the start of the Parliament Monsoon Session. https://t.co/ThbYyTuYCi
— Narendra Modi (@narendramodi) June 17, 2019