పిఎంఇండియా

భారతదేశాని కి మిత్రులు అయినటువంటి జపాన్ ప్రజానీకం మరియు ఇంత పెద్ద సంఖ్య లో ఇక్కడకు తరలివచ్చిన నా యొక్క భారతీయ మిత్రులారా, మీ అందరికీ అభివాదం.
నన్ను కోబే కు ఎందుకు తీసుకు వెళుతున్నారా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ కు నేను ఎన్ని సార్లని వచ్చాను. ఇంత మంది విచ్చేశారు. ‘మీరు ఎందుకని నన్ను అక్కడ కు తీసుకొని పోతున్నారు, ఎవరు వస్తారు?’ అని నేను అన్నాను. కానీ, మొదటి నుండి మీ లో ఉత్సాహం పొంగి పొరలుతుండటాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. ఈ ప్రేమ కు గాను నేను మీ అందరికీ ఎంతగానో కృతజ్ఞుడినై ఉంటాను.
సుమారు ఏడు నెలల అనంతరం మరొక్క మారు జపాన్ గడ్డ మీదకు వచ్చే భాగ్యం నాకు లభించింది. ఇక్కడ స్థిరపడినటువంటి భారతీయుల తో, మరి అలాగే జపాన్ కు చెందిన స్నేహితుల తో భేటీ అయ్యే అవకాశం నాకు క్రితం సారి సైతం దక్కింది. కిందటి సంవత్సరం లో నేను ఇక్కడ కు వచ్చినప్పుడు నా ప్రియ మిత్రుడు శ్రీ శింజో ఆబే యొక్క ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మరి ఆయన పట్ల మీరు అందరూ మీ యొక్క నమ్మకాన్ని మరొక్కమారు వ్యక్తం చేశారు. ఈ రోజు న మిమ్ముల ను నేను కలుసుకొన్నప్పుడు, ప్రపంచం లో కల్లా అతి పెద్దదైన ప్రజాస్వామ్యం అయినటువంటి భారతదేశం లో వారి ప్రధాన సేవకుడి పట్ల ప్రజలు ఇదివరకటి కన్నా మిన్న గా వారి నమ్మకాన్ని, అధికమైనటువంటి ప్రేమ ను వెల్లడి చేశారు.
ఈ ప్రజా తీర్పు లో మీ అందరి ప్రాతినిధ్యం ఉన్నదని నేను ఎరుగుదును. మీలో కొంత మంది భారతదేశాని కి వచ్చి, దాని కోసం అదే పని గా కృషి చేశారు. 40- 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో ఘనమైన ప్రయత్నాల ను మీరు చేస్తూ వచ్చారు. కొందరు ట్విటర్, ఫేస్ బుక్, Narendra Modi app తదితర సామాజిక మాధ్యమాల ద్వారా సాధ్యమైనంత వరకు అన్ని రకాల సమాచారాన్ని అందించజూశారు. మరికొందరు వారి పాత స్నేహితుల కు లేఖల ను వ్రాశారు. అంతేకాదు, వారి యొక్క పల్లెల కు ఇ-మెయిల్ ను కూడా పంపారు. ఒక విధం గా చూసినప్పుడు, మీరు ప్రజాస్వామ్య ఉత్సవాన్ని బలవత్తరం చేసి, దాని ని జీవం ఉట్టిపడేటట్టు చేశారు. దీనికి అంతటి కి మీకు నేను కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను.
మిత్రులారా,
130 కోట్ల మంది భారతీయులు మరింత దృఢమైన ప్రభుత్వాన్ని ఆవిష్కరించారు. మరి ఇదే ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం. మూడు దశాబ్దాల లో ఒకటో సారి సంపూర్ణ సంఖ్యాధిక్యాన్ని కలిగినటువంటి ఒక ప్రభుత్వం వరుస గా రెండో సారి కొలువుదీరింది. భారతదేశం వంటి ఒక విశాలమైన దేశం లో ఇటువంటి కార్యసాధన చిన్న విషయం ఏమీ కాదు. 1984వ సంవత్సరం లో ఒక పార్టీ వరుస గా ప్రభుత్వాన్ని ఏర్పరచినప్పటికీ, ఆ కాలం లోని పరిస్థితులు మీకు ఎరుకే. అందుకుగాను ఉన్నటువంటి కారణాలు కూడా మీకు తెలుసును. ప్రజలు ఎందుకని వోటు వేయడం కోసం బారులు తీరారో. ఆ యొక్క కారణాలు కూడా మీకు పరిచితమే. వాటి ని నేను మరొక్క మారు చెప్పవలసిన అవసరం లేదు. అయితే, 1971వ సంవత్సరం అనంతరం దేశం ప్రభుత్వాని కి మొట్టమొదటిసారి గా ఒక పాలనానుకూలమైనటువంటి జనాదేశాన్ని ఇచ్చిందన్నది యథార్థం.
మిత్రులారా,
భారతదేశం ఇచ్చిన ప్రచండమైన ప్రజా తీర్పు తో మీరు సంతోషం గా ఉన్నారా, లేక లేరా? ఇది ఎవరి విజయం ? మీరు ఇచ్చే సమాధానాన్ని నేను విన్నప్పుడే అది నాకు ఎక్కడ లేనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. ఇది సత్యం యొక్క గెలుపు. ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క విజయం. భారతదేశం యొక్క ఉద్దేశం ఏమిటన్నది మీరు జపాన్ లో ఉంటూ, గ్రహించ గలుగుతారు. మీ యొక్క ఆకాంక్షల కు మరియు వారి యొక్క ఆకాంక్షల కు మధ్య ఎటువంటి తేడా లేదు. ఈ కారణం గా మీ యొక్క సమాధానాన్ని మేము వినగలుగుతాము. మనం సరి అయిన దిశ గా పయనిస్తున్నామని ఎక్కడ లేని సంతృప్తి కలుగుతుంది.
ఒక్కొక్క సారి మనం స్టేడియమ్ లో ఒక క్రికెట్ మ్యాచ్ ను చూస్తున్నప్పుడు ఆటగాడు ఎలా ‘అవుట్’ అయ్యాడు అనే దానికి కారణాన్ని ఆ తరువాతనే గ్రహించగలము. అయితే, ఆ మ్యాచ్ ను ఇంటి లో టెలివిజన్ ఎదుట కూర్చొని ప్రత్యక్షం గా వీక్షిస్తున్న వారు, మరి అలాగే మైదానాని కి దూరం గా ఎక్కడో ఉన్న వారు ఆ ఆటగాడు ‘అవుట్’ అవడానికి ఉన్నటువంటి కారణాన్ని వెంటనే తెలుసుకో గలుగుతారు. తరంగ దైర్ఘ్యం తో వచ్చిన సమస్య ఇది అని వారికి తెలుస్తుంది. ఇదే మాదిరి గా మీరు భారతదేశాన్ని దూరాన ఉండి గమనిస్తున్నారు. నిజాన్ని ఒడిసి పట్టుకొనే గొప్ప సామర్ధ్యం మీకు ఉన్నది. కాబట్టి, మీరు ఇచ్చేటటువంటి ‘సత్యాని కి జయం, ప్రజాస్వామ్యాని కి దక్కిన విజయం మరియు భారతీయుల విజయం’ అనే సమాధానాలు నాకు అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటివి అవుతున్నాయి. ఇది నాలో స్ఫూర్తి ని నింపుతుంది. మరి నాకు ఒక కొత్త శక్తి ని కూడా ఇస్తుంది. దీనికి అంతటి కి కూడాను మీ అందరి కి నేను కృతజ్ఞుడినై ఉంటాను.
ఈ గెలుపు యొక్క కారణాల లో ప్రజాస్వామ్య విలువల కు సమర్పణ భావాన్ని కలిగి ఉంటూ ప్రజల ఆశల పట్ల, మరియు వారి ఆకాంక్షల పట్ల నమ్మకం తో ఉండటం ఒక కారణం. మాడ్చివేసేటటువంటి 40-45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లో 61 కోట్ల మంది వోటర్లు ఇళ్ల వెలుపల కు వచ్చి, దూర ప్రాంతాల లో గల పోలింగ్ కేంద్రం వద్ద కు వెళ్ళి, వారి వోట్ల ను వేశారు. వోటర్ల సంఖ్య చైనా మినహా మరే దేశ జనాభా కన్నా ఎక్కువ గా ఉంది. భారతదేశం లో ప్రజాస్వామ్యం ఎంతో పెద్దది. ఈ దేశం లో 10 లక్షల పోలింగ్ కేంద్రాలు, 40 లక్షల కన్నా ఎక్కువ సంఖ్య లో ఇవిఎమ్ యంత్రాలు ఉన్నాయి. 600 లకు పైగా రాజకీయ పక్షాలు, 8000 వేల మంది కి పైగా అభ్యర్ధులు ఎన్నికల లో పాలు పంచుకొన్నారు. ఇవి అంత పెద్ద ప్రజాస్వామ్యపు పండుగ ను ప్రతిబింబించాయి. మానవ జాతి చరిత్ర లో ఇంత కన్నా ఘనంగా జరిగినటువంటి ప్రజాస్వామ్య పరమైన ఎన్నికలు అంటూ వేరే లేవు. మరి ఈ కారణం గా భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వించాలి.
ఈ రికార్డు ను బద్దలు కొట్టడం లేదా భవిష్యత్తు లో మరింత మెరుగైన రికార్డు ను సైతం సృష్టించడం అనేది భారతదేశం చేతుల లోనే ఉంటుంది. ఒక రకం గా భారతదేశాని కి కాపీరైట్ ఉంది. భారతదేశం లోని పౌరులు గా మనం అంతా, మరి అలాగే భారతదేశం యొక్క హితైషులు కూడాను ఈ విషయం లో గర్వపడుతున్నారు. ఇది యావత్తు ప్రపంచాని కి ప్రేరణ ను అందిస్తుంది. ప్రజాస్వామ్యం పట్ల భారతదేశం లోని సామాన్య ప్రజానీకం కనబరచే విధేయత అచంచలమైందని మరొక్క సారి రుజువైంది. మన ప్రజాస్వామ్య సంస్థలు మరియు మన ప్రజాస్వామిక ప్రణాళిక లు ప్రపంచం లో మార్గదర్శక స్థానం లో ఉన్నాయి.
మిత్రులారా,
భారతదేశం యొక్క ఈ బలం 21వ శతాబ్దపు ప్రపంచాని కి కొత్త ఆశ ను రేకెత్తిస్తోంది. ఈ ఎన్నికలు మరియు వాటి తాలూకు ప్రభావం ఒక్క భారతదేశాని కే పరిమితం కాదు; ఇది ప్రపంచం లోని ప్రజాస్వామ్య మనస్సు ల కు ఒక ప్రేరణాత్మక ఘటన గా నిలుస్తోంది. ‘న్యూ ఇండియా’ యొక్క ఊహల ను మరియు ఆకాంక్షల ను నెరవేర్చడం కోసం ఈ ప్రజా తీర్పు ను ఇవ్వడమైంది. మరి ఈ తీర్పు ప్రపంచం తో మన సంబంధాని కి ఒక నూతనమైన జవసత్వాల ను కూడా అందించనుంది. ప్రపంచం తనంతట తానే భారతదేశం పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటుంది. వారు భారతదేశం తో మాట్లాడినప్పుడల్లా, వారు ఒక ఆలోచన చేస్తారు.. ‘అవును, ఈ ప్రభుత్వాని కి ప్రజల మద్దతు ఉన్నది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణ సంఖ్యాధిక్యం తో ఎన్నుకొన్నారు’ అని. ఈ విధం గా ఏమి నిర్ణయించవలసినప్పటి కీ వారు దాని ని ముందుకు తీసుకు పోతారు.
అంతర్జాతీయ సంబంధాల లో పూర్తి ఆధిక్యం తో కూడిన ఒక ప్రభుత్వం అనేది అత్యంత అవసరం అయినటువంటిది. ఏమైనా, ఒక ఘనమైన ప్రజా తీర్పు అనేది ప్రభుత్వాన్ని మరింత బలపరచడమే కాక నమ్మకాన్ని మరియు విశ్వాసాన్ని కూడా ఇనుమడింప చేస్తుంది.
ప్రజలు ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ కు ‘సబ్‌కా విశ్వాస్’ అనే అమృతాన్ని కలిపారు. ఈ మంత్రం తోనే మేము సాగి పోతున్నాము. ఇది భారతదేశం పట్ల ప్రపంచం యొక్క నమ్మకాన్ని బలోపేతం చేయడం మాత్రమే కాకుండా ప్రపంచాని కి మరొక్కమారు భరోసా ను కూడా అందిస్తుంది. ఈ భావన నాకు గ్రహింపు లోకి వస్తోంది.
ప్రపంచం తో భారతదేశాని కి ఉన్న సంబంధం లో జపాన్ కు ఒక ప్రముఖమైన స్థానం ఉన్నది. ఈ సంబంధాలు యుగాల క్రితం నాటివి. వీటి యొక్క మూలం లో ఆత్మీయత ఉంది, సద్భావన ఉంది, ఒక దేశపు నాగరకత మరియు సంస్కృతి ల పట్ల మరియొక దేశాని కి సమ్మానం ఉంది. ఈ సంబంధాల లో ఒక లంకె మహాత్మ గాంధీ తో పెనవేసుకొన్నది. కాకతాళీయం గా ఈ సంవత్సరం మహాత్మ గాంధీ యొక్క 150వ జయంతి సంవత్సరం కూడాను. గాంధీ గారు చెప్పిన ఒక పాఠాన్ని మనం మన చిన్నతనం నాటినుండి వింటూ నేర్చుకొంటూ ఉన్నాం. అది ‘బురా మత్ దేఖో, బురా మత్ సునో, బురా మత్ కాహో’. దీనికి ‘‘చెడు చూడకు, చెడు వినకు, చెడు మాటలు మాట్లాడకు’’ అని అర్థం. ఈ ప్రబోధాన్ని గురించి భారతదేశం లో ప్రతి ఒక్క పిల్లవాడి కి ఎంతో బాగా తెలుసు. ఏమైనా, ఈ సందేశాన్ని ఇవ్వడం కోసం బాపు ఎంచుకొన్న మూడు కోతులు 17వ శతాబ్దం లో జపాన్ సృష్టించినవే అన్న వాస్తవం గురించి తెలుసుకొన్నవారు అతి తక్కువ మంది ఉంటారు. మిజారూ, కికాజారూ, ఇంకా ఇవాజారూ – జపాన్ యొక్క వారసత్వ ప్రతీకలు గా ఉన్నాయి. వాటి ని పూజ్య బాపు ఒక ఘనమైన సామాజిక సందేశాన్ని ఇవ్వడం కోసం ప్రతీకాత్మక రూపం లో ఎంచుకొని మరి దానిని ప్రచారం లోకి తీసుకువచ్చారు, వ్యాప్తి చేశారు.
మిత్రులారా,
మన ఆచార వ్యవహారాలు మరియు సంస్కారానికి సంబంధించిన ఈ లంకె బౌద్ధ ధర్మం జపాన్ లో ప్రవేశించే కన్నా మునుపటిదని చెబుతారు. వచ్చే నెల లో క్యోటో లో గియోన్ యొక్క తదుపరి ఉత్సవం జరుగనుంది. మరి ఈ గియోన్ ఉత్సవం లో ఉపయోగించే రథాన్ని భారతీయ పట్టు దారం తో అలంకరిస్తారు. ఈ సంప్రదాయం ఈనాటిది కాదు. లెక్కపెట్టలేనంత కాలం నుండే ఇది వ్యవహారం లో ఉంటూ వస్తోంది.
ఇదే విధం గా, శిచిఫుకుజిన్- అదృష్ట దేవతలు ఏడుగురి లో నలుగురికి భారతదేశం తో ప్రత్యక్ష సంబంధం ఉంది. సరస్వతి మాత ను జపాన్ లో బెంజాయిటిన్ గాను, లక్ష్మీ మాత ను కిచిజోటెన్ గాను, భగవాన్ కుబేరుడి ని విశామోన్ గాను, అలాగే మహాకాలుడి ని దాయికోకుతేన్ గాను గౌరవిస్తారు.
మిత్రులారా,
జుశోబోరి వస్త్ర ముద్రణ కళ భారతదేశాని కి మరియు జపాన్ కు మధ్య ఉన్న సంబంధాల కు ఏనాటి నుండో ఒక సేతువు గా ఉంటోంది. గుజరాత్ లోని జామ్ నగర్, ఇంకా కచ్ఛ్ ప్రాంతాల కు చెందిన బాంధ్ నీ కళ లో చేతి వృత్తి కళాకారులు కొన్ని తరాల నుండీ కూడా అదే రెసిస్ట్ టెక్నిక్ ను ఉపయోగిస్తూ వస్తున్నారు. అది ఇక్కడ జపాన్ లో కూడా యుగాల నాటి నుండీ ఉపయోగం లో ఉంది. అంటే జపాన్ లో ఆ పని ని చేసే వారికి అదే విధం గా జామ్ నగర్ లో, కచ్ఛ్ లో ఈ పని ని చేసే వారికి ఏమనిపిస్తుందంటే వారు జపాన్ లో ఉన్నట్లు గా అనుభూతి చెందుతారు. మరి ఎప్పుడైతే జపాన్ లో ఉండే వారు అక్కడకు వెళ్తే వారు గుజరాత్ లో ఉన్నట్లు భావించుకొంటారు. ఇక్కడ బోలెడంత పోలిక ఉంది. పైపెచ్చు, మన భాషల లో కూడా ఒకింత సామ్యం ఉంది. భారతదేశం లో పాటించే ‘ధ్యానాన్ని’ జపాన్ లో జెన్ గా పిలుచుకొంటారు. భారతదేశం లోని ‘సేవ’ ను జపనీయులు కూడా ‘సేవ’ గా గుర్తెరుగుతారు. సేవా పరమో ధర్మ: .. దీనికి అర్థం.. నిస్వార్ధ సేవ ను భారతదేశం లో పరమ ధర్మం గా పరిగణిస్తారు. అదే జపాన్ లోని సమాజం కూడా దీనిని మనసు పెట్టి ఆచరించింది.
మిత్రులారా,
స్వామి వివేకానంద, గురుదేవులు రబీంద్రనాథ్ టాగోర్, మహాత్మ గాంధీ, నేతాజీ సుభాస్ చంద్ర బోస్, జస్టిస్ రాధా వినోద్ పాల్ లు సహా అనేక మంది భారతీయులు జపాన్ తో మన సంబంధాన్ని బలవత్తర పరచారు. జపాన్ లోనూ భారతదేశమన్నా, భారతీయులన్నా ప్రేమ మరియు సమ్మానాల భావనలు ఉండేవి.
వీటి పర్యవసానం గానే భారతదేశాని కి, జపాన్ కు మధ్య సంబంధం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత పటిష్టం కావడం ఆరంభమైంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ గారు మరియు ప్రధాని యోశిరో మోరీ గారు కలసి మన సంబంధాలకు ప్రపంచ భాగస్వామ్య రూపాన్ని అందించారు.
2014వ సంవత్సరం లో నేను ప్రధాన మంత్రి ని అయిన తరువాత, నా స్నేహితుడు ప్రధాని శింజో ఆబే తో కలసి ఈ మిత్రత్వాన్ని బలోపేతం చేసే అవకాశాన్ని దక్కించుకొన్నాను. మేము మన దౌత్య సంబంధాల ను రాజధానులు మరియు రాయబారులు అనే పరిధులను మించి నేరు గా ప్రజల చెంత కు చేర్చాము. నేను ప్రధాని శ్రీ ఆబే తో పాటు టోక్యో లోనే కాక క్యోటో, ఒసాకా, కోబే, ఇంకా యమానాసీ లకు కూడా వెళ్ళాను. నేను కోబే ను ఎన్నో సార్లు సందర్శించాను. ఇక్కడ కు.. కోబే కు.. నేను ఎన్ని సార్లు వచ్చాననేది- నాలుగా, అయిదా, లేక మూడు సార్లా- అన్నది ఇదమిత్థం గా చెప్పలేను. నేను ఇక్కడ కు ప్రధాన మంత్రి కానప్పుడు కూడా వచ్చాను. గడచిన సంవత్సరం లో ప్రధాని నన్ను యమానాసీ లోని ఆయన ఇంటి లోకి ఆహ్వానించారు. ఈ ప్రత్యేకమైన చేష్ట భారతదేశం లో ప్రతి ఒక్కరి మనస్సు ను స్పర్శించింది. లేకపోతే, దౌత్య సంబంధాల లో ఆ కోవ కు చెందిన వ్యక్తిగత సౌమనస్యం కానరావడం అనేది ఎంతో అరుదు.
నేను నా మిత్రుడు ప్రధాని శ్రీ ఆబే ను ఢిల్లీ కే కాకుండా, అహమదాబాద్ కు మరియు వారాణసీ కి తోడ్కొని వెళ్ళేటటువంటి భాగ్యాని కి నోచుకొన్నాను. ప్రధాని శ్రీ ఆబే నా పార్లమెంటరీ నియోజకవర్గం మరియు ప్రపంచం లో అత్యంత పురాతనం అయినటువంటి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక నగరాల లో ఒకటైన కాశీ లో గంగా హారతి కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఆయన ఆ కార్యక్రమం లో భాగం పంచుకోవడంతో పాటు తాను పొందిన ఆధ్యాత్మిక అనుభవాన్ని తన ఉపన్యాసాల లో ప్రస్తావించే శ్రద్ధ ను సదా తీసుకొంటున్నారు. ఆయన దాని ని గురించి ఇప్పటి కీ మాట్లాడుతూనే ఉంటారు. ఈ సన్నివేశం తాలూకు దృశ్యాలు భారతదేశం లో ప్రతి ఒక్కరి మస్తిష్కం లో చెక్కు చెదరక నిలచివున్నాయి.
మిత్రులారా,
గడచిన ఆరు దశాబ్దాల కాలం లో భారతదేశ అభివృద్ధి యాత్ర లో జపాన్ ఒక ప్రముఖమైన పాత్ర ను పోషించింది. ఈ పాత్ర 21వ శతాబ్దపు ‘న్యూ ఇండియా’ లో మరింత దృఢతరం అవుతుంది. 1958వ సంవత్సరం లో భారతదేశాని కి, జపాన్ తన తొలి యెన్ రుణానికి ఆమోదం తెలిపింది. జపాన్ కు చెందిన కంపెనీ లు భారతదేశం లో కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. మరి అవి ఉత్తమమైన నాణ్యత కు మారు పేరు గా ఒక ప్రత్యేకత ను ఏర్పరచాయి.
కార్ల ను తయారు చేయడం కోసం మేము సమన్వయాన్ని నెలకొల్పుకొన్న ఒక కాలం అంటూ ఉండింది. ఈ రోజు న మనం బులిట్ ట్రైన్ ల తయారీ లో సహకరించుకొంటున్నాము. దేశం లో ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు జపాన్ యొక్క పెట్టుబడులు మరియు ప్రాజెక్టు లు ఉన్నాయి. అదే విధం గా భారతదేశం యొక్క ప్రతిభ మరియు శ్రమ శక్తి జపాన్ ఆర్థిక వ్యవస్థ ను పటిష్ట పరచేందుకు తోడ్పాటు ను అందిస్తూ ఉన్నాయి.
మిత్రులారా,
ఒక ‘న్యూ ఇండియా’ను నిర్మించడం లో మన సహకారం మరింత విశాలమైనటువంటి ప్రాతిపదిక కలిగి ఉంటుంది. మేము రానున్న అయిదు సంవత్సరాల లో భారతదేశాన్ని ఒక 5 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థ గా మలచే లక్ష్యం తో ముందుకు సాగుతున్నాము. సామాజిక రంగం ప్రాథమ్యం గా ఉన్నది. దీని కి తోడు మౌలిక సదుపాయాల కల్పన రంగం లో భారీ పెట్టుబడుల ను పెట్టడాని కి మేము పెద్దపీట ను వేస్తున్నాము.
మరీ ముఖ్యం గా డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యావత్తు ప్రపంచం లో భారతదేశాన్ని ఒక ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానం గా ముందు వరుస లో నిలబెడుతోంది. భారతదేశం లో డిజిటల్ అక్షరాస్యత ప్రస్తుతం శరవేగం గా విస్తరిస్తోంది. డిజిటల్ లావాదేవీ లు రికార్డు స్థాయి లో జరుగుతున్నాయి. నూతన ఆవిష్కరణల కు మరియు ఇంక్యుబేశన్ కు భారీ మౌలిక వసతుల ను సన్నద్ధం చేయడం జరుగుతోంది. ఒక నూతన పర్యావరణాన్ని ఆవిష్కరిస్తున్నాము. ఈ కృషి తో మేము భారతదేశాన్ని రాబోయే అయిదు సంవత్సరాల లో 50 వేల స్టార్ట్-అప్ ల తో కూడిన ఒక ఇకో సిస్టమ్ గా రూపొందించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నాము.
మిత్రులారా,
‘ఆకాశం ఒక హద్దు’ అనే మాట యథార్థమైన కాలం అంటూ ఒకటి ఉండేది. కానీ, ఆ పరిమితి ని అధిగమించి భారతదేశం అంతరిక్షాన్ని అన్వేషిస్తున్నది. భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజల జీవనాన్ని మరింత భద్రమైంది గాను, సులభమైనది గాను మలచడం కోసం తక్కువ ఖర్చు తో కూడినటువంటి మరియు ప్రభావశీలమైనటువంటి రోదసి సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని చేజిక్కించుకోవాలనేది మా లక్ష్యం గా ఉంది. ఈ విషయం లో మేము విజయాల తో ముందుకు సాగుతూ ఉన్నందుకు నాకు సంతోషం గా ఉంది.
ఇటీవల భారతదేశం ‘ఫణి’ గాలి వాన తాలూకు వివిధ సవాళ్ళ ను కనీస స్థాయి నష్టం తో ఎదుర్కోగలిగింది. ప్రభుత్వ యంత్రాంగం, మానవ వనరులు మరియు అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం.. ఈ మూడింటి ఉమ్మడి వినియోగం తో చేసిన ప్రయత్నాల ను ప్రపంచం ప్రశంసించింది. దీని ని భారతదేశం సాధించింది. ఒక పక్క దేశం ఎన్నికల తో తీరిక లేకుండా ఉంది; మరొక పక్క, ఈ కార్య భారాన్ని ఒక అద్భుతమైనటువంటి రీతి లో పూర్తి చేయడం జరిగింది. ఈ కృషి ని ప్రపంచం మెచ్చుకొంది. ఇది మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి అంశం. ఈ కారణం గానే కొన్ని నెలల్లో మేము మా యొక్క మూన్ మిశన్ ను ముందుకు తీసుకు పోవడం కోసం చంద్రయాన్-2 ను ఆరంభించబోతున్నాము. మేము 2022వ సంవత్సరానికల్లా మా యొక్క ఒకటో మానవ సహిత గగన్ యాన్ కు సన్నద్ధులం అయి ఉన్నాము. మరి, అక్కడ మువ్వన్నెల జెండా ను ఎగుర వేసేందుకు ఒక భారతీయుడి ని పంపించాలన్న స్వప్నం తో మేము కృషి చేస్తున్నాము.
మేము రోదసి లో మా యొక్క స్టేశన్ ను నెలకొల్పాల ని చెప్పి, అందుకు గల అవకాశాల ను పరిశీలిస్తున్నాం. ఈ రోజు న చేస్తున్న శ్రమ అంతా ఆకాంక్షల తో తొణికిసలాడుతున్న భారతదేశ ప్రజానీకం కోసం. ఈ నవీన మధ్య తరగతి లో ఆశలు మరియు ఆకాంక్షలు నిండి ఉన్నాయి. ఈ వర్గం శీఘ్ర ఫలితాల కోసం ఎదురు చూస్తోంది. మేము వారి కోసం కొత్త కొత్త పద్ధతుల లో అభివృద్ధి సాధన కై పరిశ్రమిస్తున్నాము.
మిత్రులారా,
భారతదేశాన్ని అనేక అవకాశాల కు ఒక ముఖ ద్వారం గా యావత్తు ప్రపంచం చూస్తున్న కాలం లో, జపాన్ తో మా కలయిక సైతం ఒక కొత్త శిఖర స్థాయి కి చేరుకోబోతోంది. నేను అనుకోవడం జపాన్ యొక్క కైజన్ తత్వ శాస్త్రం కూడా. ఇండో- జపాన్ సంబంధాల పురోగమనాని కి అన్వయాన్ని ఇస్తున్నది అని. నేను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో, నా ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది కి కైజన్ శిక్షణ ను ఇస్తూ వచ్చాను. ఇలా ఎందుకంటే, కైజన్ ప్రక్రియ అనేది ఎప్పటి కీ ఆగిపోనటువంటి ఒక ప్రక్రియ కాబట్టి. మన సంబంధాలు మరింత ఎత్తు కు ఎదుగుతూనే ఉంటాయి.
మిత్రులారా,
ప్రధాన మంత్రి హోదా లో నేను జపాన్ కు రావడం ఇది నాలుగో సారి. ప్రతి ఒక్క సందర్శన కాలం లో నేను జపాన్ లో భారతదేశం పట్ల ప్రీతి ని గమనించాను. ఒక దేశం యొక్క నాగరకత, మరియు విలువల పట్ల అతిశయాన్ని కలిగి ఉండటం, ప్రతిభ ను మరియు సాంకేతిక విజ్ఞానాన్ని ఒక దేశం యొక్క జాతి నిర్మాణం లో, సంప్రదాయాల లో ఒక భాగం గా మలచుకోవడం వంటి వివిధ అంశాల ను జపాన్ లో నేను ప్రత్యక్షం గా అనుభూతి చెందాను. ఈ అనుభవం నాకు ఒక్కరికే ఎదురైనటువంటిది కాదు.
వంద సంవత్సరాల క్రితం స్వామి వివేకానందుల వారు సైతం జపాన్ ను సందర్శించిన వేళ ఇక్కడి ప్రజల సమర్పణ భావాన్ని, నాగరకత ను, శ్రమ లో వారు పాటించే నైతికత ను చూసి ముచ్చట పడి, ప్రభావితులు అయ్యారు. అప్పట్లో స్వామి వివేకానందుల వారు భారతదేశం లోని ప్రతి ఒక్కరు జపాన్ కు వెళ్ళాలని కూడా చెప్పారు. అయితే, ఆ కాలం లో జనాభా తక్కువ గా ఉండేది. ఇప్పుడు ఇది సాధ్యం కాదు. ఎందుకంటే, దేశం లో ప్రస్తుతం 130 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఏమైనప్పటికీ, మీరంతా 130 కోట్ల మంది ప్రజల ప్రతినిధులు . మీరు అందరూ జపాన్ యొక్క శ్రమ సంస్కృతి ని, శ్రమ సంబంధిత నైతికత ను, ప్రతిభ ను, సంప్రదాయాన్ని, ఇంకా సాంకేతికత ను భారతదేశాని కి తీసుకు పోతూ ఉన్నారు. మరి అదే విధం గా భారతదేశం లోని అవే అంశాల ను గురించి ఇక్కడి ప్రజల కు మీరు వివరిస్తారు. ఇదే సేతువు మనకు కొత్త శక్తి ని ఇస్తుంది. ఇది ఒక నూతన వ్యవస్థ లోకి మారేందుకు ఎప్పటి కీ సహాయకారి అవుతుంది. సంబంధాల ను సజీవం గా ఉంచుతుంది. ఇవి కేవలం కత్రువులు కాదు. ఇవి ఒక హుషారైన వ్యవస్థ కు సూచికలు. మరి ఒక హుషారైన వ్యవస్థ అనేది ప్రజల అనుబంధం తోనే రూపుదిద్దుకొంటుంది.
చివర గా, నేను నా ఉపన్యాసం ముగించే ముందు, మీ అందరికీ.. జపాన్ యొక్క ప్రజలకు, భారతీయుల కు మరియు జపాన్ లోని సోదరీమణుల కు, ఇంకా సోదరుల కు నూతన రేవా శకారంభ వేళ నా యొక్క శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. ఈ శకం లో ప్రతి ఒక్కరి జీవనం సుందరం గా సాగిపోవాలని నేను అభిలషిస్తున్నాను. మీరు నేను జపాన్ కు, ప్రత్యేకించి కోబే కు విచ్చేసినపుడల్లా నాకు పలికిన సాదర స్వాగతానికి, నాకు ఇచ్చినటువంటి హృదయ పూర్వక ఆతిథ్యానికిగాను మీకు నేను మనసారా కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను.
జూన్ 21వ తేదీ న అంతర్జాతీయ యోగ దినం అన్న సంగతి, భారతదేశం లోను, విదేశాల లోను యోగా ను ప్రోత్సహిస్తూ, విస్తరింప జేసేందుకు కృషి చేస్తున్నటువంటి సంస్థల కు మరియు వ్యక్తుల కు భారత ప్రభుత్వం సమ్మాన పూర్వకం గా బహుమతుల ను ఇస్తుందన్న సంగతి బహుశా మీకు తెలిసే ఉంటుంది. ఈసారి భారత ప్రభుత్వం జపాన్ లో యోగా కోసం కృషి చేస్తున్న సంస్థ ను సత్కరించాల ని నిర్ణయించింది. ఇది గొప్ప గర్వకారకమైన అంశం. అంటే మనం ప్రతి ఒక్క కోణం లో ముడివడి ఉన్నామన్న మాట.
ఈ అతిశయ భావన తో, నేను మరొక్క మారు మీతో భేటీ అయ్యే అవకాశాన్ని మరియు మీ యొక్క ఆశీర్వాదాల ను అందుకొనే అవకాశాన్ని ఇచ్చినందుకు గాను మీకు హృదయ పూర్వకంగా కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.
Wonderful evening with the Indian community in Japan. Watch. https://t.co/Ha5FJ0TYsv
— Narendra Modi (@narendramodi) June 27, 2019
Wonderful evening with the Indian community in Japan. Watch. https://t.co/Ha5FJ0TYsv
— Narendra Modi (@narendramodi) June 27, 2019
Had a wonderful community programme in Kobe.
— Narendra Modi (@narendramodi) June 27, 2019
Interacting with the Indian diaspora is always special.
Here are some glimpses. pic.twitter.com/m2OHLwQjWT
Do you know what connects Mahatma Gandhi and Japan?
— Narendra Modi (@narendramodi) June 27, 2019
Find out in this video. pic.twitter.com/7tc4IcU6XM
Outcome of the 2019 Lok Sabha polls has caused immense happiness among the Indian diaspora.
— Narendra Modi (@narendramodi) June 27, 2019
At the community programme, I asked those who had gathered- the win in 2019 is whose win?
They promptly replied- it is a win for honesty.
Their answer was very pleasing. pic.twitter.com/nEQbTdikQI