Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పులుల పై అఖిల భారత అంచనా – 2018 యొక్క నాలుగో ఆవృత్తి తాలూకు ఫలితాల ను ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ‘పులుల అఖిల భార‌త అంచ‌నా – 2018’ యొక్క నాలుగో ఆవృత్తి తాలూకు ఫ‌లితాల‌ ను 2019వ సంవ‌త్స‌రం జులై 29వ తేదీ సోమవారం నాడు లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో ఆవిష్క‌రించ‌నున్నారు.

పులులు అంచ‌నా అభ్యాస ప్ర‌క్రియ కవరేజి, న‌మూనా యొక్క సాంద్రత మ‌రియు కామెరా ట్రాపింగ్ ల పరంగా చూస్తే ప్ర‌పంచం లోనే అతి పెద్ద‌దైనటువంటి వ‌న్య‌ప్రాణి స‌ర్వేక్ష‌ణ య‌త్నం గా భావించబడుతున్నది.

భార‌త‌దేశం పులుల అఖిల అంచ‌నా ను ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల‌ కు ఒక‌ సారి నిర్వ‌హిస్తూ వ‌స్తున్న‌ది. ఈ అంచ‌నా తాలూకు మూడు ఆవృత్తుల ను 2006వ, 2010వ మ‌రియు 2014వ సంవ‌త్స‌రాల‌ లో ఇప్ప‌టికే పూర్తి చేయ‌డ‌మైంది.

ప్ర‌భుత్వం తో పాటు, జాతీయ వ్యాఘ్ర సంర‌క్ష‌ణ ప్రాధిక‌ర‌ణ సంస్థ కూడా జ‌ల వాయు ప‌రివ‌ర్త‌న తాలూకు ప్ర‌తికూల ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డం కోసం పులుల ఆర్థిక మూల్యాంకనాన్ని చేపట్టాయి. ఈ తరహా యుక్తులు మరియు ప్రక్రియల ను చట్ట పరంగా అనివార్యమైనటువంటి పులుల సంర‌క్ష‌ణ ప్ర‌ణాళిక మాధ్యమం ద్వారా చేపట్టడం జరిగింది. తద్వారా ఈ ప్రక్రియ వ్య‌వ‌స్థాత్మ‌కం కావడాన్ని తప్పనిసరి గా ఆచరణలోకి తెచ్చేందుకు వీలు ఉంటుంది.

**