Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌మ్ము, క‌శ్మీర్ మ‌రియు ల‌ద్దాఖ్ ల‌కు చెందిన సాహ‌స‌వంతులైన, హుషారైన సోద‌రీమ‌ణులకు మ‌రియు సోద‌రుల కు న‌మ‌స్క‌రించిన ప్ర‌ధాన మంత్రి


జ‌మ్ము & క‌శ్మీర్ కు సంబంధించిన బిల్లు లు ఆమోదం పొందడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న స్వాగ‌తించారు. “ఇది మ‌న పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యం లో ఒక ప్రాముఖ్యం గల సంద‌ర్భం” అని ఆయ‌న పేర్కొన్నారు.

ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్ లో తన మనోభావాల ను వెల్ల‌డిస్తూ, “మనం అందరమూ ఉన్నతం గా ఆలోచించాలి; 130 కోట్ల మంది భార‌తీయుల ఆకాంక్ష‌ల ను మనం అందరమూ కలసి నెర‌వేర్చుదాం” అంటూ ఆశించారు.

“జ‌మ్ము, క‌శ్మీర్‌, ఇంకా ల‌ద్దాఖ్ ల లోని నా సోద‌రీమ‌ణుల కు మ‌రియు సోద‌రుల కు వారి సాహ‌సాని కి, ఇంకా హుషారు కు నేను ప్ర‌ణామం చేస్తున్నాను” అని ఆయ‌న అన్నారు.

ప్ర‌ధాన మంత్రి ఇంకా ఇలా అన్నారు.. “సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి భావోద్వేగం పేరిట బెద‌రించి లాక్కోవడాన్నే న‌మ్ముతూ వచ్చిన్న స్వార్ధ‌ప‌ర బృందాలు ఎన్నడూ ప్ర‌జ‌ల సాధికారిత ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించింది లేదు. జ‌మ్ము & క‌శ్మీర్ ప్ర‌స్తుతం వారి యొక్క సంకెళ్ల నుండి విడివడింది. ఒక న‌వోదయం, మెరుగైన రేపటి రోజు లు వేచి ఉన్నాయి”.

శ్రీ న‌రేంద్ర మోదీ “జ‌మ్ము, క‌శ్మీర్‌, ఇంకా ల‌ద్దాఖ్ ల కు చెందిన బిల్లు లు ఏకీక‌ర‌ణ కు మ‌రియు సాధికారిత కు పూచీ ప‌డతాయి. ఈ చ‌ర్య‌ లు యువ‌త ను ప్ర‌ధాన స్ర‌వంతి లోకి తీసుకొని వ‌స్తాయి; అలాగే వారి కి వారి యొక్క ప్ర‌తిభ ను, నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించేందుకు అసంఖ్యాక‌మైన‌టువంటి అవ‌కాశాల ను అందిస్తాయి. స్థానిక మౌలిక స‌దుపాయాలు చెప్పుకోద‌గ్గ రీతిలో మెరుగు ప‌డుతాయి” అని కూడా అన్నారు.

ల‌ద్దాఖ్ ప్ర‌జ‌ల కు ఆయ‌న ప్ర‌త్యేక అభినందనలు తెలిపారు. “ఒక కేంద్ర‌పాలిత ప్రాంతం గా ప్ర‌క‌టించాల‌న్న వారి యొక్క చిరకాల డిమాండు నెర‌వేర‌డం గొప్ప సంతోషాన్ని ఇచ్చే అంశం. ఈ నిర్ణ‌యం ఈ ప్రాంత స‌ర్వ‌తోముఖ స‌మృద్ధి కి ఊతాన్ని ఇవ్వ‌గ‌లుగుతుంది. అంతేకాదు, మెరుగైన అభివృద్ధియుత స‌దుపాయాలు ఏర్పడేటట్టు చూస్తుంది” అని ఆయ‌న అన్నారు.

“జ‌మ్ము, క‌శ్మీర్‌, ఇంకా ల‌ద్దాఖ్‌ ల‌కు చెందిన బిల్లు లు ఆమోదం పొంద‌డం భార‌త‌దేశ ఏక‌త కు పాటుప‌డ్డ మ‌హానుభావుడు శ్రీ స‌ర్ దార్ ప‌టేల్ కు, సుప‌రిచిత‌మైన అభిప్రాయాలు వ్య‌క్తం చేసిన‌ డాక్ట‌ర్ బాబాసాహ‌బ్ ఆంబేడ్క‌ర్ కు, భార‌తదేశం యొక్క ఏక‌త కు, స‌మ‌గ్ర‌త కు జీవితాన్ని స‌మ‌ర్ప‌ించిన డాక్ట‌ర్ ఎస్‌.పి. ముఖ‌ర్జీ కి స‌ముచిత‌ నివాళులు గా ఉన్నాయి” అని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

“పార్ల‌మెంట్ లో, రాజ‌కీయ ప‌క్షాలు స‌మ‌యోచితం గా ప్రతిస్పందించి, సిద్ధాంత‌ప‌ర‌మైన అభిప్రాయ భేదాల‌ ను అధిగ‌మించి, మరి మ‌న పార్ల‌మెంట‌రీ ప్ర‌జాస్వామ్యపు అతిశ‌యం ఇనుమ‌డింపచేసిన ఒక చ‌క్క‌ని చ‌ర్చ లో భాగం పంచుకున్నాయి. దీని కి గాను వివిధ రాజ‌కీయ ప‌క్షాల ను, వాటి నాయ‌కుల ను మ‌రియు ఎంపీ ల‌ందరి ని నేను అభినందిస్తున్నాను” అని ఆయ‌న అన్నారు.

ప్ర‌ధాన మంత్రి ట్విట‌ర్ లో వ్రాసిన ఒక ప్రత్యేక సందేశం లో “జ‌మ్ము, క‌శ్మీర్‌, ఇంకా ల‌ద్దాఖ్ ఎంపీ లు అభిప్రాయ భేదాల‌ ను అధిగ‌మించి, ఈ ప్రాంతాల భ‌విష్య‌త్తు ను గురించి వాదోపవాదాలు చేయడం తో పాటు ఈ ప్రాంతాల లో శాంతి కి, పురోగ‌తి కి మ‌రియు స‌మృద్ధి కి అనువైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డేటట్టు చేసినందుకు వారి ని చూసుకొని జ‌మ్ము, క‌శ్మీర్‌, ఇంకా ల‌ద్దాఖ్ ప్రజలు గ‌ర్వ‌ప‌డ‌తారు. రాజ్య స‌భ లో 125:61 మ‌రియు లోక్ స‌భ లో 370:70.. ఈ తుది సంఖ్య‌ ల ద్వారా విస్తృత‌మైనటువంటి మ‌ద్ధ‌తు ను స్ప‌ష్టం గా చూడవచ్చును” అని ఆయన వివ‌రించారు.

“భార‌త‌దేశ ఉప రాష్ట్రప‌తి మ‌రియు రాజ్య స‌భ చైర్‌మ‌న్‌ శ్రీ ఎం. వెంక‌య్య నాయుడు గారు, మ‌రి అలాగే స్పీక‌ర్ శ్రీ ఓం బిర్లా కోటా గారు లు ఉభ‌య స‌భల లో కార్య‌క‌లాపాల‌ ను ఒక శ్రేష్ఠమైన ప‌ద్ధ‌తి లో నిర్వ‌హించారు. దీనికి గాను వారు యావ‌త్తు దేశ ప్ర‌జ‌ల ప్ర‌శంస ల‌కు పాత్రులు” అని ఆయ‌న అన్నారు.

ఆయ‌న హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ ను ప్ర‌త్యేకం గా అభినందించారు. “జ‌మ్ము, క‌శ్మీర్‌, ఇంకా ల‌ద్దాఖ్ ప్ర‌జ‌ల కు ఒక ఉత్త‌మ‌మైన జీవ‌నం ల‌భించే దిశ గా మ‌న హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ శాహ్ గారు నిరంత‌రం శ్ర‌మించారు. ఆయన నిబ‌ద్ధ‌త‌, ఇంకా త‌త్ప‌ర‌త లు ఈ బిల్లుల ఆమోదం లో స్ప‌ష్టం గా క‌నిపిస్తున్నాయి. నేను అమిత్ భాయ్ ని ప్ర‌త్యేకం గా అభినందించ‌ద‌ల‌చుకొన్నాను’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.