Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళ ఆలయంలో అగ్ని ప్రమాదం: మృతుల సమీప బంధువులకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ను ప్రకటించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొల్లం లో బాణసంచా కాల్పుల సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వారి దగ్గరి చుట్టాలకు పి ఎమ్ ఎన్ ఆర్ ఎఫ్ నుంచి తలా రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా రిలీఫ్ ను ప్రకటించారు. దీంతో పాటే ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన ప్రకటించారు.

ప్రధాన మంత్రి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ రక్షణ, సహాయక చర్యలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారు. ప్రధాన మంత్రి త్వరలోనే కేరళకు ప్రయాణమై వెళ్లనున్నారు. తాను కేరళకు చేరుకొనే వేళకు ఎటువంటి ప్రొటోకాల్ లాంఛనాలను పాటించకూడదని, రక్షణ, సహాయక కార్యకలాపాల మీదే దృష్టి నిల‌పాల‌ని ఆయన ఆదేశించారు. ప్రధాన మంత్రి వెంట వైద్యుల బృందం కూడా కేరళకు తరలి వెళ్లనున్నారు. కాలిన గాయాల చికిత్సలో నిపుణులైన వైద్యులు సైతం ఈ బృందంలో ఉన్నారు.