Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మహావ్ లో ప్రధాన మంత్రి

మహావ్ లో ప్రధాన మంత్రి

మహావ్ లో ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారతదేవ రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా ఆయన జన్మస్థలమైన మహావ్ లో పుష్పాంజలి ఘటించారు.

మహావ్ లో జరిగిన ఒక బహిరంగ సభ లో ప్రధాన మంత్రి పాలు పంచుకొని, “గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్” ను ప్రారంభించారు.

ఈ శుభ దినాన తాను మహావ్ లో ఉండటం తన విశేషాధికారంగా భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. డాక్టర్ అంబేడ్కర్

సమాజంలో అన్యాయానికి విరుద్ధంగా పోరాడారంటూ ఆయన జ్ఞాప‌కం చేసుకొన్నారు. బాబాసాహెబ్ పోరాటం సమానత్వం కోసం, గౌరవం కోసం జరిపిన పోరాటం అని ప్రధాన మంత్రి అన్నారు.

2016 ఏప్రిల్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించే “గ్రామోదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్”లో భాగంగా పల్లెలలో అభివృద్ధి ప‌నుల‌పై శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంవత్సరపు కేంద్ర బడ్జెటు ను వ్యవసాయదారులకు, గ్రామాలకు అంకితం చేసినట్లు ఆయన చెప్పారు. గ్రామాల వికాసంపైన దృష్టి సారించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సి వుందని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, విద్యుత్తు సౌకర్యానికి దూరంగా నిలచిన 18,000 పల్లెలకు 1,000 రోజుల తుది గడువు లోపల విద్యుత్తు సరఫరాను సమకూర్చడం జరుగుతోందన్నారు. ఈ లక్ష్యం దిశగా పయనించడంలోని పురోగతిని GARV App ద్వారా ప్రజలు పరిశీలించవచ్చని ఆయన తెలిపారు. గ్రామాలు డిజిటల్ అనుసంధానం అత్యవసరం అని ఆయన అన్నారు.

వ్యవసాయదారుల ఆదాయాలను రెట్టింపు చేసే ధ్యేయం గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. పల్లెలలోనివసించే ప్రజల కొనుగోలు శక్తి పెరగాల్సివుందని, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఇది శక్తిమంతం చేయగలదని ఆయన చెప్పారు. పంచాయతీ రాజ్ వ్యవస్థలను బలోపేతంగాను, మరింత క్రియాశీలంగాను మలచాల్సివున్నదని ప్రధాన మంత్రి అన్నారు.