Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఇ-ఎన్ఎఎమ్.. నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ప్రయోగాత్మక ప్రారంభ వేళ వ్యవసాయదారులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు e-NAM.. ద ఇ-ట్రేడింగ్ ప్లాట్ ఫార్మ్ ఫర్ ద నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ప్రయోగాత్మక ప్రారంభ సందర్భంలో వ్యవసాయదారుల సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

8 రాష్ట్రాల‌ నుంచి 21 మండీ లు ఈ రోజు e-NAM లో చేరాయి.

ఈ కార్యక్రమం పారదర్శకత్వాన్ని తీసుకు రాగలదని, ఇది వ్యవసాయదారులకు ఎంతో ప్రయోజనకరమవుతుందని ప్రధాన మంత్రి అన్నారు.

వ్యవసాయిక సమూహానికి ఇది ఒక మేలు మలుపు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఏకమొత్తంగా చూడాలని, అలాగయితేనే రైతుకు గరిష్ట ప్రయోజనాన్ని అందించగలమని ఆయన అన్నారు.

వ్యావసాయిక ఆదాయాలను పెంపొందించేందుకు తీసుకున్న వివిధ కార్యక్రమాలను గురించి రైతులకు ప్రధాన మంత్రి వివరించారు. అంతే కాక, వ్యావసాయిక ఆదాయాలను పెంచేందుకు ఇంకా ఏమేం చేయవలసి ఉన్నదీ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

***