Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రజలతో మమేకం కండి; ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాన మంత్రి ఉద్బోధ

ప్రజలతో మమేకం కండి; ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాన మంత్రి ఉద్బోధ

ప్రజలతో మమేకం కండి; ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాన మంత్రి ఉద్బోధ


ప్రభుత్వ ఉద్యోగులు తమ తమ సంస్థల లోను, విభాగాల లోను ”మార్పు నకు ప్రతినిధులు” కావాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉద్బోధించారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 21వ శతాబ్దంలో ప్రభుత్వ ఉద్యోగులు వారి పాత్రను పునర్ నిర్వచించుకోవలసిన అవసరం ఉందన్నారు. నియంత్రణకు, క్రమబద్ధీకరణకు, నిర్వహణ సామర్థ్యాలకు మించి వారు ముందడుగు వేయాలని, తమను తాము పరివర్తనకు ప్రతినిధులుగా భావించాలని ప్రధాన మంత్రి సూచించారు.

ప్రభుత్వ ఉద్యోగులు జట్లను తయారు చేసుకోవాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. తాను చెప్తున్న ”పరివర్తన కోసం సంస్కరణ” (Reform to Transform) అనే మంత్రాన్ని సివిల్ సర్వెంట్ లు ”పనితీరును ప్రదర్శించడానికి సంస్కరించుకొని, పరివర్తన తేవడం” (Reform to Perform to Transform) గా గ్రహించాలి అని ఆయన పేర్కొన్నారు. సివిల్ సర్వెంట్ లు పనితీరును చాటుకోగలిగిన నాడు, వాస్తవ పరివర్తన స్పష్టంగా కనపడుతుందని ఆయన చెప్పారు.

‘Jan Bhagidari’ (ప్రజలు పాలు పంచుకోవడం) విజయానికి మూలకారణం అని, ఈ రోజు అవార్డులను గెల్చుకొన్న కార్యక్రమాలు ఇదే విషయాన్ని ప్రత్యేకంగా చాటిచెప్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. కాబట్టి సివిల్ సర్వెంట్ లు ప్రజలతో మమేకం అవ్వాలని, అది జరిగిన నాడు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో మరింత మెరుగ్గా అమలుకు నోచుకొంటాయన్నారు.

సివిల్ సర్వీసెస్ డే అనేది వెనుదిరిగి చూసుకొని, ఇంతవరకు సాగించిన ప్రయాణాన్ని కూలంకషంగా మదింపు చేసుకొని, సరికొత్త అంకిత భావంతో ముందుకు సాగిపోవడానికి కట్టుబడవలసిన సందర్భం అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.

విజయవంతంగా కార్యక్రమాలను ఆచరించిన అవార్డు విజేతలకు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. వారి విజయం ఇతర సివిల్ సర్వెంట్ లకు ప్రేరణగా నిలువగలదని ఆయన ఆకాంక్షించారు. ఈ సంవత్సరం అవార్డుల కోసం 74 విజయ గాథలను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ సంఖ్య ఇదివరకటి సంవత్సరాలతో పోల్చి చూసినప్పుడు ఎంతో ఎక్కువ అని చెప్పారు. అయినప్పటికీ, ఇది భారతదేశపు జిల్లాలలో కేవలం 10 శాతానికే ప్రాతినిధ్యం వహిస్తోందని ఆయన అన్నారు. అన్ని జిల్లాలు ఈ విషయంలో మరింత సానుకూల దృక్పథాన్ని అనుసరించాలి అని ఆయన కోరారు.

సివిల్ సర్వెంట్ లు ప్రయోగం చేయడానికి తగినంత సాహసాన్ని అలవర్చుకోవాలని, ప్రజాహితం కోరి లక్ష్యాలను సాధించడానికి కొత్త కొత్త పుంతలు తొక్కాలని ప్రధాన మంత్రి సలహా ఇచ్చారు.

పరిపాలన లోని కీలకమైన రంగాలను పరిశీలించడానికి తన చొరవ పై ఇటీవల కార్యదర్శుల సంఘాలు ఏర్పాటు అయిన సంగతిని ప్రధాన మంత్రి జ్ఞాపకానికి తెచ్చారు. ఈ కార్యభారం విషయమై అధికారులు వారంతట వారు కార్యాలయ పని వేళలు ముగిసిన తరువాత, ఇంకా సెలవు దినాలలోను కసరత్తు చేశారని ఆయన వివరించారు. ఈ బృందాలు సంప్రదాయపుటాలోచనలను జయప్రదంగా ఛేదించి, తాజా ఉపాయాలతోను, సూచనల తోను ముందుకు వచ్చారన్నారు. వారు ఈ పనికి 10,000 మ్యాన్ అవర్స్ వెచ్చించినట్లు ప్రధాన మంత్రి చెప్పుకొచ్చారు.

***