Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చంద్ర‌యాన్ 2 తుది అవ‌రోహ‌ణ ను వీక్షించ‌నున్న ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బెంగ‌ళూరు లోని ఐఎస్ఆర్ఒ (ఇస్రో) ప్ర‌ధాన కేంద్రాన్ని సంద‌ర్శించ‌నున్నారు. ప్ర‌ధాన మంత్రి 2019వ సంవ‌త్స‌రం, సెప్టెంబ‌ర్ 7వ తేదీన చంద్ర గ్ర‌హం యొక్క ద‌క్షిణ ధ్రువం పైన చంద్ర‌యాన్-2  అడుగిడ‌టాన్ని వీక్షించ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భం గా, భార‌త‌దేశం అంతటా 8వ త‌ర‌గ‌తి నుండి 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల కు నిర్వ‌హించిన‌టువంటి అంత‌రిక్ష క్విజ్ పోటీ విజేత‌ల తో ప్ర‌ధాన మంత్రి సంభాషిస్తారు.  

విజ్ఞ‌ాన శాస్త్రం అన్నా, దాని కార్యసాధనలన్నా మక్కువ ఎక్కువ గా కలిగినటువంటి ఒక ప్ర‌ధాన మంత్రి గా, శ్రీ మోదీ ఇస్రో కు జరిపే పర్యటన భారత‌దేశ అంత‌రిక్ష శాస్త్రవేత్త‌ల నైతిక స్థితి కి ఒక ఉత్తేజాన్ని ఇవ్వ‌డం తో పాటే యువత పరిశోధక భావ‌న ను మ‌రియు నూత‌న ఆవిష్కారణ స్ఫూర్తి ని అలవరచుకొనేందుకు ప్రేర‌ణ ను ఇచ్చేది కానుంది.

చంద్ర‌యాన్ 2 యాత్ర విష‌యం లో శ్రీ మోదీ త‌న ఆస‌క్తి ని వెలిబుచ్చుతూ,  దీని ని “మనస్సు లో భార‌తీయత, ఉత్సాహం లో భార‌తీయ‌త.  భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి ని ఉబ్బిత‌బ్బిబ్బు చేసేది ఏమిటి అంటే అది పూర్తి దేశ‌వాళీ ప‌రిజ్ఞానం తో కూడిన యాత్ర అన్న వాస్త‌వమే” అంటూ అభివ‌ర్ణించారు.

ఇస్రో ఒక ప్ర‌క‌ట‌న లో “ల్యాండ‌ర్ విక్ర‌మ్‌ 2019వ సంవ‌త్స‌రం, సెప్టెంబ‌ర్ 7వ తేదీ నాడు భార‌త ప్రామాణిక కాల‌మానం బట్టి చూస్తే 0100 గంట ల మొద‌లుకొని 0200 గంట‌ల నడుమ అవ‌రోహ‌ణ కు పూనుకోనుంది.  ఆ తదుపరి లాండ‌ర్ 0130 గంటల నుండి 0230 గంట‌ల మ‌ధ్య కాలం లో దిగుతుంది” అంటూ పేర్కొన్నది.

*******