Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేడియో మ‌రియు టెలివిజ‌న్ రంగం లో భార‌త‌దేశాని కి మరియు విదేశీ ప్ర‌సార సంస్థ‌ల కు మ‌ధ్య సంత‌కాలైన ఎంఒయు ల‌కు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం  


 

రేడియో మ‌రియు టెలివిజ‌న్ రంగం లో భార‌త‌దేశాని కి మరియు విదేశీ ప్ర‌సార సంస్థ‌ల కు మ‌ధ్య సంత‌కాలైన అవగాహనపూర్వక ఒప్పందాల కు ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న  జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఎక్స్‌-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది.

లాభాలు:
 
విదేశీ ప్ర‌సార సంస్థ‌ల తో ఒప్పందాలు కుదుర్చుకోవడం తో దిగువ న పేర్కొన్న రంగాల లో తోడ్పాటు అందనుంది: 

1.   సార్వజనిక ప్ర‌సార సంస్థ కు నూత‌న దార్శ‌నిక‌త ను అన్వేషించ‌డం లో;

2. తీవ్ర స్ప‌ర్ధ‌ తోను, నూత‌న సాంకేతిక‌త‌ లతోను ముడిపడినటువంటి డిమాండ్ ల‌ను తీర్చ‌డం కోసం నూత‌న వ్యూహాల ను అనుస‌రించ‌వలసిన సందర్భాల లో; ఇంకా

3. గ్లోబలైజేశన్ లోను. 

ప్ర‌ధాన ప్ర‌భావం:

స‌హ నిర్మాణం, ప‌ర‌స్ప‌ర ఆదాన ప్ర‌దానం మాధ్యమాల ద్వారా రూపొందించబడినటువంటి కార్య‌క్ర‌మాల ను ప్రసారం చేయ‌డం ద్వారా ఆకాశ‌వాణి శ్రోతల మ‌రియు దూర్‌ద‌ర్శ‌న్ ప్రేక్ష‌కులు న‌డుమ స‌మాన‌త్వ వాతావరణం ఏర్పడుతుంది.  సాంకేతిక ప‌రిజ్ఞానం, సిబ్బంది కి శిక్ష‌ణ ను, ప్రావీణ్యాన్ని ఇచ్చి పుచ్చుకోవ‌డం, ప్ర‌సార రంగం లో ఎదుర‌య్యే స‌వాళ్ళ ను త‌ట్టుకొని నిల‌బ‌డ‌డానికి సార్వజనిక ప్ర‌సార సంస్థ‌ల కు సహాయం లభించగలదు.

**