Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం, పాపువా న్యూ గినీ ల మధ్య ఆరోగ్యం, వైద్య శాస్త్ర రంగంలో సహకారం కోసం ఎమ్ ఒ యు కు మంత్రిమండలి ఆమోదం


భారతదేశం, పాపువా న్యూ గినీ ల మధ్య ఆరోగ్య సంరక్షణ, ఇంకా వైద్య శాస్త్ర రంగంలో సహకారం కోసం ఒక అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ ఒ యు) కుదుర్చుకొనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.

ఈ ద్వైపాక్షిక ఎమ్ ఒ యు సంయుక్త కార్యక్రమాల ద్వారా భారతదేశానికి చెందిన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు, పాపువా న్యూ గినీ కు చెందిన ఆరోగ్యం మరియు హెచ్ ఐ వి/ ఎ ఐ డి ఎస్ మంత్రిత్వ శాఖకు మధ్య ఆరోగ్య రంగంలో సహకారం పెంపొందేందుకు తోడ్పడనున్నది. అలాగే ఇది భారతదేశం, పాపువా న్యూ గినీ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను కూడా బలోపేతం చేయనున్నది.