Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎన్నిక‌ల లో గెలిచినందుకు కెన‌డా ప్ర‌ధాని శ్రీ జ‌స్టిన్ ట్రూడో ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


కెన‌డా ప్ర‌ధాని శ్రీ జ‌స్టిన్ ట్రూడో ఎన్నిక‌ల లో గెలిచినందుకు గాను ఆయ‌న కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న అభినందన లు తెలిపారు.

 ‘‘శ్రీ జ‌స్టిన్ ట్రూడో, ఇవే నా అభినంద‌న‌లు.  బ‌హుళ‌త్వం ప‌ట్ల, ప్ర‌జాస్వామ్యం పట్ల బ‌ల‌మైన వ‌చ‌న బ‌ద్ధ‌త తో, ఉమ్మ‌డి విలువ‌ల తో కెన‌డా  మ‌రియు భార‌త‌దేశం సంధానింపబ‌డి ఉన్నాయి.  ద్వైపాక్షిక సంబంధాల ను మ‌రింత గా బ‌లోపేతం చేసుకొనేందుకు క‌ల‌సి ప‌ని చేయాలని నిరీక్షిస్తున్నాను’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక సందేశం లో పేర్కొన్నారు.