Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రేపు ఉత్తరప్రదేశ్ లో పర్యటించనున్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రేపు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. బలియాలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజనను ఆయన ప్రారంభించనున్నారు. పేద కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మహిళలకు లబ్ధి చేకూర్చడానికిగాను ఉద్దేశించిన ఈ పథకం ద్వారా వారికి ఎల్పిజి (వంటగ్యాస్) కనెక్షన్లను అందజేస్తారు. ఈ పథకాన్నిరాబోయే మూడు సంవత్సరాలపాటు అమలు చేయనున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని తన నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించనున్నారు. లబ్ధి దారులకు ఎలక్ట్రానిక్ రిక్షాలను పంపిణీ చేస్తారు. వారణాసిలో నెలకొల్పిన జ్ఞాన ప్రవాహ్ కేంద్రాన్ని (సాంస్కృతిక అధ్యయనం, పరిశోధనా కేంద్రం) సందర్శిస్తారు. వారణాసిలోని ప్రముఖులతో భేటీ అవుతారు. ప్రసిద్ధి చెందిన అస్సిఘాట్ వద్ద పర్యావరణ హిత ఎలక్ట్రానిక్ బోట్ల నిర్వహణకు ఉద్దేశించిన పథకాన్ని ప్రారంభిస్తారు. ఎలక్ట్రానిక్ బోట్ల వల్ల పలుప్రయోజనాలున్నాయి. ఇవి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు కూడా తక్కువ కాబట్టి వీటిని గంగానదిలో తిప్పడం ద్వారా ఉపాధి పొందుతున్నవారు గతంతో పోలిస్తే అధిక ఆదాయాలు పొందడానికి అవకాశముంది.