Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి రంగం లో గినీ కి మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య సంత‌కాలైన ఎంఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి


 

న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి రంగం లో గినీ కి మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య కుదిరిన అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందాని(ఎంఒయు) కి   ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జ‌రిగి న కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.

ల‌క్ష్యం:

ఈ ఎంఒయు ల‌క్ష్యాలు దిగువ తెలిపిన విధం గా ఉన్నాయి:

i.  ఒక స‌హ‌కార పూర్వ‌క సంస్థాగ‌త సంబంధం నెల‌కొన‌డం కోసం ప్రాతిప‌దిక ను ఏర్పాటు చేయ‌డం.

ii.  రెండు పక్షాల మధ్య ప‌ర‌స్ప‌ర లాభం, స‌మాన‌త్వం మ‌రియు అన్యోన్య‌త ల ఆధారం గా న‌వీక‌ర‌ణ యోగ్య శ‌క్తి రంగం లో ద్వైపాక్షిక సహకారాన్ని మరియు సాంకేతిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌డం.

iii.  సహకరించుకొనే రంగాల లో సౌర శ‌క్తి, ప‌వ‌న శ‌క్తి, బ‌యో-ఎన‌ర్జీ,  చెత్త నుండి శ‌క్తి, చిన్న స్థాయి హైడ్రో స్టోరేజి మ‌రియు సామ‌ర్ధ్య నిర్మాణం వంటివి ఉన్నాయి.

ఉభ‌య దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేయ‌డం లో సైతం ఈ అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందం తోడ్పడుతుంది.

***