పిఎంఇండియా
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో దుర్భిక్షం, నీటి ఎద్దడి స్థితిని సమీక్షించేందుకు ఈ రోజు జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివ్ రాజ్ సింగ్ చౌహాన్ హాజరయ్యారు. భారత ప్రభుత్వ సీనియర్ అధికారులు, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి చర్చను మొదలుపెడుతూ, కరవు బారిన పడిన రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులతో తాను విడి విడిగా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయా రాష్ట్రాల నిర్దిష్ట అవసరాలను గురించి అంచనా వేయడం, తక్షణ ప్రాతిపదికన, ఇంకా దీర్ఘకాలిక ప్రాతిపదికన తీసుకోదగిన చర్యలపై శ్రద్ధ తీసుకోవడం ఈ సమావేశాల ఉద్దేశాలు అని ఆయన చెప్పారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్ డి ఆర్ ఎఫ్) నుండి రాష్ట్రానికి రూ.1,875.80 కోట్లు (స్టేట్ బ్యాలెన్సెస్ ను సర్దుబాటు చేసిన అనంతరం) విడుదల అయ్యాయి. ఇది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్ డి ఆర్ ఎఫ్) లో కేంద్రం వాటా గా 2015-16 సంవత్సరానికి గాను రాష్ట్రానికి విడుదల చేసిన రూ.657.75 కోట్లకు అదనం. ఎస్ డి ఆర్ ఎఫ్ తొలి కిస్తీ గా మరొక రూ.345.375 కోట్లను 2016-17 సంవత్సరానికి గాను విడుదల చేయడం జరిగింది.
ప్రధాన మంత్రి చొరవ తీసుకొని కరవు బారిన పడిన రాష్ట్రాలన్నిటితో సమావేశాలను నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. కరవు నుండి ఉపశమనం కలిగించేందుకు చేపట్టిన చర్యలను గురించి ప్రధాన మంత్రికి ఆయన వివరించారు. 61 లక్షల మంది వ్యవసాయదారులకు మొత్తం రూ.4,664 కోట్ల నిధులను ఉపశమన సహాయంగా అందజేసినట్లు వెల్లడించారు. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఇంత అధిక మొత్తంలో కరవు సహాయాన్ని ఇదివరకెన్నడు అందించలేదు.
గత పది సంవత్సరాలుగా తీసుకొన్న సన్నాహక చర్యల కారణంగా తమ రాష్ట్రం కరవును ఎదుర్కోవడానికి సాపేక్షంగా మంచి స్థితిలో ఉన్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. నీటి నిల్వ కోసం ఉద్దేశించిన నిర్మాణాలను చేపట్టడం వంటివి ఈ సన్నాహక చర్యలలో కలసివున్నాయన్నారు. వరుసగా రెండో ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోయినప్పటికీ, కేవలం 113 గ్రామాలకే నీళ్లను చేరవేయవలసివచ్చిందని ఆయన చెప్పారు. జూన్ నెలాఖరు దాకా వాన కురవకపోయినా, రమారమి 50,000 గ్రామాలలో ఇటువంటి గ్రామాలు సుమారు 400 కు పరిమితం అవుతాయన్నారు. ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ అమలుకు తమ రాష్ట్రం అగ్ర ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
అలాగే ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ అమలు కు చేపట్టిన సన్నాహాలను గురించి కూడా ముఖ్యమంత్రి సమావేశంలో చెప్పుకొచ్చారు.
ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సూక్ష్మ సేద్యం, ద్రవ రూప ఎరువుల వినియోగం, స్పేస్ టెక్నాలజీ వినియోగం, ఇంకా పొలాలకు అవసరమయ్యే నీటి కుంటలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం వంటి వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలను చర్చించారు.
నీటిని ఆదా చేయడం, నీటిని నిల్వ చేయడంపై అవగాహనను పెంపొందించే దిశగా అనుసరించవలసిన వ్యూహాలను గురించి, ఇందులో ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్, ఎన్ వై కె ఎస్, ఇంకా స్కౌట్స్ అండ్ గైడ్స్ వంటి యువజన సంస్థలకు ప్రమేయం కల్పించడం గురించి ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు, నర్మదా నది ఆయకట్టును పరిరక్షించేందుకు అదనంగా ఏయే చర్యలు చేపట్టవచ్చనేదానిపై సమావేశంలో చర్చించారు.
కేంద్రం, రాష్ట్రం కలసి పనిచేయాలనే తీర్మానంతో సమావేశం ముగిసింది.
My meeting with @ChouhanShivraj & his team of officials was a comprehensive one, in which we discussed ways to mitigate the drought.
— Narendra Modi (@narendramodi) May 10, 2016
CM @ChouhanShivraj briefed me on the several steps MP Govt. has taken for drought management not only now but for the last decade.
— Narendra Modi (@narendramodi) May 10, 2016
Happy to learn about priority MP Govt. is attaching to key schemes like Fasal Bima Yojana & Krishi Sinchai Yojana. This will help farmers.
— Narendra Modi (@narendramodi) May 10, 2016
Urged MP Govt to continue the focus on micro-irrigation, liquid fertilisers & building farm ponds. https://t.co/MyCg1sml06
— Narendra Modi (@narendramodi) May 10, 2016