పిఎంఇండియా

నా మంత్రివర్గ సహచరులు శ్రీ నరేంద్ర సింహ్ జీ తోమర్, డాక్టర్ హర్ష్ వర్ధన్ గారు, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ గారు మరియు ఈ యావత్తు ప్రచార ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకులు, శ్రీ కిరణ్ రిజిజు గారు, ఇక్కడ కు విచ్చేసిన ఉన్నతాధికారులు, మాననీయులు, క్రీడారంగ ప్రముఖులు మరియు విద్యార్ధి సోదరులు మరియు సోదరీమణులారా,
కొంత మంది అనుకోవచ్చు వారు పాఠశాల కు గాని, కళాశాల కు గాని వెళ్ళలేదు కదా, అటువంటప్పుడు మోదీ గారు తమను ‘విద్యార్ధులు’ అని ఎందుకు సంబోధించారు అని. మీ వయస్సు ఎంతయినా కావచ్చు, మీరు ఇక్కడకు వచ్చారు, అందువల్ల మీలోని విద్యార్ధి ఇంకా సజీవం గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను.
మీ అందరి కి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజునే మనం మేజర్ ధ్యాన్ చంద్ రూపం లో గొప్ప క్రీడాకారుడి ని దక్కించుకొన్నాము. ఆయన తన ఫిట్ నెస్, శక్తి సామర్ధ్యాల తో పాటు హాకీ కర్ర తో ప్రపంచాన్నే మంత్రముగ్ధుల ను చేశారు. ఈ రోజు న నేను మేజర్ ధ్యాన్ చంద్ గారి కి వందనాలను సమర్పిస్తున్నాను.
ఆరోగ్యం గా ఉండాలనే భావన కు దోహదంచేసే ముఖ్యమైన చర్య, ఫిట్ ఇండియా (యోగ్య భారత్) ఉద్యమాన్ని ప్రారంభించడం ద్వారా ఆరోగ్య భారత నిర్మాణం దిశ గా ముఖ్యమైన అడుగు ను వేసినటువంటి క్రీడల మంత్రిత్వ శాఖ ను, యువజన విభాగాన్ని నేను ఈ రోజు న అభినందిస్తున్నాను.
ఈ రోజు న సమర్పించిన ప్రదర్శన లో ప్రతిక్షణం దృఢత్వం గురించిన సందేశం తో నిండివుంది. మన సంప్రదాయాల ను ఉత్తమమైన రీతి లో ఆచరించడం ద్వారా మనం ఏ విధం గా దృఢం గా ఉండగలమో ఆ ప్రదర్శన చెబుతుంది. ఆ అంశాలన్నీ చాలా చక్క గా విడమరచి తెలియజెప్పడం జరిగింది. అందువల్ల నేను ప్రసంగించవలసిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ప్రదర్శన లో చెప్పిన అన్ని సంగతుల ను లేక కనీసం రెండిటి ని మన జీవితం లో భాగం గా చేసుకున్నా శారీరక దృఢత్వాన్ని గురించి నేను ప్రసంగించవలసిన అవసరం ఉండదని నా విశ్వాసం.
ఉత్తమ ప్రదర్శన రూపొందించి మరియు ఎంతో శ్రమించి దృఢత్వ భావన కు కొత్త రూపునిచ్చి ఊహాత్మకం గా ప్రదర్శించడానికి వీలు గా ఇంత శ్రేష్టమైన పనిని చేసిన ప్రతి ఒక్కరి ని నేను అభినందిస్తున్నాను. భవిష్యత్తు లో వృత్తి నైపుణ్యం తో ఈ ప్రదర్శన ను ఒక మంచి వీడియో గా సృష్టించాలని నా కోరిక. మరియు దాని ని పాఠశాల లు, కళాశాలల్లో చూపడం ద్వారా సామూహిక ఉద్యమాన్ని సృష్టించవచ్చు.
మిత్రులారా, ఇది ప్రపంచ రంగస్థలం పై త్రివర్ణ పతాక కీర్తి ని సమున్నత శిఖరాల కు చేర్చుతున్న యువ క్రీడాకారుల ను అభినందించవలసిన రోజు కూడా. బాడ్మింటన్, టెన్నిస్, అథ్లెటిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్ లేక ఇతర క్రీడ లు దేనిలో అయినా మన క్రీడాకారులు మన ఆశల కు, ఆకాంక్షల కు కొత్త రెక్కల ను తొడుగుతున్నారు. వారు పతకాల ను గెలవడం కేవలం వారి దృఢత్వం మరియు తపస్సు ల యొక్క ఫలితం కాదు; అది న్యూ ఇండియా ద్వారా వారి కి లభించిన కొత్త ఉత్సుకత మరియు కొత్త విశ్వాసం. భారతీయ క్రీడల కు మంచి వాతావరణాన్ని సృష్టించడానికి గత అయిదు సంవత్సరాల లో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించడం నాకు చాలా సంతోషం గా ఉంది.
క్రీడలకు శారీరక యోగ్యతకు ప్రత్యక్ష సంబంధం ఉంది. కానీ ఈ రోజు న ప్రారంభమైన ఫిట్ ఇండియా ఉద్యమం క్రీడల ను దాటిపోయి విస్తరించింది. యోగ్యత కేవలం ఒక పదం కాదు అది ఆరోగ్యాని కి మరియు సంపన్న జీవనాని కి అవసరమైన స్థితి. మన సంస్కృతి లో సర్వదా యోగ్యత ను గట్టి గా నొక్కి చెప్పడం జరిగింది. మంచి ఆరోగ్యం కోసం, రోగాల నుండి కోలుకున్న తరువాత వాటి నిరోధాని కి తీసుకోవలసిన చర్యల కు మనం ప్రాధాన్యాన్ని ఇచ్చాము. మన జీవితాల లో శరీర యోగ్యత ఒక సౌకర్యవంతమైన అంశం. అందుకే మన పూర్వీకులు మరియు సహచరులు
వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుశ్యం బలం సుఖం
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్ధసాధనం
అని తరచు గా చెప్పారు.
ఈ మాటల కు వ్యాయామం ద్వారా ఆరోగ్యం, దీర్ఘాయుస్సు, బలం మరియు సంతోషం కలుగుతాయి అని భావం.
ఆరోగ్యమే మహా భాగ్యం, ఆరోగ్యం గా ఉంటే అన్నిటి ని సాధించవచ్చును. అయితే కాలక్రమేణా నిర్వచనాలు మారుతున్నాయి. గతం లో మనకు చెప్పే వారు, ఆరోగ్యం తో అన్ని పనుల పే నెరవేర్చుకోవచ్చు అని. ఇప్పుడు స్వార్ధం తోనే అన్ని పనుల ను సాధించుకోవచ్చు అని వింటూ ఉంటాము. అందువల్ల ఇప్పుడు ఈ స్వార్ధాన్ని తిరిగి ఆరోగ్యం గా మార్చడానికి సమష్టి కృషి జరుపవలసిన అవసరం ఉంది.
శారీరిక దృఢత్వం ముఖ్యమైనది అనే విషయం మాకు కూడా తెలుసు. దానికి ఇప్పుడు అకస్మాత్తు గా ఉద్యమాన్ని ఆరంభించవలసిన అవసరం ఏమి వచ్చింది? అని కొంతమంది అనుకుంటూ ఉండవచ్చని నేను ఎరుగుదును. మిత్రులారా, ఆ అవసరం ఉంది.. బహుశా దాని అవసరం ఇప్పుడు చాలా ఎక్కువ గా ఉంది. తగిన దైహిక సామర్ధ్యం తో ఉండటం మన జీవన విధానం లో భాగంగా ఉంటూ వచ్చింది. అయితే కాలక్రమేణా మన సమాజం లో శారీరిక యోగ్యత పట్ల ఉదాసీనత పెరిగిందనేది కూడా వాస్తవం.
రోజులు మారాయి అని చెప్పేందుకు మీకు నేను ఒక ఉదాహరణ ను ఇస్తాను. కొన్ని దశాబ్దాల క్రితం మామూలు మనిషి రోజు కు 8-10 కిలోమీటర్లు నడవడమో, కొన్ని గంటల పాటు సైకిల్ తొక్కడమో లేక పరుగెత్తుకుంటూ వెళ్లి బస్సు ను పట్టుకోవడమో చేసే వారు. అంటే అప్పట్లో భౌతిక పరిశ్రమ జీవనం లో చాలా సులభంగా మిళితమై ఉండేది. ఆ తరువాత సాంకేతిక విజ్ఞానం రాక తో ఆధునిక సాధనాలు అందుబాటులోకి వచ్చాయి. మనిషి జీవనం లో నడక బాగా తగ్గిపోయింది. భౌతిక పరిశ్రమ కూడా అంతంత మాత్రమే. ఇక ఇప్పటి పరిస్థితి ఏమిటి? సాంకేతిక విజ్ఞానం వల్ల మనం కదలడమే బాగా తగ్గిపోయింది. ఈ రోజు ఎటువంటి పరిస్థితి కి వచ్చామంటే సాంకేతిక విజ్ఞానమే మీరు ఈ రోజు న చాలా తక్కువ గా నడిచారు. ఇంకా 5000 అడుగులు పూర్తి కాలేదు. ఈ రోజు 2000 అడుగులు కూడా పూర్తి కాలేదు అని సూచిస్తున్నది. మరో వైపు మనం మొబైల్ ఫోన్ లను చూస్తూ ఉంటాము. ఇక్కడ ఉన్న మీలో ఎంత మంది 5000 లేక 10000 అడుగులు పూర్తి అయ్యాయో లేదో అని తనిఖీ చేస్తూ ఉంటారు? అడుగుల లెక్క ను చూపే గడియారాన్ని పెట్టుకున్న వారు గాని లేక మొబైల్ ఫోన్ లో యాప్ గాని ఉన్న వారు చాలా మందే ఉంటారు. ఎన్ని అడుగులు వేశామో ప్రతి రోజూ పరిశీలించుకుంటూ ఉంటారు.
మీలో చాలా మంది చురుకైన వారు మరియు జాగ్రత్తపరులు. అయితే దేశం లో చాలా మంది వారి యొక్క దైనందిన జీవితం లో తీరిక లేని పనుల వల్ల వారి శారీరక యోగ్యత పైన అంతగా దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇంకా కొంత మంది చాలా ప్రత్యేక తరహా వ్యక్తులు. కొంత మంది కొన్ని చెప్పుకోవడం ఈ రోజుల లో నాగరకం అయిపోయింది. కొంత మంది మిత్రులు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని మామూలు కన్నా రెట్టింపు మోతాదు లో భోంచేసి మితాహారం (డైటింగ్) గురించి మాట్లాడుతూ ఉంటారు. నెల లో కనీసం పది రోజులు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని మితిమీరి తింటూ మితాహారాన్ని గురించి సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం మన అనుభవం లోకి వస్తుంది. ఎందుకంటే డైటింగ్ గురించి మాట్లాడం అంటే వారు ఉత్తేజితులై మాట్లాడుతారు. దానికి సంబంధించిన ఉపకరణాల ను అదేపని గా కొంటూ ఉంటారు. ఆ ఉపకరణాలు వారి వద్ద ఉంటే వారు ఫిట్ గా ఉన్నట్లే అని వారి భావన. వారి ఇళ్ళ లో పెద్ద జిమ్ కూడా ఉండటాన్ని మీరు చూసే ఉంటారు. ఫిట్ నెస్ కు సంబంధించిన ప్రతి ది వారి ఇంట్లో ఉంటుంది. జిమ్ ఉన్న గది లోకి వారు ఎప్పుడూ వెళ్లరు. అందువల్ల ఆ గది ని, పరికరాల ను శుభ్రం చేయడానికిగాను పని మనుషులను పెట్టవలసి వుంటుంది. కొన్ని రోజులు గడిచాక ఆ పరికరాల ను ఇంటి లో మూలన ఉన్న గది లోకి తరలిస్తారు. ఫిట్ నెస్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడం లో జనం నిపుణులు. కొద్ది రోజులయ్యాక వారు ఆ యాప్ వంక చూసిన పాపాన పోరు.
నేను గుజరాత్ రాష్ట్రం లో పుట్టాను. గుజరాతీ భాష లో జ్యోతీంద్ర భాయి దవే అని మంచి హాస్య రచయిత ఉండే వారు. ఆయన ఆసక్తికరమైన వ్యంగ్య రచన లు చేసే వారు. తన పైన వ్యంగ్య రచన లు చేసుకోవడం ఆయన కు అలవాటు. ఆయన తన శరీర ఆకృతి ని వర్ణిస్తూ ‘నేను ఎక్కడైనా, గోడ పక్కన గానీ నిల్చుంటే దూరం నుండి చూసే వారు ఓ హేంగర్ కు బట్టలు వేలాడదీశారని అనుకునే వారు. ఎందుకంటే ఆయన అంత బక్కపలుచ గా ఉండే వారు. అందువల్ల చిలక్కొయ్య కు బట్టలు వేలాడదీశారని అనుకునే వారు తప్ప అక్కడ ఒక మనిషి ఉన్నాడని నమ్మే వారు కాదు. అయన ఇంకా ఏం వ్రాసే వారంటే – నేను బయట కు వెళ్ళేటప్పుడు అన్ని జేబులలో రాళ్ళ ను నింపుకు వెళ్లేవాడి ని. ఆయన కోటు ధరించే వారు. అన్ని జేబుల్లో రాళ్ళు ఉండేవి. జేబులలో రాళ్ళు ఎందుకు అని ఎవరైనా ప్రశ్నిస్తే- ఏమో పెద్ద గా గాలి వస్తే నేను ఎగిరిపోతానేమో అని నాకు భయం అని ఆయన బదులిచ్చే వారు. ఆయన అటువంటి హాస్యమైన విషయాల ను వ్రాసే వారు. జేబుల్లో రాళ్ళు నింపుకొని తిరిగే బదులు ఏదైనా జిమ్ కు వెళ్ళండంటూ ఎవరో దవే కు సలహా ఇచ్చారట. అందుకు ఆయన ఎంతసేపు వ్యాయామం చేయాలి అని ఆ పెద్దమనిషి ని అడిగారట. మొదట జిమ్ కు వెళ్ళడం మొదలుపెట్టు. ఒంటి కి కొంచెం చెమట పట్టే దాకా వ్యాయామం చేయి అని ఆ పెద్దమనిషి బదులిచ్చారు. అందుకు సరే, రేపు వెళతాను అని దవే జవాబిచ్చారు. మరునాడు దవే జిమ్ కు వెళ్లి వచ్చాక – నేను జిమ్ కు వెళ్ళాను. వస్తాదులు మైదానం లో కుస్తీ పడుతున్నారు. వారి ని చూస్తుంటే నాకు చెమట లు పట్టాయి. నా వ్యాయామం అయిపోయింది అని అనుకున్నాను – అని అన్నారు. అది నిజం గా ఛలోక్తే. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని గురించి చెబుతోంది. అయితే కొన్ని విషయాలు ఇంకా ఎక్కువ ఆందోళన కలిగించేవి ఉన్నాయి.
భారతదేశం లో ఈనాడు మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనేక జీవనశైలి రుగ్మత లు పెరిగిపోతున్నాయి. అప్పుడప్పుడు మనం వింటుంటాము.. 12-15 మధ్య వయస్సు లో ఉన్న పిల్లల కు కూడా మధుమేహం సోకింది అని. మీ చుట్టుపక్కల గమనించండి.. ఎంతో మంది ఈ విధమైన వ్యాధుల తో బాధపడటాన్ని మీరు చూస్తారు. ఇంతకు ముందు 50-60 ఏళ్ళ మధ్య వయస్సు ఉన్న వారికే గుండెపోటు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటే వినే వారం. కానీ ఇప్పుడు కొంతమంది 30 ఏళ్ళు, 35 ఏళ్ళు లేక 40 ఏళ్ళ వారు కూడా గుండెపోటు వచ్చి పోయారని వింటుంటాము. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి. అయినప్పటికీ ఒక ఆశాకిరణం ఉంది. ఇన్ని రోగాల మధ్య ఆశాకిరణం ఉందని నేను చెప్పడం చూసి మీరు ఆశ్చర్యపడుతుండవచ్చు. స్వతహా గా నేను సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి ని. అందువల్ల ఇన్ని రుగ్మత ల మధ్య కూడా కొంత మంచి ని చూడగలుగుతున్నాను.
అస్తవ్యస్తం గా ఉన్న జీవనశైలి వల్ల జీవనశైలి రోగాలు వస్తున్నాయి. మన జీవనశైలి ని మార్చుకోవడం ద్వారా లోపాలను సవరించుకొని ఇప్పుడు మన జీవనశైలి ని చక్కదిద్దుకోవచ్చు. మన రోజువారీ దినచర్య లో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం, జీవనశైలి ని మార్చుకోవడం ద్వారా మనం ఎన్నో రోగాలు రాకుండా చూసుకోవచ్చు. ఈ మార్పు లు చేసుకోవలసిందిగా ప్రజల ను ప్రేరేపించడమే మౌలికంగా ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క ఉద్దేశ్యం. మరియు ఇది ప్రభుత్వ ఉద్యమం కాదు. ప్రభుత్వం ఒక ఉత్ప్రేరకం గా వ్యవహరించి ప్రతి కుటుంబాని కి ఈ సందేశం చేరేటట్టు చూస్తుంది. అయితే ఇది తమ కు సంబంధించిన కార్య ప్రణాళిక అని ప్రతి కుటుంబం అన్ని రకాలు గాను భావించాలి. ప్రతి కుటుంబం లో ఇది ఒక చర్చనీయాంశం కావాలి. ఒక వ్యాపారి తన నెలసరి ఆదాయం ఎంత అని లేక్క వేసుకున్నట్లే, విద్యా విషయాలను గురించి ఎక్కువ ఆసక్తి చూపే కుటుంబం వారి యొక్క కుమారుడి మార్కుల ను గురించి చర్చించుకున్నట్లే, ప్రతి కుటుంబం లో శారీరిక శ్రమ, భౌతిక వ్యాయామం మరియు శారీరక దృడత్వం వంటివి కూడా కుటుంబపు దైనందిన జీవితం లో చర్చనీయాంశాలు కావాలి.
మరి మిత్రులారా, ఇది ఒక్క భారతదేశం లోనే అవసరం అయినటువంటి ఫలానా విషయమేదో కాదు. ఈ మార్పు ఒక్క భారతదేశం లోనే చోటు చేసుకోవడం లేదు. ఇటువంటి ప్రచార ఉద్యమాల యొక్క ఆవశ్యకత ప్రస్తుతం ప్రపంచం అంతటా అనుభవం లోకి వస్తున్నది. అనేక దేశాలు ఫిట్ నెస్ ను గురించిన చైతన్యాన్ని పెంపొందించడం కోసం పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమాల ను నిర్వహిస్తున్నాయి. మన పొరుగునే ఉన్న చైనా లో- స్వాస్థ్య చైనా 2030ని ఉద్యమం తరహా లో అమలు పరుస్తున్నారు. అంటే 2030వ సంవత్సరానికల్లా చైనా లో ప్రతి ఒక్క పౌరుడు/పౌరురాలు శారీరికం గా పటుత్వం కలిగివుండాలి. మరి, దీని కోసం వారు ఒక్క పరిపూర్ణ కాల పట్టిక ను రూపొందించారు. ఇదే విధం గా ఆస్ట్రేలియా పౌరుల లో దేహ పరమైన కార్యకలాపాల ను పెంచడం కోసం, మరి అలాగే, ఆ దేశ పౌరుల లో నిష్క్రియా పరత్వాన్ని, బద్ధకాన్ని మార్చడం కోసం వారు 2030వ సంవత్సరం కల్లా 15 శాతం మంది పౌరుల ను బద్ధకం నుండి బయట పడవేసి, వారి ని శారీరికం గా పటుత్వాన్ని కలిగి ఉండేటట్లు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకొన్నారు. యుకె లో కూడా ఒక కార్యక్రమం ముమ్మరం గా అమలవుతోంది. ఈ కార్యక్రమం ద్వారా 2020వ సంవత్సరం కల్లా అయిదు లక్షల మంది క్రొత్త గా రోజువారీ అభ్యాసం అనే దైనందిన చర్య లో భాగం అవుతారు. 2021వ సంవత్సరం కల్లా అమెరికా ఒక వేయి నగరాల ను ఉచిత ఫిట్ నెస్ ప్రచారాని కి సంధానించే పని లో పడింది. జర్మనీ లో సైతం ‘ఫిట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాట్’ పేరు తో ఒక బృహత్తర ప్రచారోద్యమం కొనసాగుతోంది.
నేను కేవలం కొన్ని దేశాల ను గురించి ప్రస్తావించాను. పలు దేశాలు ఇప్పటికే దీని మీద పని చేయడం మొదలు పెట్టాయి. ఈ దేశాల లోని ప్రజలు ఫిట్నెస్ అవసరాన్ని అర్థం చేసుకొన్నారు. అయినప్పటికీ వారు అక్కడ ప్రత్యేక ప్రచార ఉద్యమాల ను ఆరంభించారు. ఆలోచించండి – ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకంటే, కొంతమంది ప్రజలు ఫిట్ గా తయారు కావడం ఒక్కటే కాకుండా సదరు దేశం కూడాను ఫిట్ గా ఉన్నందువల్ల లబ్ధి ని పొందుతుంది. ‘న్యూ ఇండియా’లో ప్రతి పౌరుడు ఫిట్ గా ఉండాలి. అతడు లేక ఆమె వారి యొక్క శక్తి ని వ్యాధుల చికిత్స లో కాకుండా స్వయం గా ముందంజ వేయడానికి, కుటుంబాన్ని ముందుకు తీసుకు పోవడానికి, అలాగే దేశాన్ని ముందుకు నడిపించడానికి ఉపయోగించాలి. ఈ దిశ గా మనం ముందుకు పోవలసివుంది.
మీరు జీవితం లో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొన్నప్పుడు, ఆ లక్ష్యాని కి తగినట్లుగా మారిపోతూ ఉండటాన్ని మన జీవితం మొదలుపెడుతుంది. జీవితం మారిపోతుంది. మన అలవాట్లు అదే విధం గా మారిపోతాయి. మన రోజువారీ పనులు కూడా అలా రూపుదిద్దుకొంటాయి. మనం ఉదయం పూట 8 గంటల కు నిద్ర లేచేందుకు అలవాటు పడ్డాం. కానీ, మీరు ఉదయం పూట 6 గంటల కాలాని కి ఒక విమానాన్ని అందుకోవలసి వస్తేనో లేదా 6 గంటల వేళకు ఒక రైలు ను పట్టుకోవలసి వస్తేనో, అటువంటప్పుడు మనం వెంటనే నిద్ర లేచి తయారై, బయలుదేరిపోతాము. ఒక విద్యార్థి 10వ తరగతి లేదా 12వ తరగతి బోర్డు పరీక్ష లో మార్కులు సాధించాలని లక్ష్యం గా పెట్టుకొంటే, అటువంటప్పుడు మీరు చూసే ఉంటారు, అతడు తన కు తాను గా బోలెడన్ని మార్పుల ను చేసుకోవడం మొదలుపెడతాడు. అతడు తన లక్ష్యాన్ని సాధించడం కోసం అతడి యొక్క బద్ధకాన్ని వదలించుకొని, మరిన్ని గంటలపాటు చదువుతూ ఉంటాడు. అతడి ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది. అతడు స్నేహితుల తో గడిపే సమయాన్ని మెల్లమెల్లగా తగ్గించి వేసుకొంటాడు. అతడు తన ఆహారపు అలవాట్ల లో కొద్ది గా మార్పుల ను చేసుకొంటాడు. అతడు టివి చూడటాన్ని ఆపి వేస్తాడు. అంటే అతడు తన మస్తిష్కం లో ఏర్పరచుకొన్న లక్ష్యం వల్ల తన జీవితాన్ని తదనుగుణం గా మలచుకోవడం మొదలుపెడతాడన్న మాట.
ఇదే విధం గా, ఎవరైనా సంపద ను సృష్టించడం అనే ఓ లక్ష్యాన్ని కనుక తన జీవితం లో నిర్దేశించుకున్నాడు అనుకోండి, అటువంటప్పుడు అతడి జీవితం సైతం మార్పుల కు లోనవుతుంది. అతడు ఇరవై నాలుగు గంటల ను ఈ లక్ష్యాన్ని సాధించడానికే వెచ్చిస్తాడు. ఇదే తరహా లో ఎప్పుడైనా ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవాలని, శారీరికం గా ఫిట్ గా ఉండాలని తలచుకొంటే, అలాగని అతడి మస్తిష్కం నిర్ణయించుకొందనుకోండి, అప్పుడు నేను ఎన్నటి కీ అలసటకు గురి కాను. నేను నడుస్తాను; పరుగు పెడతాను, ఎత్తయిన ప్రాంతాల ను ఎక్కేస్తాను, మరి ఇక ఆగి పోయే ప్రసక్తి ఉండదు. మీరు గమనించండి, క్రమక్రమం గా మీ యొక్క నియమిత జీవనం సైతం ఇదే ధోరణి లో సాగిపోవడం ఆరంభిస్తుంది. ఇంకా, ఆ వ్యక్తి శరీరాని కి చేటు కొని తెచ్చే పనుల నుండి దూరం గా ఉండిపోతాడు. దీనికి కారణం, అతని లోపల ఒక స్పృహ రేకెత్తుతుంది. అతడు అవగాహన కలిగిన వాడు గా మారుతాడు. అందువల్ల అతడు ఎన్నటికీ మందుల యొక్క పిడికిలి లోకి వెళ్ళడు. మందు అనేది ప్రశాంతి ని ఇచ్చే విషయమో లేక అభిరుచి కి సంకేతమో ఎన్నటికి కానే కావు.
స్వామి వివేకానందుల వారు కూడా అనే వారు.. జీవితం లో ఏదైనా ఉద్దేశ్యం ఉంటే మరి ఆ దిశ గా మీరు పూర్తి ఉద్వేగం తో కృషి చేయడం మొదలు పెడితే, అప్పుడు మంచి ఆరోగ్యం, సంతోషం, ఇంకా సమృద్ధి.. వాటి ఉప ఉత్పత్తులు గా మీ యొక్క జీవనం లోకి వచ్చి చేరుతాయి అని. మీ జీవితం యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం ఒక ఉద్వేగాన్ని మరియు ఒక సంకల్పాన్ని కలిగి ఉండటం అనేది అంతే సమానమైన ప్రాముఖ్యం కలిగినటువంటిది అవుతుంది. మనం ఉద్వేగం తో, ఒక లక్ష్యం తో కృషి చేసినప్పుడు ముందుకు పయనించవచ్చు. అప్పుడు విజయం తప్పక మన సొంతమవుతుంది. మరి మీరు సఫలత తాలూకు ఒక నానుడి ని కూడా వినే ఉంటారు. విజయాని కి ఎటువంటి నిచ్చెన గానీ లేదు. మీరు మెట్ల మీదుగా వెళ్ళవలసిందే అనే మాటల ను. మీరు మెట్ల ను ఎప్పుడు ఎక్కగలుగుతారంటే మీరు ఫిట్ గా, అందుకు అనువుగా ఉన్నప్పుడు మాత్రమే. లేదంటే లిఫ్ట్ గనుక పని చేయనప్పుడు మీరు అనుకొంటారు.. అయ్యా, ఈ రోజు న నేను వెళ్ళను. నాలుగో అంతస్తు వరకు మెట్ల ను ఎవరు ఎక్కుతారు? అని.
సాఫల్యాని కి మరియు ఫిట్ నెస్ కు మధ్య ఉన్నటువంటి సంబంధం ఒకదానికి మరొకటి పూరకం గా ఉంటుంది. ప్రస్తుతం ఏ రంగాన్ని అయినా తీసుకోండి. మీకు స్ఫూర్తి ని ఇచ్చే వారి ని చూడండి. వారి యొక్క విజయ గాథ లు.. వారు క్రీడలు, చలనచిత్రాలు, వ్యాపారం.. దేనిలో ఉన్నప్పటి కీ వారిలో చాలా మంది ఫిట్ గా ఉంటారు. ఇది కేవలం కాకతాళీయం కాదు, మీరు వారి జీవన శైలి ని గురించి చదివారంటే వారందరి కి ఒక సంగతి ఉమ్మడి గా ఉండటాన్ని మీరు గమనిస్తారు. సఫలత ను పొందిన వారి లో ఉమ్మడిగా కానవచ్చేది వారు ఫిట్ నెస్ పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధ. ఆదరణ కు నోచుకొన్న వైద్యుల లో పలువురు సైతం ఒక రోజు లో పది, పన్నెండు గంటల పాటు ఎందరో రోగుల కు ఆపరేశన్ లు చేసి ఉంటారు. నవ పారిశ్రామికుల లో పలువురు ఉదయం పూట ఒక నగరం లో ఒక సమావేశాన్ని నిర్వహించి, ఇతర సమావేశాల ను మరొక నగరం లో నిర్వహిస్తారు. అయినప్పటి కీ వారి ముఖాల లో ఒత్తిడి తాలూకు ఛాయలంటూ ఉండవు. వారు సమానమైన చురుకుదనం తో పని చేస్తారు. ఏ వృత్తి లో అయినప్పటి కీ మీరు గనుక మీ యొక్క పని లో నిపుణత ను తీసుకు రావాలి అనుకొంటే అటువంటప్పుడు శారీరికమైన ఫిట్నెస్ మరియు మానసికమైన ఫిట్నెస్ చాలా ముఖ్యం. అది బోర్డ్ రూము కానివ్వండి లేదా బాలీవుడ్ కానివ్వండి.. ఫిట్ గా ఉన్నవారు ఎవరయినప్పటికీ తార పథాన్ని అందుకోగలుగుతారు. శరీరం పటుత్వం తో ఉంది అంటే అటువంటప్పుడు మస్తిష్కం రాణిస్తుంది.
మిత్రులారా,
మనం ఫిట్ నెస్ పట్ల శ్రద్ధ వహించామంటే, ఫిట్ నెస్ పట్ల శ్రద్ధ వహించడం ద్వారా మనను మనం స్వస్థులు గా ఉంచుకొనేందుకు ప్రయత్నం చేస్తే, అటువంటప్పుడు అది మన దేహాన్ని కూడా అర్థం చేసుకొనేందుకు ఒక అవకాశాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఇది ఆశ్చర్యకరం గా ఉన్నప్పటి కి మనం మన శరీరాన్ని గురించి, మన బలాల ను గురించి మరియు మన బలహీనతల ను గురించి తెలుసుకొన్నది చాలా తక్కువ. కాబట్టి, మనం ఫిట్ నెస్ దిశ గా మన ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు మన శరీరాన్ని గురించి మరింత బాగా అర్థం చేసుకోవడాన్ని మనం ఆరంభిస్తాము. వారి శరీరం తాలూకు శక్తి ని తెలుసుకొన్న మరియు గుర్తించిన ఎంతో మంది ని నేను చూశాను. ఇది కూడా వారి విశ్వాసాన్ని పెంపొందించింది. తద్వారా వారు ఒక మెరుగైనటువంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడం లో సహాయకారి అయింది.
ప్రభుత్వం ఫిట్ ఇండియా ప్రచార ఉద్యమాన్ని ఆరంభించినప్పటి కీ, దానికి సారథ్యాన్ని వహించవలసింది మీరే. దేశ ప్రజలు ఈ ప్రచార ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి, సఫలత తాలూకు గొప్ప శిఖరాల ను అందుకొంటారు. నేను నా యొక్క స్వీయ అనుభవం నుండి చెప్పేది ఏమిటి అంటే దీనికి గాను ఎటువంటి పెట్టుబడి అక్కరలేదు కానీ దీని తాలూకు ప్రతిఫలాలు అపరిమితంగా ఉంటాయి అనేదే.
ఇక్కడ కు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కూడా విచ్చేశారు. వారికి నాదొక ప్రత్యేకమైన అభ్యర్థన. అది ఏమిటి అంటే ఈ ప్రచార ఉద్యమం దేశం లో ప్రతి ఒక్క పాఠశాల తో పాటు, ప్రతి ఒక్క గ్రామాని కి, ప్రతి ఒక్క పంచాయతీ కి చేరాలి అనేదే. ఈ ప్రచార ఉద్యమం కేవలం ఒక మంత్రిత్వ శాఖ ది గాని లేదా ఒక ప్రభుత్వానిది- అది కేంద్ర ప్రభుత్వం గాని లేదా రాష్ట్ర ప్రభుత్వం గాని – కాదు. పురపాలక సంఘానిది, పంచాయతీది, ఏ పార్టీ ది లేదా ఏ సిద్దాంతానిది గాని కాదు. ఫిట్ నెస్ విషయాని కి వస్తే ఎవరికీ ఎటువంటి సమస్య ఉండకూడదు. యావత్తు దేశం, ప్రతి ఒక్క కుటుంబం దీనితో మిళితం కావాలి. ఈ కార్యక్రమం లో మనం ఇప్పుడే చూశాము.. ఫిట్నెస్ కు తోడు పరాక్రమాని కి కూడాను ఎనలేని ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. అయితే, దురదృష్టవశాత్తు పరిమితమైనటువంటి మరియు సంకుచితమైనటువంటి ఆలోచన ల కారణం గా మనం ఇటువంటి ఒక వాహనాన్ని మన సంప్రదాయాల పట్టాల మీది నుండి తప్పించివేశాము. ఉదాహరణ కు 60-70 లేదా 80 సంవత్సరాల వయస్సు కలిగిన వారు పాఠశాల దశ లోనే ‘క’ అంటే కత్తి అని నేర్చుకొన్నారనుకోండి. ఆ తరువాత కొందరు మేధావులు ఒక వివాదాన్ని లేవనెత్తారు. సంకుచితమైన ఆలోచన ఫలితం గా వారు ఏమన్నారంటే మీరు గనుక బాలల కు ‘కత్తి’ని గురించి బోధిస్తే అది వారి లో ఒక హింసాత్మక ధోరణి కి దారితీస్తుంది అని. అందుకని ఏమిటి చేయడం? అప్పుడు కత్తి అనే పదాన్ని తీసివేసి, అక్కడ మరేదో పెట్టడం జరిగింది. ఇలాగ, మనం మన గొప్ప సంప్రదాయాల కు హాని చేస్తున్నాము. అదే కాలం లో శారీరిక బలానికి, ఫిట్ నెస్ కు కూడా ఎంతో చేటు ను కొని తెస్తున్నాము.
మరి నేను ఒక పరివారం తాలూకు సఫలత ప్రమాణం గా ఫిట్ నెస్ ను పరిగణించాలని, అలాగే ఫిట్ నెస్ ను ఒక పండుగ గా, జీవితం లో ఒక భాగం గా ఎంచి తీరాలని చెప్పదలుచాను. ఫిట్ నెస్ ను ఒక వ్యక్తి యొక్క జీవితం లో అతడు సాధించిన విజయాల తాలూకు ఒక ప్రమాణం గా ఎంచాలి. ఈ స్ఫూర్తి తో మనం ముందుకు సాగాలి. ఫిట్ ఇండియా మూవ్మెంట్ ను మరింత అధిక స్థాయి లో విస్తరించేందుకు, అలాగే, దాని ని దేశం లోని మారుమూల ప్రాంతాల కు, మన పాఠశాలల కు, మన కార్యాలయాల కు తీసుకు పోవడాని కి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని నేను కోరుతున్నాను. ఫిట్ నెస్ కు ప్రతి రోజూ కొంత కాలాన్ని కేటాయించేటట్లు గా ప్రజల ను మనం ప్రేరేపించవలసిన అవసరం ఉంది. ఆరోగ్యవంతులైన ప్రజలు, ఆరోగ్య వంతమైన కుటుంబాలు మరియు స్వస్థ సమాజం ఇదీ ‘న్యూ ఇండియా’ను ‘ద బెస్ట్ ఇండియా’గా ఆవిష్కరింప చేసేటటువంటి బాట. ఎలాగైతే మీరు స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను మీ జీవితం లో ఒక భాగం గా మలచుకొన్నారో అదే తీరు న ఫిట్ ఇండియా మూవ్మెంట్ కూడా మీ జీవితం లో ఒక భాగం అయి తీరాలి.
రండి, ఈ రోజు న ఈ మేరకు సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు ఫిట్ గా ఉంటాము అని ప్రతిజ్ఞ స్వీకరించండి. అంతేకాదు, మీ యొక్క కుటుంబాన్ని, మీ యొక్క స్నేహితుల ను, మీ ఇరుగు పొరుగు ఇళ్ళ వారిని, అలాగే మీకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కరి ని ఫిట్ గా ఉండేలా ప్రోత్సహిస్తామని మీరు శపథం చేయండి. నేను ఫిట్ గా ఉన్నాను అంటే అటువంటప్పుడు భారతదేశం కూడా ఫిట్ గా ఉంటుంది.
ఈ ఒక్క అభ్యర్ధన తో నేను దేశవాసులందరి కి ఈ ప్రచార ఉద్యమం లో నా యొక్క శుభాకాంక్షల ను మరొక్క మారు వ్యక్తం చేస్తున్నాను. సమాజం లో ప్రతి ఒక్క వర్గాని కి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తుల ను ముందడుగు వేసి ఈ ఉద్యమాన్ని బలపరచవలసిందిగాను, సమాజాన్ని ఆరోగ్యవంతం గా చేయడం లో ఒక భాగస్వామి కావలసిందిగాను నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అపేక్ష తో మీకు అందరి కీ నేను నా యొక్క శుభాకాంక్షల ను మరియు నా యొక్క ధన్యవాదాల ను తెలియ జేస్తున్నాను.
**********
आज का ये दिन हमारे उन युवा खिलाड़ियों को बधाई देने का भी है, जो निरंतर दुनिया के मंच पर तिरंगे की शान को नई बुलंदी दे रहे हैं।
— PMO India (@PMOIndia) August 29, 2019
बेडमिंटन हो, टेनिस हो, एथलेटिक्स हो, बॉक्सिंग हो, कुश्ती हो या फिर दूसरे खेल, हमारे खिलाड़ी हमारी उम्मीदों और आकांक्षाओं को नए पंख लगा रहे हैं: PM
उनका जीता हुआ मेडल, उनके तप और तपस्या का परिणाम तो है ही, ये नए भारत के नए जोश और नए आत्मविश्वास का भी पैमाना है: PM
— PMO India (@PMOIndia) August 29, 2019
Sports का सीधा नाता है Fitness से।
— PMO India (@PMOIndia) August 29, 2019
लेकिन आज जिस Fit India Movement की शुरुआत हुई है, उसका विस्तार Sports से भी आगे बढ़कर है।
Fitness एक शब्द नहीं है बल्कि स्वस्थ और समृद्ध जीवन की एक जरूरी शर्त है: PM
समय कैसे बदला है, उसका एक उदाहरण मैं आपको देता हूं।
— PMO India (@PMOIndia) August 29, 2019
कुछ दशक पहले तक एक सामान्य व्यक्ति एक दिन में 8-10 किलोमीटर पैदल चल ही लेता था।
फिर धीरे-धीरे टेक्नोलॉजी बदली, आधुनिक साधन आए और व्यक्ति का पैदल चलना कम हो गया: PM
अब स्थिति क्या है?
— PMO India (@PMOIndia) August 29, 2019
टेक्नोलॉजी ने हमारी ये हालत कर दी है कि हम चलते कम हैं और अब वही टेक्नोलॉजी हमें गिन-गिन के बताती है कि आज आप इतने steps चले, अभी 5 हजार Steps नहीं हुए, 2 हजार Steps नहीं हुए, अभी और चलिए: PM
आज भारत में diabetes, hypertension जैसी अनेक lifestyle diseases बढ़ती जा रही हैं।
— PMO India (@PMOIndia) August 29, 2019
अपने आसपास देखिए, तो आपको अनेक लोग इनसे पीड़ित मिल जाएंगे।
पहले हम सुनते थे कि 50-60 की उम्र के बाद हार्ट अटैक का खतरा बढ़ता है, अब 35-40 साल के युवाओं को हार्ट अटैक आ रहा है: PM
Lifestyle diseases हो रही हैं lifestyle disorders की वजह से।Lifestyle disorders को हम lifestyle में बदलाव करके ठीक कर सकते हैं।
— PMO India (@PMOIndia) August 29, 2019
ऐसी बीमारियां हैं जिन्हें अपने lifestyle में छोटे बदलाव करके दूर कर सकते हैं। इन बदलावों के लिए देश को प्रेरित करने का नाम ही है #FitIndiaMovement :PM
सफलता और फिटनेस का रिश्ता भी एक दूसरे से जुड़ा हुआ है।
— PMO India (@PMOIndia) August 29, 2019
आज आप कोई भी क्षेत्र लीजिए, अपने icons को देखिए, उनकी success stories को देखिए, चाहे वो Sports में हों, फिल्मों में हों, बिजनेस में हों, इनमें से अधिकतर फिट हैं: PM
ये सिर्फ संयोग मात्र नहीं है। अगर आप उनकी lifestyle के बारे में पढ़ेंगे तो पाएंगे, कि एक चीज ऐसे हर व्यक्ति में कॉमन है।
— PMO India (@PMOIndia) August 29, 2019
सफल लोगों का Common character है - Fitness पर उनका फोकस: PM
आप किसी भी प्रोफेशन में हों, आपको अपने प्रोफेशन में Efficiency लानी है तो मेंटल और फिजिकल फिटनेस जरूरी है।
— PMO India (@PMOIndia) August 29, 2019
चाहे Boardroom हो या फिर Bollywood, जो फिट है वो आसमान छूता है।
Body fit है तो Mind hit है: PM
आप किसी भी प्रोफेशन में हों, आपको अपने प्रोफेशन में Efficiency लानी है तो मेंटल और फिजिकल फिटनेस जरूरी है।
— PMO India (@PMOIndia) August 29, 2019
चाहे Boardroom हो या फिर Bollywood, जो फिट है वो आसमान छूता है।
Body fit है तो Mind hit है: PM
जब फिटनेस की तरफ हम ध्यान देते हैं, फिट करने की कोशिश करते हैं, तो इससे हमें अपनी बॉडी को समझने का भी मौका मिलता है।
— PMO India (@PMOIndia) August 29, 2019
ये हैरानी की बात है, लेकिन हम अपने शरीर के बारे में, अपनी ताकत, अपनी कमजोरियों के बारे में बहुत ही कम जानते हैं: PM
#FitIndiaMovement भले ही सरकार ने शुरु किया है, लेकिन इसका नेतृत्व आप सभी को ही करना है।
— PMO India (@PMOIndia) August 29, 2019
देश की जनता ही इस कैंपेन को आगे बढ़ाएगी और सफलता की बुलंदी पर पहुंचाएगी।
मैं अपने निजी अनुभवों से कह सकता हूं कि इसमें Investment Zero है, लेकिन Returns असीमित हैं: PM