పిఎంఇండియా
నూతన దశాబ్దం లో దేశాని కి ఉజ్వల భవిత కోసం ఒక బలమైన పునాది ని వేసే దిశ గా కృషి చేయవలసింది గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు సభ్యుల కు సూచించారు.
Speaking at the start of the Budget Session of Parliament. https://t.co/CIMbUsXOVV
— Narendra Modi (@narendramodi) January 31, 2020
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఆరంభం కావడాని కన్నా ముందు ప్రసార మాధ్యమాల ప్రతినిధుల ను ఉద్దేశించి ఆనవాయితీ గా ప్రధాన మంత్రి నేడు మాట్లాడుతూ దేశం లో ఆర్థిక అంశాల ను గురించి విస్తృతం గా చర్చించాలని, అదే విధం గా ప్రస్తుత ప్రపంచ ఆర్థిక స్థితిగతుల లో భారతదేశాని కి గరిష్ట లాభాల ను ఏ విధం గా రాబట్టుకోవచ్చనేది కూడా చర్చించాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
“మనం ఈ సమావేశాల లో ఆర్థిక అంశాల పైనే ప్రధానం గా దృష్టి ని సారించాలి. మరి మనం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి ఆర్థిక వాతావరణం లో భారతదేశం ఏ రకం గా గరిష్ఠ స్థాయి లో లబ్ది ని పొందగలుగుతుందో, అలాగే ఈ సమావేశాలు దేశ ఆర్థిక వ్యవస్థ ను ఏ విధం గా ముందుకు తీసుకు పోగలవో అనేవి గమనించడానికి మనం ప్రయత్నాలను చేయవలసి ఉంది” అని ఆయన అన్నారు.
పార్లమెంటు ఉభయ సభల లో ఫలప్రదమయ్యేటటువంటి చర్చలు చోటు చేసుకోవాలి, ఆ చర్చ లు ప్రజల సాధికారిత పై సైతం శ్రద్ధ తీసుకోవాలి అంటూ ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
“మా ప్రభుత్వం మహిళల కు మరియు ఆదరణ కు నోచుకోని వర్గాల కు సాధికారిత ను అందించడం కోసం పాటుపడుతుందన్న పేరు ను తెచ్చుకొన్నది. ఈ దిశ లో కృషి చేయడాన్ని మేము ఈ దశాబ్దం లో సైతం కొనసాగిస్తాము. ఉభయ చట్టసభ లు ఆర్థిక అంశాల పైన, ప్రజల కు సాధికారిత కల్పన పైన గొప్ప చర్చ కు తావు ఇస్తాయని నేను అభిలషిస్తున్నాను. ఈ చర్చ లు మన అందరికీ జ్ఞాన ప్రభోదకం గా ఉంటాయన్న నమ్మకం నాలో ఉంది’’ అని ఆయన అన్నారు.
Speaking at the start of the Budget Session of Parliament. https://t.co/CIMbUsXOVV
— Narendra Modi (@narendramodi) January 31, 2020