Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అహ‌మదాబాద్‌ లో నిర్వ‌హించిన న‌మ‌స్తే ట్రంప్ కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి ముగింపు ఉప‌న్యాసం


మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌ మీకు ధన్యవాదాలు.

మీ ఉప‌న్యాసం లో మీరు మ‌హాత్మాగాంధీ ని, స్వామి వివేకానందుల వారి ని, స‌ర్ దార్‌ ప‌టేల్‌ గారి ని స్మ‌రించుకొన్నందుకు, భార‌త‌దేశాన్ని గురించి మాట్లాడినందుకు, భార‌తీయుల సామ‌ర్థ్యాల‌ను ప్ర‌శంసించినందుకు, భార‌త‌దేశం యొక్క విజ‌యాల‌ ను, సంస్కృతి ని ప్ర‌స్తావించినందుకు, అలాగే నా గురించి మాట్లాడినందుకు భార‌త‌దేశ ప్ర‌జ‌లంద‌రి త‌ర‌ఫు న మీకు నా హృద‌యాంతరాళం లో నుండి ధన్యవాదాలు తెలియ‌జేస్తున్నాను. అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ భార‌త‌దేశం లో ప‌ర్య‌టించడం ద్వారా దేశ ప్ర‌తిష్ట‌ ను ఇనుమ‌డింపచేయడం తో పాటు అమెరికా లోని భార‌తీయుల మ‌నోభావాల‌ను కూడా గౌర‌వించారు.

మిస్ట‌ర్ ప్రెసిడెంట్, మీరు భార‌తీయుల‌ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ఈ స్టేడియమ్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద దైనటువంటి స్టేడియమ్. ఇది ఆట‌ల పోటీల‌ ను నిర్వ‌హించే స్టేడియం. ఇక్క‌డ ఆట‌ల‌ కు సంబంధించిన కొన్ని సౌక‌ర్యాల‌ ను ఏర్పాటు చేస్తున్నారు. అయినప్ప‌టికిని, మీరు ఇక్క‌డ‌కు రావ‌డం క్రీడాప్ర‌పపంచానికి కూడా ఉత్సాహాన్ని క‌లిగిస్తోంది. ఈ అద్భుత‌మైన క్రికెట్ స్టేడియాన్ని ఈ కార్య‌క్ర‌మం కోసం అందుబాటులోకి తీసుకువచ్చినందుకు గుజ‌రాత్ క్రికెట్ అసోషియేశన్ కు నా అభినంద‌న‌ లు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఇక్క‌డ నిర్వ‌హించ‌డం వ‌ల్ల ఈ స్టేడియమ్ కు సంబంధించిన నిర్మాణ ప‌నుల‌ కు ఆటంకం క‌లిగివుండ‌వ‌చ్చును. అయితే వారు దీనిని తప్పక భర్తీ చేసేసుకొంటారనే నాకు తోస్తున్నది.

మిత్రులారా,

ఇద్ద‌రి స్నేహితుల మ‌ధ్య‌ గాని, రెండు దేశాల మ‌ధ్య‌ గాని సంబంధ బాంధ‌వ్యాల కు ముఖ్య‌మైనటువంటి పునాది న‌మ్మ‌కం. దీనికి సంబంధించి మా దేశం లో

तन् मित्रम् यत्र विश्वास:॥ అని

అంటారు.

ఈ మాటల కు స్నేహం అంటే మ‌రేమిటో కాదు ఇరువురి మ‌ధ్య‌ న‌మ్మ‌కం బ‌లం గా ఉండ‌డం అని భావం.

గత కొన్ని సంవత్స‌రాల కాలం లో, భార‌త‌దేశానికి మరియు అమెరికా కు మ‌ధ్య సంబంధాలు ఒక క్రొత్త శిఖరాని కి చేరుకొన్నాయి. ఇవి బలపడినటువంటి తీరు చరిత్రాత్మ‌కం. అమెరికా ను నేను సందర్శించినపుడు, ఈ నమ్మకం రోజు రోజు కు బలవత్తరం అవుతూ ఉండటాన్ని గమనించాను.

వాశింగ్ టన్‌ లో మొద‌టి సారి గా ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ తో భేటీ అయినపుడు ఆయ‌న ఏం చెప్పార‌నేది ఇప్ప‌టికీ నాకు గుర్తుంది. వైట్ హౌస్ లో భార‌త‌దేశాని కి నిజ‌మైన స్నేహితుడు ఉన్నాడు అని ఆయ‌న ఆ రోజు న అన్నారు.

భార‌త‌దేశం ప‌ట్ల ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ ఎల్లప్పుడూ ప్ర‌త్యేక‌మైనటువంటి ప్రేమ‌ ను చూపుతూ వస్తున్నారు. వైట్ హౌస్ లో దీపావ‌ళి పండుగ సంబ‌రాలు జ‌రిగిన‌పుడు అమెరికా లోని న‌ల‌భై ల‌క్ష‌ల మంది భార‌తీయులు చాలా సంతోషించారు. అమెరికా ప్ర‌గ‌తి లో భాగ‌మైనందుకు ఆనందించారు.

మిత్రులారా,

అమెరికాలాగానే భార‌త‌దేశం కూడా మార్పుకోసం ఎంతో ఆత్రం గా ఎదురు చూస్తోంది. ఈ రోజు న 130 కోట్ల మంది భార‌తీయులు ఐక‌మ‌త్యం గా నిలుస్తూ న్యూ ఇండియా నిర్మాణాని కి కృషి చేస్తున్నారు.

భార‌తీయ యువ‌త లో అనేక ఆకాంక్ష‌ లు ఉన్నాయి. పెద్ద పెద్ద ల‌క్ష్యాల‌ ను నిర్దేశించుకొని, వాటిని అందుకోవ‌డం ద్వారా త‌న అస్తిత్వాన్ని చూపుతోంది న్యూ ఇండియా.

• ఈ రోజు న భారతదేశం లో ప్ర‌పంచం లోకెల్లా అతి పెద్ద క్రికెట్ స్టేడియమ్ మాత్రమే కాక, ఇవాళ భారత్ లో ప్ర‌పంచం లోని అతి పెద్ద బీమా హామీ ప‌థ‌కం కూడా అమలవుతోంది.

• ఇవాళ ప్ర‌పంచం లోని అతి పెద్ద సోలర్ పార్కు ను భార‌త‌దేశం లో నిర్మాణాధీనం లో ఉంది. అలాగే, ఇవాళ భారతదేశం లో ప్ర‌పంచం లో మరెక్క‌డా లేనటువంటి అతి పెద్ద ప‌రిశుభ్ర‌త కార్య‌క్ర‌మం కూడా నడపబడుతున్నది.

• ఇవాళ భారతదేశం మిగిలిన అన్ని దేశాల కన్నా ఎక్కువ సంఖ్య లో ఉప‌గ్ర‌హాల‌ ను అంత‌రిక్షం లోకి ప్రయోగించిన ప్ర‌పంచ రికార్డు ను వ్రాయడం తో పాటు, ఆర్ధిక సేవలను అంద‌రి అందుబాటు లోకి తీసుకుపోయేటటువంటి విషయం లోనూ వరల్డ్ రికార్డు ను సాధిస్తున్నది.

ఈ 21వ శ‌తాబ్దం లో ప్రాథమిక సౌక‌ర్యాల క‌ల్ప‌న కావొచ్చు, సామాజిక రంగం కావొచ్చు.. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణం గా భార‌త‌దేశం ముంద‌ంజ వేస్తున్నది.

గత కొద్ది కాలం లో స‌మాజాని కి సాధికారిత‌ ను క‌ల్పించి బ‌లోపేతం చేయ‌డానికి గాను ఇంత‌కాలం ఉన్న ప‌నికి రాని పురాత‌న చ‌ట్టాల‌ ను తొల‌గించడమైంది. అదే కాలం లో స‌మ‌ర్థ‌వంత‌మైన కొత్త చ‌ట్టాల‌ ను తీసుకు రావ‌డం జ‌రిగింది. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ కోసం అనేక హ‌క్కుల‌ ను క‌ల్పించ‌డం జ‌రిగింది.
ట్రాన్స్ జెండ‌ర్ వ్య‌క్తుల‌ కు హ‌క్కుల‌ ను క‌ల్పించాము. మూడు సార్ల త‌లాక్ కు వ్య‌తిరేకం గా చ‌ట్టాల‌ ను చేయడం ద్వారా ముస్లిమ్ మ‌హిళ‌ ల యొక్క గౌర‌వాన్ని మరియు మ‌ర్యాద‌ ను కాపాడుతున్నాము. అంతే కాదు దివ్యాంగుల హ‌క్కుల‌ కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌ాన్ని ఇచ్చాము. గ‌ర్భిణీల‌ కు 26 వారాల జీతం తో కూడిన మాతృత్వ సెల‌వు ను ఇవ్వ‌డం జ‌రిగింది.

మిత్రులారా,

ఇక్క‌డ ఒక విష‌యాన్ని చెప్ప‌డానికి సంతోషం గా ఉంది. భార‌త‌దేశం లో జ‌రుగుతున్న ఈ మార్పుల‌తో పాటు మ‌న దేశాని కి న‌మ్మ‌క‌మైన స్నేహితుని గా అమెరికా నిల‌వ‌డం ఆనందాన్నిస్తోంది.
ఈ రోజు న భార‌త‌దేశాని కి ఉన్న అతి పెద్ద వాణిజ్య భాగ‌స్వామి అమెరికా యే. అంతే కాదు భార‌త‌దేశ సైనిక ద‌ళాలు అధికంగా మిలిట‌రీ విన్యాసాలు చేస్తున్న దేశం కూడా అమెరికా యే. ఇక ప‌రిశోధ‌న మ‌రియు అభివృద్ధి కార్య‌క్ర‌మాల విష‌యం లో భార‌త‌దేశం తో అత్య‌ధిక భాగ‌స్వామ్యం కలిగివున్న దేశం కూడా అమెరికా యే.
ఈ రోజు న ఏ రంగాన్నైనా తీసుకోండి.. ర‌క్ష‌ణ రంగం కావొచ్చు, విద్యుత్తు, ఐటి.. ఇలాగ ఏ రంగాన్ని తీసుకొన్నప్పటికి ఇరు దేశాల మ‌ధ్య‌ ఉన్న సంబంధ‌ బాంధ‌వ్యాల విస్త‌ర‌ణ అవ‌కాశాలు స్థిరం గా విస్త‌రిస్తున్నాయి.

మిత్రులారా,

ఈ 21వ శ‌తాబ్దాని కి చెందిన ఈ ద‌శాబ్దం లో న్యూ ఇండియా, రిసర్జెంట్ అమెరికా కోసం కూడాను అనేక నూతన అవ‌కాశాలను తీసుకు వస్తున్నది.

అభివృద్ధి కి సంబంధించిన ప్ర‌తి రంగం లో ఇరు దేశాలు అనేక విధాలు గా ల‌బ్ధి ని పొంద‌వచ్చును.
మేడ్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మాలు పెరుగుతున్నాయి. మౌలిక సౌక‌ర్యాల క‌ల్ప‌న వేగ‌వంతం అవుతోంది. ఈ నేప‌థ్యం లో అమెరికా అనేక అవ‌కాశాల ను పొంద‌వ‌చ్చు.

భార‌త‌దేశాని కి సంబంధించి వాణిజ్య రంగం లో 4.0 శ‌కం నెల‌కొన్న ఈ త‌రుణం లో, డిజిట‌ల్ ఆర్ధిక వ్య‌వ‌స్థ విస్త‌రిస్తున్న ఈ స‌మ‌యం లో, అమెరికా కోసం ఇక్క‌డ అనేక పెట్టుబ‌డుల అవ‌కాశాలు ఉన్నాయి. వాటి ని అమెరికా బాగా వినియోగించుకోవ‌చ్చు.

మిస్ట‌ర్ ప్రెసిడెంట్,

గ‌త కొన్ని ద‌శాబ్దాలు గా డిజిటల్ సాంకేతిక‌త అనేది భార‌త‌దేశ‌ం, అమెరికా ల సంబంధాల అభివృద్ధి లో ముఖ్య‌మైన పాత్ర‌ ను పోషిస్తోంది. భార‌తీయు ప్ర‌తిభ‌, అమెరికా సాంకేతిక‌త క‌లసి ఈ రంగం లో నూత‌న నాయ‌క‌త్వాన్ని రూపొందించాయి.

ఈ 21వ శ‌తాబ్దం లో భార‌త‌దేశం, అమెరికా లు క‌లసి ఈ డిజిట‌ల్ యుగాన్ని, నూత‌న వాణిజ్య శ‌కం 4.0ను ముందుకు న‌డిపించ‌వ‌చ్చు.

మిత్రులారా,

ఈ 21వ శ‌తాబ్దం లో నూత‌న స‌మీక‌ర‌ణాలు, స‌రికొత్త పోటీ లు, కొత్త కొత్త స‌వాళ్లు, నూత‌న అవ‌కాశాలు అనేవి మార్పు కోసం పునాది వేస్తున్నాయి. ఇటువంటి ప‌రిస్థితుల లో భార‌త‌దేశం, అమెరికా ల మ‌ధ్య‌ సంబంధ బాంధ‌వ్యాలు అనేవి 21వ శ‌తాబ్దం లో ప్ర‌పంచ గ‌మ‌న దిశ‌ ను నిర్దేశించ‌డంలో ప్ర‌ధానమైన పాత్ర ను పోషిస్తాయి.

నా అభిప్రాయం ప్ర‌కారం, భార‌త‌దేశం, అమెరికా లు స‌హ‌జసిద్ద భాగ‌స్వాములు. ఇరు దేశాలు క‌లసి ఇండో- ప‌సిఫిక్ ప్రాంతం లో స‌మ‌ర్థ‌వంత‌మైన పాత్ర‌ ను పోషించ‌వ‌చ్చు. అంతే కాదు ప్ర‌పంచ భ‌ద్ర‌త‌, ప్ర‌గ‌తి, శాంతి సాధ‌న‌ లో కూడా ఇరు దేశాలు స‌మ‌ర్థ‌వంతం గా ప‌ని చేయ‌వ‌చ్చు.

ఉగ్ర‌వాదాన్ని జ‌యించ‌డానికి అమెరికా చూపుతున్న నిబ‌ద్ద‌త, ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ నాయ‌క‌త్వ ప్ర‌తిభ అనేవి ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌ కు మేలు చేస్తున్నాయి. ఈ నేప‌థ్యం లో చూసిన‌ప్పుడు విశిష్ట నాయ‌కుడు ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్‌, భార‌త‌దేశ విశిష్ట స్నేహితుడు శ్రీ ట్రంప్ ఈ ద‌శాబ్ద ఆరంభం లో భార‌త‌దేశ ప‌ర్య‌ట‌న‌ కు రావ‌డం ఒక ముఖ్య‌మైన అవ‌కాశం అని నేను చెప్తున్నాను.

గ‌తం లో ఇండో- అమెరికా సంబంధాల బ‌లోపేతం కోసం చేసిన కృషి అనేది ట్రంప్ ప‌ర్య‌ట‌న కార‌ణం గా మ‌రో నూత‌న ద‌శ‌ లోకి అడుగుపెడుతున్న‌ది.

దీర్ఘ‌కాల ప్ర‌యోజ‌నాల‌ కోసం ఇరు దేశాలు ప‌ని చేస్తున్నాయి. అంతే త‌ప్ప తాత్కాలిక ల‌క్ష్యాల సాధ‌న కోసం కాదు. ఈ ప‌ర్య‌ట‌న కార‌ణం గా ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందుతాయి; ఆర్ధిక భాగ‌స్వామ్యం విస్త‌రిస్తుంది. అంతే కాదు డిజిట‌ల్ రంగం లో స‌హ‌కారం పెరుగుతుంది.

నూత‌న శిఖరాల‌ ను అందుకొనే క్ర‌మం లో ఇరు దేశాలు క‌లసి రెండు దేశాల ప్ర‌జ‌ల క‌ల‌ల ను సాకారం చేస్తాయని నేను న‌మ్ముతున్నాను. ఈ రోజు న ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ ను, ఆయన కుటుంబాన్ని ఆహ్వానించే అవ‌కాశం నాకు ల‌భించ‌డం అదృష్టం గా భావిస్తున్నాను. న‌మ‌స్తే ట్రంప్ నినాదం తో ప్ర‌తిధ్వ‌నిస్తున్న ఈ స‌మ‌యం లో భార‌త్ మాతా కీ జయ్, భార‌త్ మాతా కీ జయ్, భార‌త్ మాతా కీ జయ్ అని నిన‌దించాల‌ని మీ అంద‌రి ని అభ్య‌ర్థిస్తున్నాను.

భార‌త‌దేశం, అమెరికా ల మైత్రి వర్ధిల్లాలి; క‌ల‌ కాలమూ వ‌ర్ధిల్లాలి.

అనేకానేక ధన్యవాదాలు.

**********