పిఎంఇండియా

పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్, కేంద్ర మంత్రివర్గం లో నా సహచరుడు శ్రీ మన్ సుఖ్ మాండవియా, ఇతర మంత్రులు మరియు ఇక్కడ కు విచ్చేసినటువంటి ఎంపీ లు, ఇంకా పెద్ద సంఖ్య లో ఇక్కడ కు తరలి వచ్చిన పశ్చిమ బెంగాల్ కు చెందిన నా సోదరీమణులు మరియు సోదరులారా,
మిత్రులారా, దేశ జల శక్తి కి ఒక చారిత్రిక ప్రతీక గా ఉన్నటువంటి గంగా మాత కు అతి సమీపం లోని గంగాసాగర్ కు చేరువ లో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమం లో పాలు పంచుకోవడం నిజం గా మనకు అందరికి ఒక సౌభాగ్యం అని చెప్పాలి. ఈ రోజు కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ కు, దీని తో సహవాసం కలిగిన వారికి మరియు ఇక్కడ పనిచేసినటువంటి వారికి చాలా ముఖ్యమైన రోజుగా ఉన్నది. కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ స్థాపనానంతరం 150వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్నందుకు గాను ఈ సంస్థ తో సంబంధం కలిగినటువంటి నా యొక్క మిత్రులు అందరి ని ఈ సందర్భం లో నేను అభినందిస్తున్నాను. మరి దీనికి యగాను మీకు ఇవే నా యొక్క శుభాకాంక్షలు.
మిత్రులారా, కొద్దిసేపటి క్రితం, ఈ ఘట్టాని కి సాక్షీభూతం గా నిలచేందుకు గాను స్టాంపుల ను జారీ చేయడమైంది. దీని తో పాటు, ఈ ట్రస్ట్ యొక్క ఉద్యోగుల కు మరియు ఇక్కడ సేవలు అందించిన పూర్వ ఉద్యోగుల కు పింఛన్ కోసమని 500 కోట్ల రూపాయల కు ఒక చెక్కు ను కూడా అప్పగించడం జరిగింది. దాదాపు గా 100 ఏళ్ల వయస్సు పైబడిన సీనియర్ మాననీయ వ్యక్తుల ను సన్మానించుకొనే సౌభాగ్యాని కి కూడా నేను నోచుకొన్నాను. కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ ద్వారా దేశ ప్రజల కు సేవలు అందజేసిన అటువంటి మాన్యులు అందరి కి మరియు వారి యొక్క కుటుంబాల కు ప్రణామాలు పలుకుతూ మరి వారి కి ఒక ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ప్రాప్తించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మిత్రులారా, ఈ రోజు న ఈ ఓడరేవు యొక్క విస్తరణ మరియు ఆధునికీకరణ కోసం ఉద్దేశించినటువంటి వందలాది కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాల కల్పన పథకాల ను ప్రారంభించడం జరుగుతున్నది. ఆదివాసీ పుత్రికల విద్య మరియు నైపుణ్యాల అభివృద్ధి కి గాను వసతి గృహం మరియు నైపుణ్యాభివృద్ధి కేంద్రం నిర్మాణానికి పునాదిరాయి ని కూడా వేయడమైంది. ఈ అభివృద్ధియుత సదుపాయాల కు గాను పశ్చిమ బెంగాల్ పౌరులందరి కి నేను అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.
మిత్రులారా, కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ కేవలం నౌక ల రాకపోకల కోసమే కాదు, దాని వెనుక పూర్తి చరిత్రే ఇమిడి ఉంది. ఈ ఓడరేవు భారతదేశం విదేశీ పాలన నుండి స్వరాజ్యాన్ని సాధించుకోవడానికి ఒక సాక్షి గా నిలచింది. సత్యాగ్రహం నుండి స్వచ్ఛాగ్రహం వరకు, ఈ నౌకాశ్రయం దేశం లో మార్పు సంభవించడాన్ని వీక్షించింది. ఈ పోర్టు విదేశీ సరకు రవాణా ఓడల నిలయం గానే కాక, దేశం మీద మరియు ప్రపంచం మీద వారివైన ముద్ర ను వదలినటువంటి మేధావుల పాదాలు కూడా ఈ పోర్టు మీద పడ్డాయి. అనేక మంది మనీషులు, ఎన్నో సందర్భాల లో ప్రపంచం లోకి వారి యొక్క ప్రయాణాన్ని ఇక్కడి నుండే మొదలుపెట్టారు.
ఒక రకం గా, ఈ కోల్ కాతా నౌకాశ్రయం భారతదేశం యొక్క పారిశ్రామిక అభివృద్ధి, ఆధ్యాత్మికత మరియు స్వయంసహాయానికి ఒక సజీవ ప్రతీక గా ఉంది అని చెప్పవచ్చును. అటువంటి స్థితి లో, ఈ పోర్టు తన 150వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న వేళ, దీని ని న్యూ ఇండియా తాలూకు ఒక శక్తిపూర్ణ ప్రతీక గా తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది.
భారతదేశం యొక్క మరియు పశ్చిమ బెంగాల్ యొక్క ఈ భావన కే ప్రణామాన్ని ఆచరిస్తూ, కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ కు భారతదేశ పారిశ్రామికీకరణ పిత.. ఎవరైతే బెంగాల్ యొక్క వికాసాన్ని గురించి కల గన్నారో.. ఎవరైతే తన జీవనాన్ని ‘ఒక దేశం, ఒక చట్టం’ కోసం త్యాగం చేశారో.. వారి యొక్క, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ యొక్క, పేరు ను పెట్టాలని నేను తలుస్తున్నాను. ఇక ఈ ఓడరేవు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు పేరిట వ్యవహరింపబడుతుంది.
మిత్రులారా, బెంగాల్ పుత్రుడైన డాక్టర్ ముఖర్జీ దేశం లో పారిశ్రామీకీకరణ కు శంకుస్థాపన చేశారు. అది చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ కావచ్చు, హిందుస్తాన్ ఎయర్ క్రాఫ్ట్ ఫ్యాక్టరీ కావచ్చు, సింద్ రీ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ కావచ్చు, లేదా దామోదర్ వేలీ కార్పొరేశ్ కావచ్చు, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అటువంటి అనేక ప్రధాన పథకాల అభివృద్ధి కి పెద్ద తోడ్పాటు ను అందించారు. ఈ రోజు న ఈ యొక్క సందర్భం లో, నేను బాబాసాహెబ్ ఆంబేడ్ కర్ ను కూడా స్మరించుకొంటూ మరి వారి కి ప్రణమిల్లుతున్నాను. డాక్టర్ ముఖర్జీ మరియు బాబాసాహెబ్ ఆంబేడ్ కర్.. వీరు ఇద్దరు స్వాతంత్య్రానంతర భారతదేశాని కి ఒక క్రొత్త కల్పన శక్తి ని, ఇంకా ఒక నూతనమైనటువంటి విధానాల ను ప్రసాదించారు. డాక్టర్ ముఖర్జీ యొక్క ఒకటో పారిశ్రామిక విధానం దేశ జల వనరుల ను సరి అయిన విధం గా ఉపయోగించుకోవడం గురించి ఉద్ఘాటిస్తే, బాబాసాహెబ్ తన అనుభవాల ను దేవ ప్రథమ జల వనరుల విధానం మరియు శ్రామిక చట్టాల రూపకల్పన కు వినియోగించారు. దేశం లో నదీ లోయ పథకాల, ఆనకట్ట ల మరియు నౌకాశ్రయాల నిర్మాణం త్వరిత గతి న సాగడమనేది ఈ మహనీయ పుత్రుల చలవ తో సాధ్యపడింది. ఈ ఇరువురు వ్యక్తులు దేశం లోని వనరుల కు గల శక్తి ని అర్థం చేసుకొని, మరి ఆ వనరుల ను దేశం యొక్క అవసరాల కు అనుగుణం గా ఉపయోగించడం కోసం పట్టుబట్టారు.
నవీన జల విధానం పై ఇక్కడే కోల్ కాతా లో 1944వ సంవత్సరం లో జరిగిన ఒక సమావేశం లో బాబాసాహెబ్ భారతదేశ జల మార్గ విధానం సమగ్రం గా ఉండి తీరాలి అని ప్రకటించారు. అందులో సాగునీరు, విద్యుత్తు మరియు సరకుల రవాణా ల వంటి ప్రతి ఒక్క దృష్టికోణం ఇమిడివుండాలన్నారు. కానీ డాక్టర్ ముఖర్జీ మరియు బాబాసాహెబ్ లు ప్రభుత్వం నుండి నిష్క్రమించిన తరువాత వారి సూచనల ను తు.చ. తప్పక ఆచరణ లో పెట్టక పోవడం దేశాని కి అదృష్టహీన స్థితి ఎదురైంది.
మిత్రులారా, భారతదేశానికి ఉన్నటువంటి విస్తారమైన సముద్ర సంబంధి సరిహద్దు దాదాపు గా 7,500 కిలోమీటర్ల పొడవైంది. ప్రపంచం లో, సముద్ర తీరాని కి జోడింపబడి వుండడం అనేది ఇప్పటికీ ఒక గొప్ప శక్తి గా భావింపబడుతున్నది. ప్రాచీన కాలం లో, భారతదేశాని కి కూడాను ఒక గొప్ప శక్తి ఉండింది. గుజరాత్ లోని లోథల్ నౌకాశ్రయం నుండి కోల్ కాతా నౌకాశ్రయం వరకు, భారతదేశంలోని దీర్ఘ కోస్తా రేఖ గుండా ప్రపంచవ్యాప్తం గా వ్యాపార కార్యకలాపాలు జరుగుతూ వుండేవి. సంస్కృతి యొక్క మరియు సభ్యత యొక్క ఆదాన ప్రదానం సైతం సాగుతూ వుండేది. 2014వ సంవత్సరం అనంతరం, భారతదేశానికి గల ఈ యొక్క శక్తి ని పునర్జీవింపచేయడం కోసం ఒక నూతనోత్సాహం తో తాజా గా ఆలోచన చేసి మరి సంబంధిత పని ని మొదలుపెట్టడం జరిగింది.
మిత్రులారా, భారతదేశపు ఓడరేవులు భారతదేశ సమృద్ధి కి ప్రవేశద్వారమని మా ప్రభుత్వం నమ్ముతున్నది. మరి ఈ కారణం గా ప్రభుత్వం తీరప్రాంతాల వెంబడి మౌలిక సదుపాయాల కల్పన తో పాటు సంధానాన్ని ఆధునికీకరించడం కోసం సాగర్ మాల కార్యక్రమాన్ని ఆరంభించింది. సాగర్ మాల పథకం లో భాగం గా దేశం లో ప్రస్తుత నౌకాశ్రయం యొక్క ఆధునికీకరణ మరియు ఒక క్రొత్త నౌకాశ్రయాన్ని అభివృద్ధి పరచే పనులు నిలకడ గా పురోగమిస్తున్నాయి. తీర సంబంధిత రవాణా, అంతర్ రాష్ట్ర జలమార్గాలు, రైలురోడ్డులు, రహదారుల ను సమన్వయపరచడం జరుగుతున్నది. ఈ పథకం తీర సంబంధిత రవాణా ద్వారా సరకుల రాకపోకల ను పెంచడం లో ఒక అతి కీలకమైన పాత్ర ను పోషిస్తున్నది.
ఈ పథకం లో భాగం గా 6 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువైన దాదాపు 575 పథకాల ను గుర్తించడమైంది. వీటిలో 3 లక్షల కోట్ల రూపాయల కు పైగా విలువైన 200 పైచిలుకు పథకాలు పురోగమన స్థితి లో ఉన్నాయి; మరియు సుమారు 125 పథకాల పనులు పూర్తి అయిపోయాయి.
మిత్రులారా, రవాణా తాలూకు యావత్తు ఫ్రేంవర్క్ ను ఆధునికీకరించడానికి మరియు సమైక్య పరచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మన దేశం లోని రవాణా విధానాల లో అసమానత్వాన్ని కూడా సరి చేయడం జరుగుతున్నది. దీనిలోనూ, దేశీయ జలమార్గాని కి సంబంధించిన పథకాల తాలూకు ప్రత్యేక లాభాల ను భారతదేశం లోని తూర్పు ప్రాంతాలు మరియు భారతదేశం లోని ఈశాన్య ప్రాంతాలు పొందుతూవున్నాయి. ఇక భవిష్యత్తు లో జలశక్తి మాధ్యమం ద్వారా భారతదేశం లోని ఈశాన్య ప్రాంతాలన్నిటి ని జత పరచే నెట్ వర్క్ భారతదేశం యొక్క అభివృద్ధి లో ఒక సువర్ణ అధ్యాయం గా ఆవిష్కరింపబడనున్నది.
సోదరీమణులు మరియు సోదరులారా, జలానికి సంబంధించిన అభివృద్ధి విషయానికి వస్తే కోల్ కాతా ను మరింత అధిక భాగ్యశాలి గా చెప్పాలి. కోల్ కాతా పోర్ట్ దేశ సముద్ర పరిధి లోనూ ఉంది; మరి అలాగే ఇది నది ఒడ్డు న కూడాను వెలసింది. ఈ రకం గా, ఇది దేశం లోపల మరియు దేశాని కి వెలుపల జల మార్గాల కు ఒక సంగమ స్థలి గా ఉంది.
హల్దియా కు మరియు బనారస్ కు మధ్య గంగ లో నౌక ల కదలిక లు ఆరంభం అయ్యాయి అన్న సంగతి మీకు అందరికి చాలా బాగా తెలిసిన విషయమే. మరి నేను కాశీ కి ఎంపీ గా ఉన్నాను కాబట్టి, స్వాభావికం గా, మీతో నేను నేరు గా జోడింపబడ్డాను. దేశం లో ప్రథమ ఆధునిక దేశీయ జలమార్గాన్ని పూర్తి స్థాయి లో రూపుదిద్దడం కోసం అవసరమైన పనులు శీఘ్రం గా జరుగుతూవున్నాయి.
ఈ సంవత్సరం లో హల్దియా లో మల్టిమోడల్ టర్మినల్ ను మరియు ఫరక్కా లో నావిగేశనల్ బ్లాకు ను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు సాగుతూవున్నాయి. 2021వ సంవత్సరానికల్లా గంగానది లో మరింత పెద్ద నౌక లు కూడా నడిచేందుకు వీలు గా అవసరమైన లోతు ను ఏర్పాటు చేసే దిశ లో సైతం పనులు పురోగమిస్తున్నాయి. దీనితో పాటు గంగాజీ ని అసమ్ లోని పాండు లో బ్రహ్మపుత్ర తో జోడించేటటువంటి రెండో దేశీయ జలమార్గం లోనూ ఓడ సరుకుల చేరవేత మొదలైంది. నదీ జలమార్గ సౌకర్యాలు నిర్మాణం కావడం తో కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ భారతదేశం తూర్పు ప్రాంతాల లోని పారిశ్రామిక కేంద్రాల తో జతపడింది; దీని తో నేపాల్, బాంగ్లాదేశ్, భూటాన్ మరియు మ్యాన్మార్ల వంటి దేశాల కు వ్యాపారం సులభతరం గా మారిపోయింది.
మిత్రులారా, దేశం లోని నౌకాశ్రయాల లో ఆధునిక సౌకర్యాల ను అభివృద్ధి పరచడం, సంధానం లో ఉత్తమమైన వ్యవస్థ మరియు నిర్వహణ లో మెరుగుదల వంటి అనేక చర్య ల కారణం గా ఓడ సరుకుల తొలగింపు తాలకు అనుమతి మరియు ఆ సరుకుల రవాణా తో ముడిపడిన కాలం కుదించుకుపోయింది.
టర్న్ అరౌండ్ కాలం గడచిన 5 సంవత్సరాల లో దాదాపు గా సగాని కి తగ్గింది. వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం ర్యాంకింగు లో భారతదేశం యొక్క 79వ స్థానాని కి ఎగబాకడానికి ఇది ఒక పెద్ద కారణం అయింది.
మిత్రులారా, పశ్చిమ బెంగాల్, కోల్ కాతా, రైతులు, పరిశ్రమలు మరియు శ్రామికులు, నా మత్స్యకార సోదరులు మరియు నా మత్స్యకార సోదరీమణులు రాబోయే రోజుల లో జల సంధానం యొక్క విస్తరణ ద్వారా గొప్ప లబ్ధి ని పొందనున్నారు.
మన మత్స్యకార సోదరులు జల సంపద ను పూర్తి స్థాయి లో ఉపయోగించుకొనేందుకు పూచీ పడటానికి గాను ప్రభుత్వం నీలి విప్లవం పథకాన్ని నడుపుతున్నది. దీనిలో భాగం గా, ఈ ప్రాంతాని కి విలువ ను జోడించడం తో పాటు గా చేపలు పట్టే పడవల ను ఆధునికీకరించడం లో కూడాను వారికి సాయాన్ని అందించడం జరుగుతున్నది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా మత్స్యకారులు ప్రస్తుతం బ్యాంకుల నుండి చౌకైనటువంటి మరియు అవాంతరాలు లేనటువంటి రుణాల ను పొందుతూ వున్నారు. మేము ఒక ప్రక్క న విడి గా ఒక జల శక్తి మంత్రిత్వ శాఖ ను ఏర్పాటు చేసి, మరొక ప్రక్క న ఈ మంత్రిత్వ శాఖ ను ప్రోత్సహించేందుకు వేరు గా మత్స్య మంత్రిత్వ శాఖ ను కూడా ఏర్పాటు చేశాము. అంటే, ఈ మంత్రిత్వ శాఖ ల యొక్క ఏర్పాటు మేము అభివృద్ధి ని ఎక్కడ కు తీసుకు పోదలుస్తున్నామో, మరి అలాగే ఏ దిశ లో తీసుకు పోదలుస్తున్నామో అనే విషయాల కు ఒక సంకేతం గా ఉంది అన్నమాట.
మిత్రులారా, నౌకాశ్రయ ప్రధానమైనటువంటి అభివృద్ధి ఒక విస్తృతమైనటువంటి ఇకోసిస్టమ్ ను అభివృద్ధి పరుస్తుంది. ఈ జల సంపద ను పర్యటన కోసం, సముద్ర పర్యటన కోసం, ఇంకా నదీ జల పర్యటన కోసం కూడాను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ కాలం లో ప్రజలు విహార ప్రధాన సముద్ర యాత్ర కోసమై విదేశాల కు వెళ్తున్నారు. ఇటువంటి వాటిని అన్నిటిని చాలా సులువు గా ఇక్కడే అభివృద్ధి చేయవచ్చును. పశ్చిమ బెంగాల్ యొక్క కళల కు మరియు సంస్కృతి కి సంబంధించిన పెద్ద కేంద్రాల యొక్క ఆధునికీకరణ నిన్నటి రోజుననే మొదలవడం ఒక అద్భుతమైనటువంటి కాకతాళీయ ఘటన. మరి ఈ రోజు న జల పర్యటన కు సంబంధించినటువంటి పెద్ద పథకం ఒకదాని ని ఇక్కడ ఆరంభించడం జరిగింది.
నదీముఖ అభివృద్ధి పథకం పశ్చిమ బెంగాల్ యొక్క పర్యటన పరిశ్రమ కు ఒక క్రొత్త పార్శ్వాన్ని అందించబోతున్నది. ఇక్కడ 32 ఎకరాల భూమి లో గంగాజీ యొక్క దర్శనం కోసం సుఖప్రదమైన సౌకర్యాల ను సిద్ధం చేసినప్పుడు, తద్ద్వారా యాత్రికులు కూడాను లబ్ధి ని పొందగలుగుతారు.
సోదరీమణులు మరియు సోదరులారా, ఒక్క కోల్ కాతా లోనే కాదు, ప్రభుత్వం దేశవ్యాప్తం గా నౌకాశ్రయాల తో జతపడివున్న క్లస్టర్లలో ను మరియు నగరాల లోను జల- జీవశాల లు, వాటర్ పార్క్ లు, సీ మ్యూజియమ్ లు, క్రూజ్ లు మరియు జల క్రీడల కు సంబంధించి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల ను నిర్మిస్తూ వస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం క్రూజ్ ఆధారిత వినోద పర్యటన అవకాశాల ను ప్రోత్సహిస్తున్నది కూడాను. దేశం లో ప్రస్తుతం దాదాపు 150 గా ఉన్నటువంటి క్రూజ్ శిప్ ల సంఖ్య ను 1,000 కి పెంచాలన్నది మా లక్ష్యం గా ఉంది. ఈ విస్తరణ తాలూకు లాభాన్ని పశ్చిమ బెంగాల్ సైతం పొందబోతున్నది; బంగాళాఖాతం లో నెలకొన్న దీవులు కూడా ప్రయోజనాన్ని పొందనున్నాయి.
మిత్రులారా, పశ్చిమ బెంగాల్ యొక్క అభివృద్ధి కి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేస్తూవున్నది. మరీ ముఖ్యం గా పేదలు, దళితులు, ఆదరణ కు నోచుకోనటువంటి వర్గాల వారు, దోపిడి కి గురి అయిన వారు మరియు వెనుకబడిన తరగతులకు చెందిన వారి యొక్క పురోగతి కోసం ప్రయత్నాలు జరుగుతూ వున్నాయి. పశ్చిమ బెంగాల్ లో దగ్గర దగ్గరగా 90 లక్షల మంది పేద సోదరీమణులు ఉజ్జ్వల పథకం లో భాగం గా గ్యాస్ కనెక్శన్ లను అందుకొన్నారు. అదే మాదిరి గా దళిత కుటుంబాలు మరియు ఆదివాసీ పరివారాల కు చెందిన సోదరీమణులు కూడా 35 లక్షల మంది కి పైగానే ఉన్నారు.
పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ని మరియు ఆయుష్మాన్ భారత్ యోజన ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన వెను వెంటనే, ఇక్కడి ప్రజలు ప్రయోజనాల ను దక్కించుకొంటారు; రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా లేక ఆమోదించదా అనేది నేను ఎరుగను గాని ఒకవేళ అది ఆమోదించినట్లయితే, అప్పుడు ఇక్కడి ప్రజ కూడాను ఈ యొక్క పథకాల తాలూకు లాభాల ను పొందుతారు.
ఆయుష్మాన్ భారత్ లో భాగం గా, దేశం లో దాదాపు 75 లక్షల మంది పేద రోగులు గంభీరమైన రోగాల బారిన పడిన సందర్భం లో ఉచిత చికిత్స ను అందుకొన్నారన్న సంగతి ని మీకు నన్ను చెప్పనివ్వండి. మరి పేద వ్యక్తి ఒక రోగం పాలబడితే ఏమవుతుందన్నది మీరు ఊహించగలరు; ఆ వ్యక్తి బ్రతుకు మీది ఆశ ను వదలివేసుకొంటారు. ఇక పేద వ్యక్తి కి రోగాన్ని నివారించే, రోగాన్ని నయం చేసుకొనే సాయాన్ని పొందాడంటే, అదుగో అప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు అమూల్యం అవుతాయి. ఈ రోజు న నేను ప్రశాంతం గా నిదురించగలుగుతున్నాను అంటే అందుకు కారణం పేద కుటుంబాలు వారి యొక్క ఆశీర్వాదాల ను వర్షిస్తూ ఉండటమే.
అదే విధం గా, పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి లో భాగం గా, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా దేశం లోని 8 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల లో సుమారు 43,000 కోట్ల రూపాయలు జమ చేయడమైంది. ఏ దళారి లేడు, ఎటువంటి కోత గాని, మరి ఏ సిండికేట్ కు గాని తావు లేదు; ఆ మొత్తం నేరు గా అందినప్పుడు, ఏ ఒక్కరు కూడా ఎటువంటి మధ్యవర్తిత్వ రుసుము ముట్టనప్పుడు, ఎవరైనా ఆ తరహా పథకాన్ని ఎందుకు అమలుపరుస్తారు? ఈ యొక్క పథకం దేశం లో 8 కోట్ల మంది రైతుల కు ఎనలేని సహాయం గా ఉంటోంది, కానీ నా యొక్క మది లో ఎల్లప్పటికీ వేదన ను అనుభవిస్తూ ఉంటాను; విధాన రూపకర్తల కు జ్ఞానాన్ని ప్రసాదించమని ఈశ్వరుడి ని నేను సదా ప్రార్థించ దలుస్తాను. మరి ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కు వారి రోగాల నుండి వారి కి సాయపడటానికి గాను వారి కి చేరువ గా వెళ్తుందని నేను ఆశిస్తాను, అలాగే ‘ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ తాలూకు ప్రయోజనాల రూపేణా బెంగాల్ యొక్క పేద రైతుల జీవితాల లో శాంతి మరియు సంతోషం వెల్లివిరిసేటట్టు పూచీ పడాలని నేను ఆశిస్తాను. ఈ రోజు న నేను బెంగాల్ జనత యొక్క మనస్స్థి తి ని గ్రహించాను. దాని ని గురించి నాకు మంచి ఎరుక ఉన్నది. బెంగాల్ ప్రజల యొక్క బలం ఎటువంటిది అంటే ఇక ప్రజల ను మోసగించి ఈ పథకాల లబ్ది ని ఎవ్వరూ కూడా తీసుకోలేరు.
మిత్రులారా, పేద ల మరియు పల్లె ల అభివృద్ధి- దేనికోసమైతే పశ్చిమ బెంగాల్ యొక్క సాహసిక పుత్రికలు మరియు సాహసిక పుత్రులు గళమెత్తారో – అదే మన ప్రాథమ్యం అయి తీరాలి. ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క బాధ్యతో లేక ఒక ప్రభుత్వం యొక్క బాధ్యతో కాదు. ఇది కూడా సమష్టి బాధ్యత మరియు ఒక సామూహిక ప్రయత్నం. ప్రపంచం ఒక భవ్యమైనటువంటి భారతదేశం కోసం వేచి వుందో, అటువంటి 21వ శతాబ్దపు నూతన దభావ్ది లో మన అందరి ఉమ్మడి ప్రయాస లు ప్రపంచాన్ని ఎన్నటికి నిరుత్సాహపరచవు అని నేను నమ్ముతున్నాను. ఈ ప్రయత్నాలు తప్పక ప్రశంసల ను కొనితెస్తాయి.
ఈ విశ్వాసం తోను మరియు 130 కోట్ల మంది దేశవాసుల యొక్క సామర్థ్యం పట్ల, ఇంకా వారి దృఢ నిశ్చయం పట్ల అచంచలమైనటువంటి నమ్మిక తోను, నేను నా కళ్లెదుట భారతదేశం యొక్క ఉజ్జ్వలమైన భవిష్యత్తు ను దర్శిస్తున్నాను. మరి ఇదే నమ్మకం తో, మనం మన కర్తవ్య పాలన బాట లో ముందుకు కదులుదాము. మన బాధ్యతల ను నిర్వర్తించడం కోసం మనం ముందంజ వేద్దాము. 130 కోట్ల మంది దేశప్రజానీకం వారి యొక్క విధుల ను ఆచరించారంటే గనక, దేశం త్వరిత గతి న నూతన శిఖరాల ను అధిరోహించగలుగుతుంది.
ఇదే నమ్మకం తో, మరొక్క సారి, నేను మీ అందరి కి మరియు యావత్తు పశ్చిమ బెంగాల్ కు కోల్ కాతా పోర్ట్ ట్రస్ట్ యొక్క 150వ సంవత్సర వేడుకల కు గాను, ఇతర అభివృద్ధి పథకాల కు గాను నమస్కారాలు చేస్తూ అభినందన లు తెలుపుతున్నాను. ఈ నాటి ఈ యొక్క ముఖ్యమైనటువంటి సందర్భం లో మీ అందరి కి ఇవే నా శుభాకాంక్షలు.
అభినందనలు.
ఇది ప్రేరణ ను ఇచ్చేటటువంటి గడ్డ, దేశాన్ని జాగృతం చేసేటటువంటి భూమి. ఇక్కడి నుండి మనమంతా మన స్వప్నాలు కలగలిసే నినాదాన్ని ఎలుగెత్తి వినిపించుదాము. మనం మన యొక్క రెండు చేతుల ను పైకి ఎత్తి పట్టుకొని, పిడికిళ్లు బిగించి మరీ పూర్తి బలం తో పలుకుదాము-
భారత్ మాతా కీ జయ్..,
భారత్ మాతా కీ జయ్..,
భారత్ మాతా కీ జయ్.
అనేకానేక ధన్యవాదాలు.
**
मां गंगा के सानिध्य में, गंगासागर के निकट, देश की जलशक्ति के इस ऐतिहासिक प्रतीक पर, इस समारोह का हिस्सा बनना सौभाग्य की बात है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
कोलकाता पोर्ट के विस्तार और आधुनिकीकरण के लिए आज सैकड़ों करोड़ रुपए के इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास भी किया गया है। आदिवासी बेटियों की शिक्षा और कौशल विकास के लिए हॉस्टल और स्किल डेवलपमेंट सेंटर का शिलान्यास हुआ है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
इस पोर्ट ने भारत को विदेशी राज से स्वराज पाते देखा है। सत्याग्रह से लेकर स्वच्छाग्रह तक इस पोर्ट ने देश को बदलते हुए देखा है।
— PMO India (@PMOIndia) January 12, 2020
ये पोर्ट सिर्फ मालवाहकों का ही स्थान नहीं रहा, बल्कि देश और दुनिया पर छाप छोड़ने वाले ज्ञानवाहकों के चरण भी यहां पड़े हैं: PM @narendramodi
एक प्रकार से कोलकाता का ये पोर्ट भारत की औद्योगिक, आध्यात्मिक और आत्मनिर्भरता की आकांक्षा का प्रतीक है।
— PMO India (@PMOIndia) January 12, 2020
ऐसे में जब ये पोर्ट डेढ़ सौवें साल में प्रवेश कर रहा है, तब इसको न्यू इंडिया के निर्माण का भी एक प्रतीक बनाना आवश्यक है: PM @narendramodi
पश्चिम बंगाल की, देश की इसी भावना को नमन करते हुए मैं कोलकाता पोर्ट ट्रस्ट का नाम, भारत के औद्योगीकरण के प्रणेता, बंगाल के विकास का सपना लेकर जीने वाले और एक देश, एक विधान के लिए बलिदान देने वाले डॉक्टर श्यामा प्रसाद मुखर्जी के नाम पर करने की घोषणा करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
बंगाल के सपूत, डॉक्टर मुखर्जी ने देश में औद्योगीकरण की नींव रखी थी। चितरंजन लोकोमोटिव फैक्ट्री, हिन्दुस्तान एयरक्राफ्ट फैक्ट्री, सिंदरी फर्टिलाइज़र कारखाना और दामोदर वैली कॉर्पोरेशन, ऐसे अनेक बड़ी परियोजनाओं के विकास में डॉक्टर मुखर्जी का बहुत योगदान रहा है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
आज के इस अवसर पर, मैं बाबा साहेब आंबेडकर को भी याद करता हूं, उन्हें नमन करता हूं। डॉक्टर मुखर्जी और बाबा साहेब, दोनों ने स्वतंत्रता के बाद के भारत के लिए नई नीतियां दी थीं, नया विजन दिया था: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
लेकिन ये देश का दुर्भाग्य रहा कि डॉक्टर मुखर्जी और बाबा साहेब के सरकार से हटने के बाद, उनके सुझावों पर वैसा अमल नहीं किया गया, जैसा किया जाना चाहिए था: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
गुजरात के लोथल पोर्ट से लेकर कोलकाता पोर्ट तक देखें, तो भारत की लंबी कोस्ट लाइन से पूरी दुनिया में व्यापार-कारोबार होता था और सभ्यता, संस्कृति का प्रसार भी होता था: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
हमारी सरकार ये मानती है कि हमारे Coasts, विकास के Gateways हैं। इसलिए सरकार ने Coasts पर कनेक्टिविटी और वहां के इंफ्रास्ट्रक्चर को आधुनिक बनाने के लिए सागरमाला कार्यक्रम शुरू किया: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
इस योजना के तहत करीब 6 लाख करोड़ रुपए से अधिक के पौने 6 सौ प्रोजेक्ट्स की पहचान की जा चुकी है। इनमें से 3 लाख करोड़ रुपए से अधिक के 200 से ज्यादा प्रोजेक्ट पर काम चल रहा है और लगभग सवा सौ पूरे भी हो चुके हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
इस वर्ष हल्दिया में मल्टीमॉडल टर्मिनल और फरक्का में नेविगेशनल लॉक को तैयार करने का प्रयास है। साल 2021 तक गंगा में बड़े जहाज़ भी चल सकें, इसके लिए भी ज़रूरी गहराई बनाने का काम प्रगति पर है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
नदी जलमार्ग की सुविधाओं के बनने से कोलकाता पोर्ट पूर्वी भारत के औद्योगिक सेंटर्स से तो जुड़ा ही है, नेपाल, बांग्लादेश, भूटान और म्यांमार जैसे देशों के लिए व्यापार और आसान हुआ है: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
पश्चिम बंगाल के विकास के लिए केंद्र सरकार की तरफ से हर संभव कोशिश की जा रही है। विशेष तौर पर गरीबों, दलितों, वंचितों, शोषितों और पिछड़ों के विकास के लिए समर्पित भाव से प्रयास किए जा रहे हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020
जैसे ही पश्चिम बंगाल राज्य सरकार आयुष्मान भारत योजना, पीएम किसान सम्मान निधि के लिए स्वीकृति देगी, यहां के लोगों को इन योजनाओं का भी लाभ मिलने लगेगा: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 12, 2020