పిఎంఇండియా
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ వన్యప్రాణి సంరక్షణ, వన్యప్రాణుల అక్రమ తరలింపు నిరోధంలో సహకారానికి భారత అమెరికా సంతకాలు చేసిన అవగాహనా ఒప్పందానికి (ఎంఓయు) ఆమోదముద్ర వేసింది. ఈ ఒప్పందానికి ఆమోదముద్ర వేయడంతో వన్యప్రాణులు, వాటి సంతానం సంరక్షించడంలో అమెరికా సంస్థలకు గల నైపుణ్యాన్ని భారత్ ఉపయోగించగలుగుతుంది.
నేపథ్యం
భారత, అమెరికాలకు అద్భుతమైన జీవవైవిధ్యం, ప్రకృతి సంపద ఉన్నాయి. తమ తమ భూభాగాల్లో సంరక్షణ కేంద్రాల నెట్ వర్క్ ఏర్పాటు చేశాయి. ఉభయ దేశాలు ఈ విభాగంలో వృత్తిపరమైన నైపుణ్యాలను పంచుకునేందుకు విస్తృత అవకాశాలున్నాయి. ఆ తరహా సహకారానికి ఈ ఎంఓయు చక్కని వేదిక అవుతుంది. ఈ దిగువ విభాగాల్లో సహకారం విస్తరించుకునేందుకు ఎంఓయు వీలు కల్పించింది…